BigTV English

Train Horror: ఏసీ కోచ్ లో అలజడి.. రైలు టాయిలెట్ లో మూడేళ్ల చిన్నారి శవం!

Train Horror: ఏసీ కోచ్ లో అలజడి.. రైలు టాయిలెట్ లో మూడేళ్ల చిన్నారి శవం!

Mumbai Train Horror: ముంబై లోకమాన్య తిలక్ టెర్మినస్(LTT)కు చేరుకు ఓ రైలును సిబ్బందిని శుభ్రం చేస్తుండగా ఒక్కసారిగా షాకయ్యారు. ఏసీ కోచ్ లోని టాయిలెట్ డస్ట్ బిన్ లో మూడేళ్ల బాలుడి మృతదేహం కనిపించడంతో వణికిపోయారు. వెంటనే విషయం రైల్వే పోలీసులకు చెప్పడంతో స్పాట్ కు చేరుకున్నారు. ఘటనపై విచారణ మొదలు పెట్టారు.


ఇంతకీ చనిపోయిన బాలుడు ఎవరు?

రైల్వే టాయిలెట్ లో శవమై కనిపించిన ఆ బాలుడిని  ఆకాష్ అలియాస్ ఆరవ్ షాగా రైల్వే పోలీసులు గుర్తించారు. ఆ బాలుడు ఆగస్టు 21న సూరత్‌ లోని తన ఇంటి నుంచి తప్పిపోయాడని కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.  తల్లిదండ్రుల ఫిర్యాదుతో తమ బంధువు అయిన 26 ఏళ్ల  వికాస్ కుమార్ షాపై పోలీసులు కిడ్నాప్ కేసు నమోదు చేశారు. గుజరాత్ పోలీసులు, ముంబై ప్రభుత్వ రైల్వే పోలీసులు (GRP) ప్రస్తుతం వికాస్ కోసం వెతుకుతున్నారు.


కుషినగర్ ఎక్స్‌ ప్రెస్ టాయిలెట్ లో బాలుడి శవం

శనివారం తెల్లవారుజామున కుషినగర్ ఎక్స్‌ ప్రెస్ లోకమాన్య తిలక్ టెర్మినస్ (LTT) కు చేరుకుంది. ప్రయాణీకులు దిగిన తర్వాత, కన్జర్వెన్సీ కార్మికులు కోచ్‌లు, వాష్‌ రూమ్‌ లను శుభ్రం చేయడం ప్రారంభించారు. కార్మికులలో ఒకరు తెల్లవారుజామున 1 గంటల ప్రాంతంలో టాయిలెట్‌ లోని చెత్తబుట్టలో ఒక బిడ్డ మృతదేహాన్ని కనుగొన్నారు. వెంటనే   రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (RPF), GRPకి సమాచారం అందించాడు. చిన్నారి మృతదేహాన్ని పోస్ట్‌ మార్టం కోసం తరలించారు. ఫోరెన్సిక్ టీమ్ తో ఆధారాలు సేకరించారు. శవపరీక్షలో చిన్నారి గొంతు కోసి చంపినట్లు తేలింది. బాలుడిని సూరత్ లో తప్పిపోయిన ఆకాష్ గా గుర్తించారు. నిందితుడిని పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.

ఇంతకీ ఈ కిడ్నాప్ కేసు కథ ఏంటి?

గుజరాత్ సూరత్ లోని అమ్రోలి పోలీసులు నమోదు చేసిన FIR ప్రకారం.. ఆకాష్ తన తల్లి దుర్గావతి, ఇద్దరు అన్నయ్యలతో సూరత్‌ లో ఉంటున్నారు. అతడి తండ్రి దుబాయ్ లో కూలీగా పని చేస్తున్నాడు. అతడి తల్లి పని మనిషిగా చేస్తుంది. వారం రోజుల క్రితం దుర్గావతి అక్క రబ్ది, ఆమె కుమారుడు వికాస్, ఆమె కుమార్తె బీహార్ నుంచి ఆ కుటుంబాన్ని చూడటానికి వచ్చారు. ఆగస్టు 21న, దుర్గావతి తన ఇద్దరు పిల్లలను పాఠశాలకు తీసుకెళ్లి ఆకాష్‌ను రబ్ది దగ్గర వదిలి వెళ్ళింది. ఆమె తిరిగి వచ్చే సమయానికి ఆకాష్‌ కనిపించలేదు. వికాస్ పిల్లవాడిని ఆడుకోవడానికి బయటకు తీసుకెళ్లాడని  రబ్ది ఆమెకు చెప్పింది. వారిద్దరూ తిరిగి రాలేదు. చివరకు ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. అమ్రోలి పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ మొదలు పెట్టారు. వికాస్, ఆకాష్ బైక్ మీద లిఫ్ట్ తీసుకొని సూరత్ రైల్వే స్టేషన్‌ కు చేరుకున్నట్లు తేలింది. స్టేషన్ సిసిటివి ఫుటేజ్‌ లో ఇద్దరూ కనిపించారు. ఆ తర్వాత వాళ్లిద్దరు దాదర్‌ కు చేరుకుని థానే వైపు వెళ్లినట్లు భావించారు. బాలుడు ఎక్కడ హత్యకు గురయ్యాడో? అతని మృతదేహం కుషినగర్ ఎక్స్‌ ప్రెస్‌ లోకి ఎలా వెళ్లింది అనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు. అదే సమయంలో వికాస్ కోసం పోలీసులు గాలిస్తున్నారు.

Read Also: పండుగకు ట్రైన్ టికెట్ దొరకలేదా? ఈ టూల్ తో బెర్త్ ఈజీగా పట్టేయండి!

Related News

Train Ticket: పండుగకు ట్రైన్ టికెట్ దొరకలేదా? ఈ టూల్ తో బెర్త్ ఈజీగా పట్టేయండి!

Train Ticket Booking: 60 డేస్ అడ్వాన్స్ బుకింగ్ రూల్.. పండుగ వెళ్లాలంటే టికెట్ ఎప్పుడు బుక్ చేసుకోవాలి?

Confirmed Train Tickets: దీపావళికి కన్ఫార్మ్ టికెట్ కావాలా? సింపుల్ గా ఇలా బుక్ చేసుకోండి!

Ganpati Special Trains: వినాయక చవితి ప్రత్యేకం.. అందుబాటులోకి 380 ప్రత్యేక రైళ్లు!

Viral Video: అర్థరా ప్రయాణీకురాలిని అక్కడ టచ్ చేసిన రైల్వే పోలీస్, నెట్టింట వీడియో వైరల్

Big Stories

×