Kolkata Metro: మెట్రోలో ప్రయాణీకులు కొట్లాడుకోవడం తరచుగా చూస్తూనే ఉంటాం. కొంత మంది రీల్స్ కూడా చేస్తుంటారు. ఆ మధ్య కొంత మంది మెట్రోలో హోలీ ఆడుతూ హల్ చల్ చేశారు. అయితే, కొంత మంది ప్రయాణీకులు మెట్రోలో చిల్లర వేశాలు వేస్తుంటారు. తాజాగా కోల్ కతా మెట్రోలో ఓ ప్రయాణీకుడు చేసిన పని సర్వత్రా తీవ్ర విమర్శకుల కారణం అవుతోంది. నెటిజన్లు నిప్పులు చెరుగుతున్నారు. పట్టుకొని వీపు చింతపండు చేయాలంటున్నారు.
ఇంతకీ అసలు ఏం జరిగిందంటే?
తాజాగా ఓ వ్యక్తి కోల్ కతాలో మెట్రో రైలు ఎక్కాడు. బ్లూ కలర్ టీ షర్ట్, జీన్స్ ధరించి జెంటిల్ మ్యాన్ లా కనిపించాడు. కానీ, చేసిన పనే చాలా చెత్తగా ఉంటుంది. మెట్రో రన్నింగ్ లో ఉండగా, ఓ కోచ్ డోర్ ను తన వెంట తెచ్చుకున్న బ్లాక్ స్ప్రేతో పిచ్చి గీతలు గీశాడు. మెట్రో డోర్ తో పాటు పై భాగంలోనూ బ్లాక్ స్ప్రేతో అడ్డ దిడ్డంగా పెయింట్ చేశాడు. చక్కటి మెట్రోన్ దర్టీగా మార్చాడు. ఈ తతంగం అంతా మెట్రోలోని సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యింది. ఈ వీడియోను మెట్రో సంస్థ సోషల్ మీడియాలో షేర్ చేసింది. అంతేకాదు, రైలును ధ్వంసం చేసిన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సదరు వ్యక్తిని పట్టుకుందుకు ప్రయత్నిస్తున్నారు. సీసీ కెమెరా వీడియోల ద్వారా నిందితుడిని గుర్తించే ప్రయత్నం చేస్తున్నారు.
#KolkataMetro #train passenger sprays paint to deface aesthetic look of the rake #CCTV #CCTVfootage #KolkataMetroRailway pic.twitter.com/RHSdV00WPX
— Shaheryar Hossain (@hossain_shaher) July 23, 2025
Read Also:అహ్మదాబాద్ సీన్ రిపీట్, విమానం కూలి 49 మంది సజీవదహనం!
మెట్రో అధికారులు ఏన్నారంటే?
కోల్ కతాలో ప్రయాణీకుడి అనుచిత ప్రవర్తనపై మెట్రో అధికారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. “కోల్ కతాకు గర్వకారణం అయిన మెట్రోలో ఇలాంటి చర్య కారణంగా ప్రతిష్ట దెబ్బతిన్నది. మెట్రో వినియోగదారుల మనోభావాలను తీవ్రంగా దెబ్బ తీసింది” అని మెట్రో అధికారులు తెలిపారు. “మెట్రో ప్రాంగణంలో ఇలాంటి చర్యలకు పాల్పకూడదని అందరినీ హెచ్చరిస్తున్నాం. ట్రైన్ రేక్ లు, స్టేషన్లు CCTV నిఘాలో ఉన్నాయి. నేరస్థులను గుర్తించడం సులభం. ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడుతున్న వారిని త్వరగా పట్టుకుని చట్టపరమైన చర్యలు తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు పోలీసులు” అని చెప్పుకొచ్చారు. అటు మెట్రో రైల్వే అధికారులతో పాటు పోలీసులు, నేరస్తుడిని పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. త్వరలోనే అతడిని అరెస్ట్ చేస్తామని పోలీసులు తెలిపారు. ఇకపై ఎవరూ ఇలాంటి పనులకు పాల్పడిన కఠిన చర్యలు తీప్పవని హెచ్చరించారు.
Read Also: సికింద్రాబాద్ నుంచి కేరళకు వెళ్తున్నారా? అయితే మీకో గుడ్ న్యూస్!