Hyderabad Traffic: జూన్ 2న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను వైభవంగా నిర్వహించేందుకు రేవంత్ సర్కార్ సన్నాహాలు చేస్తోంది. ఈ సందర్భంగా హైదరాబాద్ నగర వ్యాప్తంగా పలు వేడుకుల ఘనంగా నిర్వహించనుంది తెలంగాణ ప్రభుత్వం. దీనిలో భాగంగానే కొన్ని ఏరియాల్లో రోడ్లను బ్లాక్ చేయడంతో పాటు ట్రాఫిక్ డైవర్షన్స్ ఉండనున్నట్టు అధికారులు తెలిపారు. రేపు ఉండబోయే వేడుకులను దృష్టిలో ఉంచుకుని.. నిబంధనలు, ట్రాఫిక్ మళ్లింపు మొదలైన అంశాలపై పోలీస్ శాఖ గైడ్ లైన్స్ రిలీజ్ చేసింది. రేపు ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు గన్ పార్క్, పరేడ్ గ్రౌండ్స్ రూట్లలో డైవర్షన్ ఉంటుందని అధికారులు వివరించారు.
సైఫాబాద్ ద్వారక హోటల్ నుంచి వచ్చే వాహనాలను హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్ జంక్షన్ వరకు వెళ్లకుండా.. రవీంద్ర భారతి వద్ద ఇక్భాల్ మినార్ జంక్షన్ రూట్ లో అధికారులు డైవర్ట్ చేయనున్నారు. అదే విధంగా నాంపల్లి టీ జంక్షన్ నుంచి వచ్చే ట్రాఫిక్ రంవీంద్ర భారతి వైపు వెళ్లకుండా ఏఆర్ పెట్రోల్ పంప్ దగ్గర నుంచి బీజేఆర్ విగ్రహం వైపు అధికారులు మళ్లించనున్నారు. దీంతో రవీంద్ర భారతి, ఏఆర్ పెట్రోల్ పంప్, హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్ జంక్షన్ ల వద్ద ట్రాఫిక్ ఎక్కువగా ఉండే ఛాన్స్ ఉంది. వాహనదారులు పంజాగుట్ట నుంచి గ్రీన్ లాండ్స్, బేగంపేట్ నుంచి సికింద్రాబాద్ రూట్ల ప్రయాణించకూడదని అధికారులు సూచించారు. పరేడ్ గ్రౌండ్స్‌లో ఆవిర్భావ వేడుకలు ఉన్నందున ఆ రూట్లలో ప్రయాణం చేయొద్దని తెలిపారు. టివోలీ ఎక్స్ రోడ్, ప్లాజా ఎక్స్ రోడ్లను పూర్తిగా క్లోజ్ చేస్తున్నట్టు అధికారులు వివరించారు.
ALSO READ: Telangana Movement: తెలంగాణ ఉద్యమంలో రియల్ హీరోలు వీళ్లే..! ప్రపంచంలో మరెక్కడా జరిగిన విధంగా..
⦿ ట్రాఫిక్ డైవర్షన్స్ వివరాలివే..
⦿ బేగంపేట నుంచి సంగీత్ X రోడ్ల వైపు వచ్చే ట్రాఫిక్‌ను CTO X రోడ్ల వద్ద బాలమ్రాయ్, టివోలి, స్వీకార్ ఉపకార్, వైఎంసీఏ, సెయింట్ జాన్స్ రోటరీ మీదుగా సంగీత్ ఎక్స్ రోడ్ల వైపు ట్రాఫిక్‌ను మళ్లించనున్నారు.
⦿ సంగీత్ X రోడ్డు నుంచి బేగంపేట వైపు వచ్చే ట్రాఫిక్‌ను YMCA వద్ద క్లాక్ టవర్, ప్యాట్నీ, ప్యారడైజ్, సీటీఓ, రసూల్‌పురా వైపు మళ్లించనున్నారు.
⦿ బోయిన్‌పల్లి, తాడ్‌బండ్, టివోలి నుంచి ప్లాజా వైపు వచ్చే ట్రాఫిక్‌ను టివోలి, స్వీకార్ ఉపకార్, వైఎంసీఏ, సెయింట్ జాన్స్ రోటరీ మీదుగా అధికారులు డైవర్ట్ చేస్తారు.
⦿ బోయిన్‌పల్లి, తాడ్‌బండ్ నుండి టివోలి వైపు వెళ్లే ట్రాఫిక్‌ను బ్రూక్ బాండ్ వద్ద CTO, రాణిగంజ్, ట్యాంక్‌బండ్ వైపు డైవర్ట్ చేయనున్నారు.
⦿ అలుగడ్డబావి, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి వచ్చే ట్రాఫిక్‌ను సంగీత్ ఎక్స్ రోడ్ల వద్ద క్లాక్ టవర్, ప్యాట్నీ, ప్యారడైజ్ వైపు మళ్లించనున్నారు.
⦿ హైదరాబాద్ RTA తిరుమలగిరి, కార్ఖానా నుంచి ప్లాజా వైపు వచ్చే ట్రాఫిక్‌ను టివోలి వద్ద స్వీకార్ ఉపకార్, YMCA లేదా బ్రూక్ బాండ్, బాలమ్రాయ్, CTO వైపు మళ్లించన్నారు.
ట్రాఫిక్ ను డైవర్ట్ చేస్తుండటంతో చాలా చోట్ల రద్దీ ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. అందులో ముఖ్యంగా చిలకల్‌గూడ ఎక్స్ రోడ్, అలుగడ్డబాయి ఎక్స్ రోడ్ల, సంగీత్ ఎక్స్ రోడ్, YMCA ఎక్స్ రోడ్, ప్యాట్నీ X రోడ్, SBH X రోడ్, ప్లాజా, CTO జంక్షన్, బ్రూక్ బాండ్ జంక్షన్, టివోలి జంక్షన్, స్వీకర్ ఉపకార్ జంక్షన్, సికింద్రాబాద్ క్లబ్, త్రిముల్‌ఘేరీ ఎక్స్ రోడ్లు, తాడ్‌బండ్ ఎక్స్ రోడ్లు, సెంటర్ పాయింట్, డైమండ్ పాయింట్, బోయిన్‌పల్లి ఎక్స్ రోడ్లు, బేగంపేట, ప్యారడైజ్ ఉన్నాయి.
ALSO READ: Brohmatsavam: జూన్ 3 నుంచి హైదరాబాద్‌లో వైభవంగా టీటీడీ ఆలయ బ్రహ్మోత్సవాలు
హైదరాబాద్ వాసులందరూ, వాహనాదారులు ఈ డైవర్షన్స్ ను దృష్టిలో ఉంచుకోవాలని పోలీసులు సూచించారు. ట్రాఫిక్ అప్ డేట్స్ కోసం.. ఏమైనా సందేహాలు ఉంటే హెల్ప్‌లైన్ నంబర్ 9010203626 కు కాల్ చేయవచ్చు.