E-Paper
Advertisement

Vande Bharat Trains: ప్రయాణీకులకు అలర్ట్.. ఆ వందేభారత్ రైళ్ల టైమింగ్స్ మార్చిన అధికారులు!

Vande Bharat Trains: ప్రయాణీకులకు అలర్ట్.. ఆ వందేభారత్ రైళ్ల టైమింగ్స్ మార్చిన అధికారులు!
Advertisement

Vande Bharat Express Trains New Timeings: వందేభారత్ ఎక్స్ ప్రెస్ రైళ్లకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. పలు రైళ్లకు సంబంధించి సమయాల్లో మార్పులు చేసినట్లు వెల్లడించింది.  ఈ మేరకే రైల్వే అధికారిక ప్రకటన చేసింది. ఇంతకీ ఏ రైళ్లకు సంబంధించిన టైమింగ్స్ మార్చిందనేది ఇప్పుడు తెలుసుకుందాం..

ఈ నెల 15 నుంచి సమయాల్లో మార్పులు

యశ్వంతపూర్‌- కాచిగూడ- యశ్వంతపూర్‌, కలబురగి-బెంగళూరు-కలబురగి వందేభారత్‌ ఎక్స్‌ ప్రెస్‌ రైళ్లకు సంబంధించి సమయాల్లో మార్పులు చేర్పులు చేస్తున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఈ నెల 15 నుంచి మార్పు చేసినట్లు ప్రకటించారు.

యశ్వంతపూర్‌-కాచిగూడ (20704) ఎక్స్‌ ప్రెస్‌  

Advertisement

యశ్వంతపూర్‌-కాచిగూడ (నెం.20704) ఎక్స్‌ ప్రెస్‌  ఇప్పటి వరకు మధ్యాహ్నం 3.45 గంటలకు హిందూపూరం స్టేషన్ కు వచ్చేది. కానీ, ఈ నెల 15 నుంచి 3.55 గంటలకు హిందూపురం స్టేషన్‌ కు వచ్చేది. ఇదే రైలు తిరుగు ప్రయాణంలో రైలు(నెం.20705) మధ్యాహ్నం 12.08 గంటలకు బదులుదేరి 12.17 గంటలకు హిందూపురం వస్తుందని రైల్వే అధికారులు వివరించారు.

కలబురగి-బెంగళూరు వందేభారత్‌(22231) ఎక్స్‌  ప్రెస్‌

కలబురగి-బెంగళూరు వందేభారత్‌ ఎక్స్‌ ప్రెస్‌ (నెం. 22231) రైలు ఇప్పటి వరకు శ్రీ సత్య సాయి ప్రశాంతి నిలయం రైల్వే స్టేషన్‌కు ఉదయం 11 గంటలకు వచ్చేది. కానీ, ఈ నెల 15 నుంచి 11.13 గంటలకు చేరుకుంటుంది. యల్హంక స్టేషన్‌ కు మధ్యాహ్నం 12.28 గంటలకు బదులు 12.30 గంటలకు చేరుతుందని అధికారులు తెలిపారు. బెంగళూరు-కలబురగి వందే భారత్‌ రైలు (నెం. 22232) యల్హంక స్టేషన్‌కు ఇకపై మధ్యాహ్నం 3.05 గంటలకు బదులు 3.09 గంటలకు రానుంది. శ్రీసత్యసాయి ప్రశాంతి నిలయం రైల్వేస్టేషన్‌కు సాయంత్రం 4.23 గంటలకు బదులుగా సాయంత్రం 4.45 గంటలకు వస్తుందని తెలియజేశారు.

Advertisement

Read Also: ఒక వందేభారత్, రెండు అమృత్ భారత్ రైళ్లు, తెలుగు రాష్ట్రాలకు రైల్వే గుడ్ న్యూస్!

ప్రయాణీకులకు రైల్వే అధికారులు కీలక సూచన

ఈ రైళ్లకు సంబంధించిన ప్రయాణీకులకు అధికారులు కీలక సూచనలు చేశారు. రెండు రైళ్లకు సంబంధించి మారిన టైమింగ్స్ ను గుర్తుంచుకోవాలన్నారు. మారిన టైమింగ్స్ కు అనుగుణంగా రాకపోకలు కొనసాగించాలన్నారు. పూర్తి వివరాలకు సమీపంలోని రైల్వే స్టేషన్ ను సంప్రదించాలన్నారు. లేదంటే, రైల్వే అధికారిక వెబ్ సైట్ లేదంటే యాప్ ను చూసి తెలుసుకోవాలని సూచించారు.

Read Also: జస్ట్ 2 గంటల్లో బెంగళూరు-హైదరాబాద్ ప్రయాణం.. వచ్చేస్తోంది బుల్లెట్ రైలు!

Related News

భారత్ నుంచి లండన్‌కు బస్సు సర్వీస్.. అమ్మో.. అన్ని రోజుల ప్రయాణమా?

ఒక్క టికెట్ చాలు.. 56 రోజుల పాటు రైల్లో దేశమంతా చుట్టేయొచ్చు!

భారత్‌లో మరో అద్భుతం.. సముద్ర గర్భంలో బుల్లెట్ ట్రైన్.. సరికొత్త హిస్టరీ క్రియేట్ చేస్తున్న ఇండియా!

పాకిస్తాన్ లో జగన్నాథుడి రథయాత్ర.. చూసేందుకు రెండు కళ్లు చాలవనుకోండి!

వర్షాకాలంలో మాత్రమే పరుగులు తీసే హెరిటేజ్ రైలు.. ప్రకృతి ఒడిలో అద్భుత ప్రయాణం!

ఫ్యామిలీతో థీమ్ పార్క్ వెళ్లే మజానే వేరు.. ప్రపంచంలోని 8 బెస్ట్ థీమ్ పార్క్స్ ఇవే

‘మిర్చి’ సాంగ్ లోని ఈ ప్లేస్ గుర్తుందా? అది ఇప్పుడు ఘోస్ట్ టౌన్, జనాలంతా ఏమయ్యారు?

ట్రెక్కింగ్ నేర్చుకోవాలనుకుంటున్నారా? దేశంలో సురక్షితమైన 7 అద్భుతమైన ట్రెక్కింగ్ ప్రాంతాలివే

Big Stories

Advertisement
×