E-Paper
Advertisement

రోడ్ ట్రిప్ వెళ్లే మజానే వేరబ్బా.. ఇండియా నుంచి రోడ్డు మార్గంలో వెళ్లగలిగే దేశాలివే

రోడ్ ట్రిప్ వెళ్లే మజానే వేరబ్బా.. ఇండియా నుంచి రోడ్డు మార్గంలో వెళ్లగలిగే దేశాలివే
Advertisement

రోడ్ ట్రిప్ అంటే సాహసం, స్వేచ్ఛ, కొత్త అనుభవాల కలయిక. భారతదేశంలో అనేక అందమైన రోడ్డు మార్గాలు ఉన్నాయి. అయితే సరైన ప్లానింగ్‌తో భారత సరిహద్దులు దాటి పొరుగు దేశాలకు కూడా కారులో ప్రయాణించవచ్చు. ఇందుకోసం ప్రతి దేశానికి సంబంధించిన నిబంధనలు ముందుగానే తెలుసుకోవాలి.

అంతర్జాతీయ ప్రయాణానికి తప్పనిసరిగా ఉండాల్సిన పత్రాలు

విదేశాలకు కారులో వెళ్లే ముందు అన్ని ముఖ్యమైన పత్రాలను సిద్ధం చేసుకోవాలి. వాహనం రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్, బీమా పత్రాలు, పాస్‌పోర్ట్, ఆధార్ కార్డు లేదా ఇతర గుర్తింపు పత్రాలు మీ వద్ద తప్పసరిగా ఉండాలి. వాలిడ్ డ్రైవింగ్ లైసెన్స్ కూడా తప్పనిసరి. బయలుదేరే ముందు సరిహద్దు నిబంధనలను పరిశీలించడం మంచిది. ముందుగానే రూట్ ప్లాన్ చేసుకుంటే ప్రయాణంలో ఇబ్బందులు తగ్గుతాయి.

భారతీయులకు అత్యంత సులభమైన రోడ్ ట్రిప్.. నేపాల్

Advertisement

భారతీయులు ఎక్కువగా కారులో వెళ్లే విదేశీ దేశాల్లో నేపాల్ ఒకటి. మంచు పర్వతాలు, ప్రశాంత లోయలు, ఆధ్యాత్మిక ప్రదేశాలు ఇక్కడి ప్రత్యేకత. ఉత్తరప్రదేశ్ మీదుగా సోనౌలి సరిహద్దు దాటి కాట్మండుకు చేరుకోవచ్చు. భారతీయులకు వీసా అవసరం లేదు. అయితే వాలిడ్ పాస్‌పోర్ట్ లేదా గుర్తింపు పత్రాలు వెంట ఉండాలి. డ్రైవింగ్ లైసెన్స్ కూడా తప్పనిసరిగా తీసుకెళ్లాలి.

భూటాన్.. ప్రశాంత హిమాలయ దేశం

ప్రశాంత వాతావరణం, ప్రకృతి అందాలతో పాటు సంస్కృతికి భూటాన్ ప్రసిద్ధి చెందింది. ఇండియాలో గువాహటి చేరుకొని అక్కడి నుంచి ఫున్‌త్సోలింగ్ బార్డర్ దాటి థింపూ ప్రాంతానికి కారులో వెళ్లవచ్చు. మార్గమంతా హిమాలయాల అందాలు ఆకట్టుకుంటాయి. భారతీయులకు చాలా సందర్భాల్లో పాస్‌పోర్ట్ లేదా వీసా అవసరం ఉండదు. అయితే ఫున్‌త్సోలింగ్ వద్ద వాహనాన్ని ముందుగానే రిజిస్టర్ చేయించడం తప్పనిసరి.

మయన్మార్.. చరిత్ర, సంస్కృతికి నిలయం

Advertisement

బంగారు పగోడాలు, సంప్రదాయ సంస్కృతి, అందమైన తీర ప్రాంతాలతో మయన్మార్ ప్రత్యేక గుర్తింపు పొందింది. మణిపూర్‌లోని మోరే సరిహద్దు ద్వారా ఈ దేశంలోకి ప్రవేశించవచ్చు. అక్కడి నుంచి మండలే, యాంగోన్ వంటి నగరాలకు వెళ్లే అవకాశం ఉంటుంది. ప్రయాణానికి ముందు ఓవర్‌ల్యాండ్ రోడ్ పర్మిట్, టెంపరరీ వాహన దిగుమతి పర్మిట్, అవసరమైన ఎంఎంటీ పర్మిట్ తీసుకోవాలి.

శ్రీలంక.. ఫెర్రీ ద్వారా కారు ప్రయాణం

భారత్, శ్రీలంక మధ్య సముద్రం ఉన్నప్పటికీ కారు తీసుకొని వెళ్లే అవకాశం ఉంది. ముందుగా తమిళనాడులోని తూత్తుకుడి పోర్టుకు చేరుకోవాలి. అక్కడి నుంచి ఫెర్రీ ద్వారా వాహనాన్ని కొలంబోకు తరలిస్తారు. ఈ ప్రయాణానికి అంతర్జాతీయ డ్రైవింగ్ పర్మిట్, కార్నెట్ పత్రం, అలాగే 30 రోజుల శ్రీలంక ఈ-వీసా అవసరం.

Also Read: భార్యభర్తల మధ్య వయసు తేడా ఎక్కువగా ఉంటే సమస్యలు వస్తాయా? సరైన ఏజ్ గ్యాప్ ఎంత ఉండాలి?

థాయ్‌లాండ్.. సాహస యాత్రను కొనసాగించండి

ఇండియా, థాయ్‌లాండ్‌ మధ్య బార్డర్ లేదు. కానీ అక్కడికి కూడా రోడ్డు మార్గంలో చేరుకోవచ్చు. దేశంలోని ఇంఫాల్ నగరం నుంచి మోరే బార్డర్ దాటి ముందుగా మయన్మార్‌లోకి ప్రవేశించాలి. అక్కడి నుంచి అవసరమైన అనుమతులు పూర్తి చేసి థాయ్‌లాండ్ చేరుకోవచ్చు. పాస్‌పోర్ట్, వీసా, వాహన పత్రాలు అన్నీ చెల్లుబాటు అయ్యేలా చూసుకోవాలి.

ప్రయాణానికి ముందు నిబంధనలు తప్పకుండా తెలుసుకోండి

ప్రతి దేశానికి వేర్వేరు ప్రవేశ నిబంధనలు, అనుమతులు ఉంటాయి. కాబట్టి బయలుదేరే ముందు తాజా సమాచారం పరిశీలించడం చాలా ముఖ్యం. సరైన ప్రణాళిక, పూర్తి పత్రాలు, అవసరమైన అనుమతులు ఉంటే విదేశీ రోడ్ ట్రిప్ జీవితాంతం గుర్తుండిపోయే అనుభవంగా మారుతుంది.

Related News

రైలు ప్రయాణికులకు బిగ్ అలర్ట్.. జర్నీలో ఈ తప్పులు చేస్తే.. జరిమానాతో పాటు డైరెక్ట్ జైలే!

కొండవాలుపై ‘కృష్ణుడి వెన్నముద్ద’ రాయి.. 1200 ఏళ్లుగా దొర్లని వైనం.. సైన్స్‌కే అంతుపట్టని రహస్యం!

ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకర రోడ్డుపై బైక్ రైడ్.. గిన్నీస్ రికార్డుల్లోకి తుని యువకుడు!

మహిళలకు అలర్ట్.. రైల్వే స్టేషన్‌లోని ఈ అద్భుతమైన సౌకర్యాలు మీకు తెలుసా?

రైలు ఫుడ్‌పై రైల్వే కీలక నిర్ణయం.. వంట నుంచి ప్యాకింగ్ వరకు AI నిఘా!

పండుగ వేళ రైలు టికెట్లకు భారీ డిమాండ్.. బుకింగ్ మొదలైన వెంటనే సీట్లు మాయం!

దుబాయ్–అబుదాబి రైలు ప్రయాణం ఇక మరింత ఈజీ.. ఎతిహాద్ ట్రైన్ వచ్చేసింది!

మచిలీపట్నం-కర్నూలు మధ్య కొత్త ఎక్స్‌ ప్రెస్.. ఏయే స్టేషన్లలో ఆగుతుందంటే?

Big Stories

Advertisement
×