E-Paper
Advertisement

పండుగ ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. విశాఖకు ప్రత్యేక రైళ్లు!

పండుగ ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. విశాఖకు ప్రత్యేక రైళ్లు!
Advertisement

Bengaluru Visakhapatnam Special Train: పండుగల సీజన్‌ మొదలుకానుంది. అక్టోబర్, నవంబర్ నెలల్లో దసరా, దీపావళి పండుగలతో రైళ్లలో ప్రయాణికుల రద్దీ సాధారణం కంటే ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ముఖ్యంగా బెంగళూరు నుంచి సొంతూళ్లకు వెళ్లే వారితో పాటు ముంబై, విశాఖపట్నం వైపు ప్రయాణించే వారి సంఖ్య పెరగనుంది. ఈ నేపథ్యంలో  రైల్వేశాఖ బెంగళూరు నుంచి ముంబై, విశాఖపట్నం మధ్య ప్రత్యేక రైళ్లను నడపాలని నిర్ణయించింది.

ముంబైకి వారానికి ఓ ప్రత్యేక రైలు

బెంగళూరు–ముంబై మార్గంలో రెండు ప్రత్యేక రైళ్లను అందుబాటులోకి తీసుకురానున్నారు. రైలు నంబర్ 01013 ప్రతి శనివారం CSMT ముంబై నుంచి బయలుదేరుతుంది. అక్టోబర్ 10 నుంచి నవంబర్ 21 వరకు ఈ సర్వీసు కొనసాగుతుంది. ముంబై నుంచి మధ్యాహ్నం 12:35 గంటలకు బయలుదేరే ఈ రైలు దాదాపు 24 గంటల ప్రయాణం తర్వాత రాత్రి 11:55 గంటలకు SMVT బెంగళూరు చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో రైలు నంబర్ 01014 ప్రతి ఆదివారం బెంగళూరు నుంచి బయలుదేరుతుంది. అక్టోబర్ 11 నుంచి నవంబర్ 22 వరకు ఈ సర్వీసు ఉంటుంది. SMVT బెంగళూరు నుంచి ఉదయం 4:30 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 4:05 గంటలకు CSMT ముంబై చేరుకుంటుంది. ఈ రెండు సర్వీసులు ప్రతి దిశలో ఏడు ట్రిప్పులు నడపనున్నాయి.

కీలక స్టేషన్ల మీదుగా ప్రయాణం

Advertisement

ముంబై–బెంగళూరు ప్రత్యేక రైళ్లకు పలు కీలక స్టేషన్లలో హాల్టులు ఉంటాయి. దాదర్, థానే, కళ్యాణ్, లోనావాలా, పుణే, లోనంద్, సతారా, కరాడ్, సాంగ్లీ, మిరాజ్ లాంటి ప్రాంతాల ప్రయాణికులకు ఇవి ఉపయోగపడనున్నాయి. ఆ తర్వాత కుడచి, రాయ్‌ బాగ్, ఘట్‌ ప్రభ, బెళగావి, లోండా, ధార్వాడ్, హుబ్బళ్లి, హావేరి, రాణిబెన్నూరు, హరిహర్, దావణగెరె, బీరూర్, అర్సికెరె, తుమకూరు మీదుగా రైలు బెంగళూరుకు చేరుకుంటుంది.

విశాఖపట్నానికి ప్రత్యేక సర్వీసులు

బెంగళూరు నుంచి విశాఖపట్నం వెళ్లే ప్రయాణికులకు కూడా రైల్వే ప్రత్యేక సర్వీసులు ప్రకటించింది. రైలు నంబర్ 08583 ప్రతి మంగళవారం విశాఖపట్నం నుంచి బయలుదేరుతుంది. అక్టోబర్ 6 నుంచి నవంబర్ 24 వరకు ఈ రైలు నడుస్తుంది.

Advertisement

విశాఖపట్నం నుంచి సాయంత్రం 7 గంటలకు బయలుదేరి మరుసటి రోజు మధ్యాహ్నం 12:45 గంటలకు SMVT బెంగళూరు చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ప్రత్యేక రైలు ప్రతి బుధవారం బెంగళూరు నుంచి బయలుదేరుతుంది. అక్టోబర్ 7 నుంచి నవంబర్ 25 వరకు ఈ సర్వీసు అందుబాటులో ఉంటుంది. SMVT బెంగళూరు నుంచి మధ్యాహ్నం 3:50 గంటలకు బయలుదేరి మరుసటి రోజు మధ్యాహ్నం 1:30 గంటలకు విశాఖపట్నం చేరుకుంటుంది.

ఆంధ్రప్రదేశ్, తమిళనాడుకూ కనెక్టివిటీ

బెంగళూరు–విశాఖ ప్రత్యేక రైలు మార్గంలో దువ్వాడ, అనకాపల్లి, సామర్లకోట, రాజమండ్రి, ఏలూరు, విజయవాడ, ఒంగోలు, నెల్లూరు, గూడూరు వంటి ముఖ్య స్టేషన్లలో హాల్టులు ఉంటాయి. ఆ తర్వాత రేణిగుంట, కాట్పాడి, జోలార్‌పేట, బంగారుపేట, కేఆర్ పురం మీదుగా బెంగళూరుకు చేరుకుంటుంది.

Read Also: దసరా, దీపావళికి రైల్వే గుడ్‌న్యూస్.. 102 స్పెషల్ రైళ్లు!

Tags

Related News

భారతీయులకు ఉచిత వీసా ఇస్తున్న మలేషియా.. కానీ ఉద్యోగం చేయాలంటే ఈ కండీషన్స్ తప్పనిసరి

దసరా, దీపావళికి రైల్వే గుడ్‌న్యూస్.. 102 స్పెషల్ రైళ్లు!

బర్త్ టూరిజానికి గట్టి భారీ షాక్.. అమెరికా కొత్త వీసా రూల్స్!

రైలు అద్దం నుంచి బుల్లెట్‌లా దూసుకొచ్చిన రాయి.. దురంతోపై దాడి? ఇదిగో ఆ షాకింగ్ వీడియో!

రైలులో సైకో కిల్లర్.. ఖాకీ దుస్తుల్లో వచ్చి డ్రామాలు.. ప్రయాణికులను బయటకు తోసేస్తూ దారుణాలు!

ఏంటీ ఈ బుల్లి పాకెట్ వెనుక.. 150 ఏళ్ల చరిత్ర ఉందా? పైగా కాయిన్స్ కోసం కాదా!

రైల్వే బోర్డులు పసుపు రంగులోనే ఎందుకుంటాయో తెలుసా? ఆశ్చర్యపరిచే నిజాలు!

Big Stories

Advertisement
×