E-Paper
Advertisement

ఢిల్లీలో అడుగు పెట్టబోతున్న హైడ్రోజన్ రైలు.. అసలు ప్లాన్ ఇదే!

ఢిల్లీలో అడుగు పెట్టబోతున్న హైడ్రోజన్ రైలు.. అసలు ప్లాన్ ఇదే!
Advertisement

Hydrogen Train Delhi Expansion: డీజిల్, విద్యుత్ రైళ్లకు ప్రత్యామ్నాయంగా గ్రీన్ ఎనర్జీ దిశగా అడుగులు వేస్తున్న రైల్వే.. దేశంలో తొలి హైడ్రోజన్ రైలును అందుబాటులోకి తీసుకొచ్చింది. ప్రస్తుతం హర్యానాలోని జింద్–సోనిపత్ మధ్య ఈ రైలు నడుస్తోంది. అయితే, ఇప్పుడు దీన్ని దేశ రాజధాని ఢిల్లీ వరకు పరుగులు పెట్టించేందుకు అధికారులు రెడీ అవుతున్నారు.

జింద్–సోనిపట్ మధ్య తొలి ప్రయాణం

భారత్ తొలి హైడ్రోజన్ రైలు 2026 జూలైలో జింద్, సోనిపట్ మధ్య 89 కిలోమీటర్ల మార్గంలో సర్వీసులు అందిస్తోంది. హైడ్రోజన్‌ ను ఫ్యూయల్ గా ఉపయోగించుకునే ఈ రైలు నుంచి పొల్యూషన్ ను తగ్గించాలన్నదే ప్రధాన ఉద్దేశం. ఈ రైలులో 10 కోచ్‌లు ఉన్నాయి. సుమారు 2,600 మంది ప్రయాణికులు కూర్చునే సామర్థ్యం ఉంది. అయితే, ప్రస్తుతం అందుకు తగిన స్థాయిలో ప్రయాణికులు రావడం లేదు. రోజుకు సుమారు 40 నుంచి 60 మంది మాత్రమే ప్రయాణిస్తున్నట్లు తెలుస్తోంది.

ఢిల్లీ వరకు నడిపే అవకాశం!  

Advertisement

ప్రయాణికుల సంఖ్యను పెంచడంతో పాటు ఈ కొత్త సాంకేతికతను మరింత సమర్థంగా ఉపయోగించుకోవాలన్న ఉద్దేశంతో రైలును ఢిల్లీ వరకు పొడిగించే అవకాశాన్ని అధికారులు పరిశీలిస్తున్నారు. ప్రత్యేకంగా ఢిల్లీలోని ఆజాద్‌ పూర్ స్టేషన్ వరకు సర్వీసును తీసుకెళ్లే ప్రతిపాదనపై పరిశీలిస్తున్నారు. ఆజాద్‌ పూర్ ప్రాంతం పండ్లు, కూరగాయల మార్కెట్‌ కు ప్రసిద్ధి చెందడంతో అక్కడి వరకు రైలు వెళ్తే, ప్రయాణికుల వినియోగం పెరిగే అవకాశం ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. రైల్వే అధికారులు సాంకేతిక అంశాలు, మార్గంలో ఉన్న పరిస్థితులు, ప్రయాణికుల భద్రత సహా పలు అంశాలను పరిశీలిస్తున్నారు. ఢిల్లీ వరకు ట్రయల్ రన్‌ లను కూడా నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది.

ఒక్కసారి హైడ్రోజన్ నింపితే 300 కి.మీ ప్రయాణం

ఈ రైలు ప్రత్యేకతల్లో ప్రధానమైనది దాని ప్రయాణ సామర్థ్యం. ఒకసారి హైడ్రోజన్ ట్యాంక్‌ ను పూర్తిగా నింపితే సుమారు 250 నుంచి 300 కిలోమీటర్ల వరకు ప్రయాణించే అవకాశం ఉంటుంది. జింద్ నుంచి ఢిల్లీకి దూరం సుమారు 130 కిలోమీటర్లు. దీంతో ఇంధన సామర్థ్యం పరంగా ఈ మార్గంలో రైలును నడపడం సాధ్యమేనని భావిస్తున్నారు. అయితే కేవలం ఇంధన సామర్థ్యం ఉంటే సరిపోదు. ఢిల్లీ పరిధిలో రద్దీ, మార్గ సామర్థ్యం, స్టేషన్ మౌలిక వసతులు లాంటి కీలక అంశాలు కూడా కీలకంగా మారనున్నాయి.

ప్రయాణికుల సంఖ్యే అసలు సవాల్!

Advertisement

ప్రస్తుతం హైడ్రోజన్ రైలు రోజుకు ఒక ట్రిప్పు మాత్రమే నడుస్తోంది. స్టార్టింగ్ లో రోజుకు రెండు ట్రిప్పులు నడపాలని ప్రణాళిక ఉన్నప్పటికీ, తక్కువ ప్రయాణికుల కారణంగా సేవలను పరిమితం చేసినట్లు సమాచారం. మరోవైపు ఢిల్లీ నుంచి నడిచే అనేక రైళ్లకు భారీగా ప్రయాణికుల రద్దీ ఉంటుంది. వాటిని మెయింటెయిన్ చేయడానికి 18 నుంచి 20 కోచ్‌ల వరకు అవసరమయ్యే పరిస్థితి ఉంది. కానీ, ప్రస్తుత హైడ్రోజన్ రైలులో 10 కోచ్‌లు మాత్రమే ఉన్నాయి. అందుకే, ఢిల్లీ వరకు ఈ రైలును పొడిగించే ముందు సామర్థ్యం, డిమాండ్, నిర్వహణ, భద్రత లాంటి అంశాలపై రైల్వే అధికారులు పూర్తి స్థాయిలో అధ్యయనం చేస్తున్నారు.

Read Also: ఇండియన్ బుల్లెట్ రైలు భూకంపాన్ని ముందే పసిగడుతుందా? అదిరిపోయే సేఫ్టీ సీక్రెట్ ఇదే!

Tags

Related News

పదో తరగతి కూడా పాస్ కాలేదు.. అయినా, బోయింగ్, రోల్స్ రాయిస్ నమ్మిన కంపెనీకి అధిపతిగా ఎదిగాడు!

ఇండియన్ బుల్లెట్ రైలు భూకంపాన్ని ముందే పసిగడుతుందా? అదిరిపోయే సేఫ్టీ సీక్రెట్ ఇదే!

రైలు టికెట్ కన్ఫర్మ్ కావడం లేదా? పండుగ వేళ ఇలా బుక్ చేసుకోండి!

గంటకు 350 కి.మీ.. భారత్ తయారు చేయనున్న కొత్త బుల్లెట్ రైలు ఇదే!

పండుగ వేళ ప్రయాణికులకు సూపర్ న్యూస్..1,000కు పైగా స్పెషల్ ట్రైన్లు వచ్చేస్తున్నాయ్!

భారత్‌లో పుట్టిన అద్భుత ఉక్కు.. వూట్జ్ స్టీల్ అసలు కథ తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే!

ఫైరయిన పవర్ బ్యాంక్‌.. విమానంలో ఎగిసిపడిన మంటలు, అత్యవసరంగా ఆకాశం నుంచి మళ్లి

Big Stories

Advertisement
×