Beggar Travelling In Vande Bharat: భారతీయ రైల్వేలో సరికొత్త రైలుగా వందేభారత్ ఎక్స్ ప్రెస్ అందుబాటులోకి వచ్చింది. ప్రపంచ స్థాయి సౌకర్యాలతో, అత్యంత వేగంతో మెరుగైన సేవలు అందిస్తోంది. ఇతర రైళ్లతో పోల్చితే టికెట్ ధర ఎక్కువగా ఉన్నప్పటికీ, ఎక్కువ మంది ఇందులో ప్రయాణించేందుకు మొగ్గు చూపుతున్నారు. ఈ సెమీ హైస్పీడ్ రైల్లోకి బిచ్చగాళ్లను అనుమతించరు. అయినప్పటికీ, తాజాగా ఓ బిచ్చగాడు రైల్లో ప్రయాణించాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది. రైల్లో అతడిని చూసి అందరూ షాకయ్యారు. వందేభారత్ లో బిచ్చగాడా? అంటూ ఆశ్చర్యపోయారు. తాజాగా ఈ బిచ్చగాడి ప్రయాణం వెనుక అసలు కథ బయటకు వచ్చింది.
వందేభారత్ లోకి బిచ్చగాడు.. ఇదీ అసలు కథ!
ఈ వైరల్ వీడియోను ‘ఎక్స్ పెరిమెంట్ కింగ్’ అనే యూట్యూబ్ ఛానెల్ లో షేర్ చేయబడింది. శివరాజ్ అనే యువకుడు బిచ్చగాడి వేశంలో వందేభారత్ లోకి రావడంతో అందరూ ఆశ్చర్యపోయారు. నిజానికి అతడు బిచ్చగాడు కాదు. ఒకవేళ వందేభారత్ లోకి బిచ్చగాడు వస్తే ఎలా రియాక్ట్ అవుతారో తెలుసుకునేందు అలా వేషం వేశాడు. తొలిరోజు ఉదయం 5.30 గంటలకు జైపూర్ నుంచి బయల్దేరి శతాబ్ది ఎక్స్ ప్రెస్ రైలు ఎక్కాడు శివరాజ్. రైలు అధికారులు శివ రాజ్‌ను టికెట్ చూపించమని అడుగుతారు. శివరాజ్ తన టికెట్ చూపించి తన సీటులో కూర్చుంటాడు. రైలు లోపల ఉన్న వ్యక్తులు కొంత మంది పాజిటివ్ గా స్పందిస్తే, మరికొంత మంది నెగెటివ్ గా స్పందించారు. మరుసటి రోజు ఉదయం 6.23 గంటలకు, బిచ్చగాడి వేషంలో చండీగఢ్- అజ్మీర్ వందే భారత్ రైలు ఎక్కాడు. టీటీఈ అతడిని రైలు ఎక్కకూడదంటాడు. కానీ, అతడు టికెట్ చూపించడంతో టీటీఈ కూడా అతడిని ఏమీ అనలేకపోయాడు. ప్రయాణీకులు కూడా అతడిని వింతగా చూస్తారు. వెళ్లి తన సీటులో కూర్చొని ప్రయాణం చేశాడు.
శివరాజ్ తో పాటు రైలు ఎక్కిన టీమ్
నిజానికి శివరాజ్ తో పాటు అతడి టీమ్ కూడా రైలు ఎక్కింది. ఆయనకు ఎదురయ్యే అనుభవాన్ని షూట్ చేయడం మొదలు పెట్టింది. కానీ, టీమ్ మెంబర్స్ ఎవరూ అనేది ఇతర ప్రయాణీకులకు తెలియకుండా జాగ్రత్త పడ్డారు. శివను టీటీఈ సహా ఇతర ప్రయాణీకులు వింతగా చూడ్డం మొదలుకొని, కొంత మంది అసహనం వ్యక్తం చేయడం వరకు ఈ వీడియోలో కనిపించింది. శివ దగ్గర టికెట్ ఉన్నప్పటికీ కొంత మంది బయటకు పంపించాలని అన్నట్లు వ్యహరించారు. కానీ, అతడి దగ్గర టికెట్ ఉండటంతో ఎవరూ దింపే ప్రయత్నం చేయలేదు. మొత్తంగా ఈ ఎక్స్ పరిమెంట్ వీడియో సూపర్ సక్సెస్ అయ్యింది. ఇప్పటికే 3 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించాయి. నెటిజన్లు ఈ వీడియోను చూసి ఫన్నీగా రియాక్ట్ అవుతున్నారు. అతడి టెస్టింగ్ ను అభినందిస్తున్నారు.
Read Also: చివరి నిమిషంలో జర్నీ క్యాన్సిల్ అయ్యిందా? సింఫుల్ గా మీ టికెట్ వేరొకరికి ట్రాన్స్ ఫర్ చేయండి!