E-Paper
Advertisement
బిగ్ టీవీ ఇప్పుడు మలయాళంలో
ఓపెన్

Amaravati: అమరావతిలో వైసీపీ గో బ్యాక్ నినాదాలకు అసలు కారణం ఇదే..?

Amaravati: అమరావతిలో వైసీపీ గో బ్యాక్ నినాదాలకు అసలు కారణం ఇదే..?
Advertisement

Amaravati: వైసీపీ నేతల అమరావతి టూర్ రణరంగంగా మారింది. ఉండవల్లి, పెనుమాక గ్రామాల్లోని రైతులు వైసీపీ నేతలపై తిరగబడ్డారు. వైసీపీ నేతల వాహనాలను రైతులు, మహిళలు అడ్డుకొని కోడిగుడ్లు, కర్రలతో దాడికి దిగారు. దాడిలో MLC వాహనం ధ్వంసమైంది. పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నించిన పోలీసులపై సైతం రైతులు ఎటాక్ చేశారు. పలువురు పోలీస్ సిబ్బందికి కూడా గాయాలయ్యాయి. అమరావతి రాజధాని ప్రాంతంలో మరోసారి రాజకీయ సెగలు రేగాయి. భూసేకరణకు వ్యతిరేకంగా పెనుమాక రైతులు కొన్నిరోజులుగా ఉద్యమిస్తున్నారు. వీరికి మద్దతుగా వైసీపీ బృందం, రైతు పరిరక్షణ కమిటీ అమరావతి టూర్ చేపట్టారు. అయితే వైసీపీ నేతల టూర్‌పై అమరావతికి భూములు ఇచ్చిన ఇతర రైతులు తీవ్రంగా వ్యతిరేకించారు. ఉండవల్లి, పెనుమాక గ్రామాల్లో రాజధాని రైతులు ధర్నాకు దిగారు.

కోడిగుడ్లతో ఎటాక్..

ఉండవల్లి సెంటర్‌కు చేరుకున్న వైసీపీ నేతలు పేర్ని నాని, దేవినేని అవినాష్‌, లేళ్ల అప్పరెడ్డిని రైతులు అడ్డుకున్నారు. వైసీపీ గోబ్యాక్ అంటూ నినాదాలతో హోరెత్తించారు. ఈక్రమంలో వైసీపీ నేతలపై కోడిగుడ్లతో ఎటాక్ చేశారు. తర్వాత వైసీపీ నేతలపై కర్రలతో సైతం దాడి దిగారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు వైసీపీ నేతలను అక్కడి నుంచి పంపించేశారు. అమరావతిని ఏకైక రాజధానిగా అంగీకరించిన తర్వాతే ఇక్కడ అడుగు పెట్టాలని రాజధాని ప్రాంత రైతులు డిమాండ్ చేశారు. 85శాతం భూములు ఇచ్చిన రైతుల గురించి కాకుండా 15 శాతం భూములు ఇవ్వని రైతుల కోసం వస్తున్నారా అంటూ రైతులు ధర్నా చేశారు.

Advertisement

Also read: ములుగు జిల్లా రైతులకు గుడ్ న్యూస్.. పాత భూసేకరణ ధరలు రద్దు..!

రైతుల ముసుగులో గుండాలు..

ప్రభుత్వం అవసరం లేకపోయినా రైతుల నుంచి భూములు లాక్కోవడం దుర్మార్గమన్నారు మాజీమంత్రి పేర్ని నాని. తమపైకి రౌడీ మూకలను ఉసిగొల్పి పంపారని ఆరోపించారు. తాడేపల్లి టీడీపీ మండల అధ్యక్షుడు పూలింగులో భూమి ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. తమపై దాడి చేసిన వారిపై హత్యాయత్నం కేసు పెట్టాలని డిమాండ్ చేశారు. రైతుల ముసుగులో టీడీపీ గుండాలు దాడులు చేశారని మాజీమంత్రి అంబటి రాంబాబు ఆరోపించారు. జగన్ దగ్గరకు వచ్చారన్న కారణంతో రైతులను వేధించటం దుర్మార్గమని అభిప్రాయపడ్డారు. బాధిత రైతులను కలవడానికి వెళ్తే దాడి చేస్తారా అని ప్రశ్నించారు. మొత్తానికి వైసీపీ నేతల టూర్ తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. నేతలపై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నారు వైసీపీ నేతలు.

Advertisement

Storey By: Anup Big Tv

Also read: TTD Darshan: తిరుమలకు వెళ్లే భక్తులకు హై అలర్ట్.. రెండు రోజులు పాటు వీఐపీ దర్శనాలు రద్దు!

Related News

విజయనగరంలో భారీ భూ కుంభకోణం.. MSME పార్క్ కోసం తవ్వుతుంటే వైసీపీ నేత ఘరానా స్కామ్..?

Nizamabad Collector: బిగ్ టీవీ కథనానికి అదిరిపోయే ఇంపాక్ట్.. థాంక్స్ చెప్పిన నిజామాబాద్ కలెక్టర్!

Gandhi Hospital: గాంధీ హాస్పిటల్‌లో అడుగడుగునా లంచాల దందా.. రాబంధుల్లా పీక్కుతింటున్న సిబ్బంది..!

మీ ఇంటికి ఎన్యూమరేషన్ ఫామ్‌లు వచ్చాయా?.. ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌లో ఓటు లింక్ చేసుకునే సింపుల్ ప్రాసెస్ ఇదే!

ఎండల దెబ్బకు స్కూళ్లకు సెలవులు.. ఎడారిగా మాడిపోతున్న ఫ్రాన్స్, బ్రిటన్.. అసలేం జరుగుతోంది?

Nalgonda Murders: ఆస్తికోసం మరీ ఇంత దారుణమా.. నల్గొండ జిల్లా హత్యల కేసులో సంచలన నిజాలివే..?

Crude Prices: సామాన్యుడికి గుడ్‌న్యూస్.. 72 డాలర్లకు పడిపోయిన క్రూడాయిల్ ధరలు!

Big Stories

×