Indian Railways: రైల్వే ప్రయాణీకులకు మెరుగైన ప్రయాణ సౌకర్యాన్ని కల్పించడంలో భాగంగా కీలక నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా విశాఖపట్నం వరకు రాకపోకలు కొనసాగించే ప్రయాణీకులకు బ్యాడ్ న్యూస్ చెప్పింది. రాబోయే కొద్ది రోజుల్లో విశాఖపట్నంకు వెళ్లే రైలు సర్వీసులలో పలు అంతరాయాలు కలగనున్నట్లు వెల్లడించింది. రాయ్ పూర్ వాల్తేరు డివిజన్ లోని పార్వతీపురం-సీతానగరం-బొబ్బిలి-డొంకినవలస మధ్య మూడవ లైన్ ను ప్రారంభించారు. అయితే, ఈ లైన్ కు సంబంధించి ప్రీ-ఇంటర్ లాక్, నాన్ ఇంటర్ లాక్ పనుల కారణంగా పలు రైళ్లు రద్దు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. మరికొన్ని రైళ్లను రీ షెడ్యూల్ చేసినట్లు వెల్లడించారు.
రద్దు చేసిన రైళ్ల వివరాలు
వైజాగ్ – రాయ్ పూర్ ప్యాసింజర్ సహా పలు రైలు సర్వీసులను రద్దు చేసినట్లు వెల్లడించారు. ఈ మేరకు క్యాన్సిల్ చేసిన రైళ్ల వివరాలను ప్రకటించారు. ఈ రైళ్లు ఆగస్టు 19 నుంచి 28 వరకు రద్దు అవుతాయని తెలిపారు.
⦿ రైలు నంబర్ 58528 విశాఖపట్నం-రాయ్ పూర్ ప్యాసింజర్ (ఆగస్టు 19-27)
⦿ రైలు నంబర్ 58527 రాయ్ పూర్-విశాఖపట్నం ప్యాసింజర్ (ఆగస్టు 20-28)
⦿ రైలు నంబర్ 58538 విశాఖపట్నం-కోరాపుట్ ప్యాసింజర్ (ఆగస్టు 19-27)
⦿ రైలు నంబర్ 58537 కోరాపుట్-విశాఖపట్నం ప్యాసింజర్ (ఆగస్టు 20-28)
⦿ రైలు నంబర్ 58504 విశాఖపట్నం-విశాఖపట్నం ప్యాసింజర్ (ఆగస్టు 19-27)
⦿ రైలు నంబర్ 58503 విశాఖపట్నం -విశాఖపట్నం ప్యాసింజర్ (ఆగస్టు 20-28)
రీషెడ్యూల్ చేసిన రైళ్ల వివరాలు
⦿ రైలు నంబర్ 20829 దుర్గ్-విశాఖపట్నం వందే భారత్ ఎక్స్ ప్రెస్ 05:45 (ఆగస్టు 22-27) కు బదులుగా 08:44 గంటలకు బయలుదేరుతుంది.
⦿ రైలు నెం. 20830 విశాఖపట్నం-దుర్గ్ వందే భారత్ ఎక్స్ ప్రెస్ మధ్యాహ్నం 14:50 (ఆగస్టు 22-27) కు బదులుగా సాయంత్రం 5:20 గంటలకు బయలుదేరుతుంది.
⦿ రైలు నెం. 12807 విశాఖపట్నం-నిజాముద్దీన్ సమతా ఎక్స్ ప్రెస్ ఆగస్టు 20, 21, 23, 24, మరియు 26 తేదీలలో ఉదయం 09:20 కు బదులుగా మధ్యాహ్నం 14:20 గంటలకు బయలుదేరుతుంది.
ఈ రైళ్ల రద్దు, రీషెడ్యూల్ కారణంగా రోజువారీ ప్రయాణికులతో పాటు దూర ప్రయాణీకులకు తాత్కాలిక అసౌకర్యాన్ని కలిగిస్తాయని రైల్వే అధికారులు తెలిపారు. అయితే, మున్ముందు మెరుగైన సేవల కోసం చిన్న చిన్న ఇబ్బందులు తప్పవన్నారు. విశాఖపట్నం రాకపోకలు కొనసాగించే ప్రయాణీకులు ముందుగా రైళ్ల వివరాలను తనిఖీ చేసుకోవాలని సూచించారు. అవసరమైతే సమీప రైల్వే స్టేషన్ లో ఎంక్వయిరీ చేయడంతో పాటు ఇండియన్ రైల్వే యాప్ లో పూర్తి వివరాలను తెలుసుకోవాలన్నారు.
Read Also: అరే బాబూ.. అది రైల్వే టాయిలెట్.. ఓయో రూమ్ కాదు రా!