Revised Hyderabad Metro Fare Chart: హైదరాబాద్ మెట్రో రీసెంట్ గా టికెట్ ధరలను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఒకేసారి 20 శాతం ధరలు పెంచింది. ఒకేసారి భారీగా ధరలు పెరగడంతో ప్రయాణీకుల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చింది. టికెట్ ధరలను తగ్గించాలని డిమాండ్ చేశారు. విపక్ష నాయకులు ఏకంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లేఖలు రాశారు. ధరలు తగ్గించాలని డిమాండ్ చేశారు. మెట్రో ధరలు పెరిగితే, ప్రయాణీకులు ప్రత్యామ్నాయ మార్గాలను అణ్వేషించే అవకాశం ఉందని, ఫలితంగా నగరంలో ట్రాఫిక్ సమస్య మళ్లీ తలెత్తుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రయాణీకుల ఆగ్రహం, విపక్షాల ఆందోళనతో మెట్రో సంస్థ వెనక్కి తగ్గింది. పెంచిన ధరలను సవరించింది. 10 శాతం తగ్గిస్తున్నట్లు ప్రకటించింది.
సవరించిన ధరల లిస్టు విడుదల
మెట్రో రీసెంట్ గా 20 శాతం ధరలు పెంచగా, ఆ తర్వాత 10 శాతం తగ్గిస్తున్నట్లు పెరిగింది. ఈ నిర్ణయంతో టికెట్ల ధరల్లో మార్పులు చోటు చేసుకున్నాయి. మెట్రోలో కనీస టికెట్ ధరలు రూ. 10 నుంచి 12కు చేరగా, గరిష్ట ఛార్జీ రూ. 60 నుంచి రూ. 75కు పెరిగింది. ఇప్పుడు 10 శాతం డిస్కౌంట్ ప్రకటించడంతో కనిష్ట ఛార్జీ రూ. 12 నుంచి రూ. 11కు తగ్గింది. గరిష్ట ఛార్జీ రూ. 75 నుంచి రూ. 69కి తగ్గింది. తగ్గించిన ధరలు ఇవాళ్టి నుంచి అంటే, మే 24 నుంచి అమల్లోకి వచ్చాయి. పేపర్, క్యూఆర్ టోకెన్, డిజిటల్ టికెట్లు, స్మార్ట్ కార్డులు సహా అన్ని టికెట్లపై ఈ డిస్కౌంట్ వర్తిస్తుందని మెట్రో మేనేజ్ మెంట్ ప్రకటించింది.
Read Also: ఈ రైల్వే స్టేషన్ లో ఉమ్ము వేస్తే రూ.32 లక్షల జరిమానా.. మింగేస్తే బెటర్!
10 శాతం డిస్కౌంట్ తర్వాత సవరించిన ఛార్జీలు
⦿ మొదటి 2 కి.మీ. వరకు రూ. 11
⦿ 2 నుంచి 4 కి.మీ. వరకు రూ. 17
⦿4 నుంచి 6 కి.మీ. వరకు రూ. 28
⦿ 6 నుంచి 9 కి.మీ. వరకు రూ. 37
⦿ 9 నుంచి 12 కి.మీ. వరకు రూ. 47
⦿12 నుంచి 15 కి.మీ. వరకు రూ. 51
⦿15 నుంచి 18 కి.మీ. వరకు రూ. 56
⦿18 నుంచి 21 కి.మీ. వరకు రూ. 61
⦿ 21 నుంచి 24 కి.మీ. వరకు రూ. 65
⦿ 24 కి.మీ. నుంచి ఆ తర్వాత రూ. 69
Read Also: ఇండియన్ రైల్వేలోకి కొంకణ్ రైల్వే విలీనం.. ఇన్నాళ్లూ అది ప్రత్యేకంగా ఎందుకు ఉంది?
ప్రయాణీకుల ఫీడ్ బ్యాక్ తో ధరలను సవరించాల్సి వచ్చిందని మెట్రో యాజమాన్యం ప్రకటించింది. తక్కువ ధరలోనే ప్రజలు ప్రయాణాలను కొనసాగించేలా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. ప్రయాణీకులు 10 శాతం తగ్గింపు ధరతో మెరుగైన ప్రయాణ అనుభవాన్ని పొందవచ్చని వెల్లడించింది. హైదరాబాద్ మెట్రో సవరించిన ధరలపై ప్రయాణీకులు కూడా కాస్త సంతృప్తిగానే ఉన్నారు. 20 శాతం ధరల పెంపుతో పోల్చితే, 10 శాతం పెంపు ఫర్వాలేదు అంటున్నారు.
Read Also: సికింద్రాబాద్ to ఢిల్లీ.. తెలంగాణ ఎక్స్ ప్రెస్, వందే భారత్ స్లీపర్ లో ఏది బెస్ట్? ఏది ఫాస్ట్?