E-Paper
Advertisement

విమానాల్లో అగ్ని ప్రమాద ఘటనలు.. పవర్ బ్యాంకులపై DGCA నిషేధం! ఇంకా ఏంటంటే..

విమానాల్లో అగ్ని ప్రమాద ఘటనలు.. పవర్ బ్యాంకులపై  DGCA నిషేధం! ఇంకా ఏంటంటే..
Advertisement

DGCA Bans Power Bank: విమానాల్లో అగ్ని ప్రమాద ఘటనలు తీవ్రమవుతున్న నేపథ్యంలో డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్-DGCA కీలకమైన నిర్ణయం తీసుకుంది. ఇకపై విమాన ప్రయాణాల్లో పవర్ బ్యాంక్‌ను నిషేధించాలని డిసైడ్ అయ్యింది. కాకపోతే ఓ కంపెనీకి చెందిన పవర్ బ్యాంక్ పై తొలుత ఫోకస్ చేసింది. ఆ తర్వాత మిగతా వాటికి విస్తరించే అవకాశముంది.

విమానాల్లో అగ్ని ప్రమాద ఘటనలు, అలర్టయిన DGCA

మొబైల్ ఛార్జింగ్ అయిపోయినప్పుడు పవర్ బ్యాంకులు చాలా ఉపయోగపడతాయి. అయితే విమాన ప్రయాణాల్లో పవర్ బ్యాంక్‌ మీ వెంట తీసుకెళ్తేవారికి ముఖ్యమైన వార్త. ఇటీవల ఇండిగో విమానంలో జరిగిన అగ్ని ప్రమాద ఘటన నేపథ్యంలో డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్-DGCA అలర్టయ్యింది. ఈ క్రమంలో విమానాల్లో పవర్ బ్యాంకులను నిషేధం విధించే దిశగా అడుగులు వేస్తోంది.

తొలి విడత ఆ పవర్ బ్యాంకుపై DGCA నిషేధం!

Advertisement

దేశీయ విమానాలతోపాటు భారత్‌కు వచ్చే అన్ని విమానాలలో మోబికిన్స్ MK-PB-04 మోడల్ పవర్ బ్యాంక్‌ను తీసుకువెళ్లడాన్ని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్-DGCA నిషేధించింది. ఈ నిబంధన క్యాబిన్ బ్యాగేజ్, చెక్ ఇన్ బ్యాగేజ్, కార్గోకు వర్తించనుంది. ఈ మోడల్‌ను ఎట్టి పరిస్థితుల్లోనూ విమానంలోకి తీసుకెళ్లకూడదు. ఈ రకమైన పవర్ బ్యాంక్‌ను గుర్తించి విమానాల్లోకి తీసుకెళ్లకుండా నిరోధించాలని విమానయాన సంస్థలకు ఆదేశాలు జారీ చేసినట్టు సమాచారం.

ముఖ్యమైన విషయం ఏంటేంటే.. DGCA అన్ని పవర్ బ్యాంక్‌లను నిషేధించలేదు. ఈ నిషేధం కేవలం MOBIKINS MK-PB-04 మోడల్‌కు మాత్రమే. మీరు వేరే బ్రాండ్ గల పవర్ బ్యాంక్‌ను ఉపయోగిస్తే ఆందోళన అవసరం లేదు. ప్రయాణికులు ట్రావెల్ కు ముందు తమతమ పవర్ బ్యాంక్ మోడల్‌ను చెక్ చేసుకోండి. విమానంలో భద్రతా నిబంధనలను పాటించండి. పవర్ బ్యాంక్‌ను కొనుగోలు చేసేటప్పుడుదాని నాణ్యత, అవసరమైన భద్రతా ధృవీకరణ పత్రాలను తప్పకుండా చెక్ చేయాలి. పవర్ బ్యాంక్ ఉబ్బిపోయినా, అధికంగా వేడెక్కినా, మరే విధంగా దెబ్బతిన్నా దాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపయోగించవద్దు.

అసలు ఇండిగో విమానంలో ఏం జరిగింది?

Advertisement

నాలుగు రోజుల కిందట అంటే అక్టోబర్ 11న ఢిల్లీ నుండి చెన్నై వెళ్తోంది ఇండిగో విమానం. ఓ ప్రయాణికుడి పవర్ బ్యాంక్‌కు మంటలు అంటుకున్నాయి. ఆ పవర్ బ్యాంక్‌ విమానంలోని లగేజీ కంపార్ట్‌మెంట్‌లో ఉంది. విమానం అంతటా పొగ దట్టంగా వ్యాపించడంతో భద్రతా కారణాల దృష్ట్యా విమానాన్ని హైదరాబాద్‌లో సురక్షితంగా ల్యాండ్ చేశారు. ఆ ఘటన సమయంలో విమానంలో 191 మంది ప్రయాణికులు-సిబ్బంది ఉన్నారు. విమానాన్ని తనిఖీ చేసి ప్రయాణికులను చెన్నైకి తరలించడానికి మరో విమానాన్ని ఏర్పాటు చేశారు.

ALSO READ: మొబైల్ కొట్టేయబోతే.. ప్రాణాల మీదికి వచ్చింది.. రైల్వే స్టేషన్ లో షాకింగ్ ఘటన!

కార్గోలో కూడా వాటిని అనుమతించకూడదని విమానయాన సంస్థలకు ఆదేశాలిచ్చింది DGCA. పవర్ బ్యాంకుల తయారీలో లిథియం అయాన్ లేదా లిథియం పాలిమర్ బ్యాటరీలను వినియోగిస్తారు. ఒక్కోసారి అంతర్గత షార్ట్ సర్క్యూట్, ఇతర కారణాల వల్ల ఆయా బ్యాటరీలు అధిక వేడికి గురై పేలుడుు దారి తీస్తాయన్నది ఆటోమెబైల్ తయారీ నిపుణుల మాట.

Related News

మొబైల్ కొట్టేయబోతే.. ప్రాణాల మీదికి వచ్చింది.. రైల్వే స్టేషన్ లో షాకింగ్ ఘటన!

రైలు ప్రయాణంలో నవరాత్రి జోష్.. లోకల్ ట్రైన్‌లో మహిళల ‘గర్భా’ డ్యాన్స్.. నెటిజన్లు ఫిదా!

సినిమా చూస్తూ ఆటో డ్రైవింగ్.. డ్రైవర్‌పై సీపీ సజ్జనార్ సీరియస్!

భక్తుల కోసం టీటీడీ కొత్త యాప్.. ‘వేంకటాద్రి’ ప్రత్యేకతలు ఇవే!

బీహార్ యువకుడితో రష్యా యువతి ప్రేమ.. గుడిసెలోనే ఉంటానంటూ ఇండియాకు వచ్చేసి..

ఎయిరిండియా విమానానికి హైజాక్ ముప్పు.. జైపూర్‌లో ఎమర్జెన్సీ ల్యాండింగ్, అసలు ఏం జరిగింది?

జోగులాంబ దర్శనానికి వెళ్లేవారికి గుడ్‌న్యూస్.. హైదరాబాద్ నుంచి బస్సులు!

Big Stories

Advertisement
×