E-Paper
Advertisement

చిక్కుల్లో నవదీప్.. డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేస్తారా?

చిక్కుల్లో నవదీప్.. డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేస్తారా?
Advertisement

Navdeep Viral Driving Video: నటుడు నవదీప్‌ కు సంబంధించిన ఓ డ్రైవింగ్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. డ్రైవింగ్ చేస్తున్న సమయంలో మొబైల్ ఫోన్ ఉపయోగిస్తున్నట్లు కనిపిస్తున్న వీడియోను ఆయనే తన సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు.  రీసెంట్ గా బిగ్ బాస్ అగ్ని పరీక్షకు సంబంధించిన ఈవెంట్ లో ఉప్పల్ బాలు గురించి షో జడ్జిలు చేసిన వ్యాఖ్యలు, జడ్జిల తీరును విమర్శిస్తూ నెటిజన్లు పెట్టిన కామెంట్స్ పై నవదీప్ స్పందించారు. కారు డ్రైవింగ్ చేస్తూనే ఈ అంశంపై రికాయాక్ట్ అవుతూ వీడియో రికార్డు చేశాడు. దానిని సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఈ వీడియోను చూసిన నెటిజన్లు అతడిపై ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘన కింద పోలీసులు చర్యలు తీసుకోవాలని డిమాడ్ చేస్తున్నారు.

డ్రైవింగ్‌ చేస్తూ ఫోన్ వాడటం నేరం

వాహనం నడుపుతున్న సమయంలో చేతిలో మొబైల్, ఇతర హ్యాండ్‌ హెల్డ్ కమ్యూనికేషన్ డివైజ్ లను ఉపయోగించడం ప్రమాదకర డ్రైవింగ్‌ గా భావిస్తారు. మోటార్ వెహికల్స్ యాక్ట్‌ లోని సెక్షన్ 184లో హ్యాండ్‌ హెల్డ్ కమ్యూనికేషన్ పరికరాల వినియోగాన్ని ప్రమాదకర డ్రైవింగ్ పరిధిలో స్పష్టంగా నిర్దారించారు. సో, డ్రైవింగ్ చేస్తూ ఫోన్‌ లో మాట్లాడటం, మెసేజ్‌లు చూడటం,  చేతిలో ఫోన్ పట్టుకుని ఇతర పనులు చేయడం వాహనదారుడికే కాకుండా రోడ్డు మీద వెళ్లే ఇతరులకు కూడా ప్రమాదకరంగా మారుతుంది.

Advertisement

నవదీప్ వీడియోపై చర్చ

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పోస్టులో నవదీప్ డ్రైవింగ్ చేస్తున్న సమయంలో మొబైల్ ఉపయోగిస్తున్నట్లు కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో పలువురు నెటిజన్లు ఆయనపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘించిన నవదీప్ డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

లైసెన్స్ వెంటనే రద్దవుతుందా?

Advertisement

ఇక్కడే అసలు ప్రశ్న తలెత్తుతోంది. డ్రైవింగ్‌లో మొబైల్ వాడినంత మాత్రాన ప్రతి సందర్భంలో లైసెన్స్  రద్దవుతుందని చెప్పడం సరైంది కాదు. మోటార్ వెహికల్స్ చట్టంలోని నిబంధనల ప్రకారం ప్రమాదకర డ్రైవింగ్‌కు చర్యలు ఉన్నాయి. మొదటి నేరానికి జైలు శిక్ష లేదంటే జరిమానా విధించే అవకాశం ఉంటుంది. కొన్నిసార్లు రెండూ విధిస్తారు కూడా.  రెండోసారి అదే నేరానికి పాల్పడితే, మరింత కఠినమైన శిక్షలు ఉంటాయి. కొన్ని పరిస్థితుల్లో డ్రైవింగ్ లైసెన్స్ సస్పెన్షన్, రద్దుకు సంబంధించిన చర్యలు కూడా చట్టంలో ఉన్నాయి. అయితే, అది కేసు తీవ్రత, నేర నిర్ధారణ, సంబంధిత అధికారులు, కోర్టు చర్యలపై ఆధారపడి ఉంటుంది.

నిబంధనలు అందరికీ ఒకటే!

సెలబ్రిటీ అయినా, సాధారణ వ్యక్తి అయినా ట్రాఫిక్ నిబంధనలు అందరికీ ఒకే విధంగా ఉంటాయి. డ్రైవింగ్ సమయంలో ఫోన్ ఉపయోగించడం వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది. అందుకే, వాహనం నడిపేటప్పుడు మొబైల్‌ను పక్కన పెట్టడం మంచిది. మోటారు వాహనాల చట్టం ప్రకారం.. మొబైల్ ఉపయోగిస్తూ డ్రైవింగ్ చేయడం నేరం. నవదీప్ ఇలా చాలాసార్లు చేశాడు. అతడి ఇన్ స్టాలో డ్రైవింగ్ చేస్తూ, వీడియోలు రికార్డు చేసినట్లు పలు వీడియోలు ఉన్నాయి. ప్రస్తుతం నవదీప్ లైసెన్స్ రద్దు అవుతుందా? లేదా? అనే అధికారులు తీసుకునే చర్యల మీద ఆధారపడి ఉంటుంది.

Read Also: దోశను స్పూన్‌తో తినాలా? పైగా దానికి ట్రైనింగ్ కూడా!

Tags

Related News

రూ.17 వేల నుంచే వైల్డ్‌ లైఫ్ టూర్.. ఈ 3 ప్లేసులు మిస్ అవ్వొద్దు!

వందే భారత్ స్లీపర్ vs రాజధాని.. ఫుడ్ ఏ రైల్లో బాగుంటుంది?

రైలు పట్టాల కింద రాళ్లు లేకపోతే ఏం జరుగుతుందో తెలుసా? ఊహించడానికే భయంగా ఉంది బాబోయ్!

సైట్ ఓపెన్ చేస్తే సర్వర్ డౌన్.. క్షణాల్లో మాయమవుతున్న రైల్వే టికెట్లు!

రైలు ప్రయాణికులకు అలర్ట్.. టికెట్‌ ఉన్నా జరిమానా తప్పదు.. ఎందుకంటే?

రైల్వే ట్రాక్‌ లపై డ్రోన్లతో నిఘా.. ప్రయాణాలకు ఇబ్బంది లేకుండానే తనిఖీలు!

వెయిటింగ్ లిస్ట్ ఉన్నా టెన్షన్ వద్దు.. చార్ట్ తర్వాత కూడా రైలు టికెట్ ఇలా బుక్ చేసుకోవచ్చు!

పగిలిన అద్దాలు.. కంపుకొట్టే టాయిలెట్లు.. బాబోయ్.. ఇది వందేభారత్ రైలా?

Big Stories

Advertisement
×