Noida International Airport renamed: ఉత్తరప్రదేశ్‌లోని జేవార్‌లో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ‘నోయిడా అంతర్జాతీయ విమానాశ్రయం’ పేరును మారుస్తూ.. యూపీ కేబినెట్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఇకపై ఈ ఎయిర్‌పోర్ట్‌ను ‘నరేంద్ర మోడీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ గా పిలవనున్నట్లు.. సీం యోగి ఆదిత్యనాథ్ అధికారికంగా ప్రకటించారు. ప్రధాని మోడీ ప్రజా జీవితంలో 25 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ..ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో.. ఏవియేషన్ రంగాన్ని కొత్త శిఖరాలకు చేర్చే లక్ష్యంతో అభివృద్ధి చేసిన.. నోయిడా అంతర్జాతీయ విమానాశ్రయానికి సంబంధించి ప్రభుత్వం కొత్త ప్రకటన చేసింది. జేవార్‌లో రూపు దిద్దుకున్న ఈ విమానాశ్రయం పేరును ‘నరేంద్ర మోడీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్, నోయిడా-జేవార్’ గా మారుస్తూ ఉత్తరప్రదేశ్ మంత్రి వర్గం ఆమోదం తెలిపింది. ప్రధాని నరేంద్ర మోడీ ప్రజా సేవలో విజయవంతంగా. 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న తరుణంలో..రాష్ట్ర అభివృద్ధికి ఆయన అందించిన మార్గదర్శకత్వానికి కృతజ్ఞతగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు సీఎం యోగి ఆదిత్యనాథ్ స్పష్టం చేశారు.
ప్రధాన మంత్రిగా, ప్రభుత్వ అధిపతిగా.. మోడీ సుదీర్ఘ రాజకీయ ప్రయాణం పూర్తి చేసుకున్న సందర్భంగా.. యూపీ కేబినెట్ ఈ తీర్మానాన్ని ఆమోదించింది. అయితే.. దేశంలో ఒక ప్రముఖ అంతర్జాతీయ విమానాశ్రయానికి సిట్టింగ్ ప్రధాని పేరు పెట్టడం ఇదే తొలి సారి .. కావడంతో ఈ నిర్ణయం జాతీయ స్థాయిలో.. ప్రాధాన్యత సంతరించుకుంది. రాష్ట్ర కేబినెట్ ఆమోదం లభించినప్పటికీ, కేంద్ర ప్రభుత్వ స్థాయి నుంచి అధికారిక నోటిఫికేషన్ వెలువడిన తర్వాత తుది ప్రక్రియ పూర్తవుతుంది.
ఎయిర్ పోర్ట్ పేరు మారినంత మాత్రాన.. ప్రయాణికుల రాక పోకలకు సంబంధించి ఎలాంటి ఇబ్బందులు ఉండవు. విమాన షెడ్యూల్స్, ఎయిర్ లైన్ సర్వీసులు, టికెట్ ధరలు లేదా ఎయిర్ పోర్ట్ ప్రవేశ ఏర్పాట్లలో ఎలాంటి మార్పు ఉండదు. ప్రయాణికులకు ఇది కేవలం కమ్యూనికేషన్ పరంగా మరొక పెద్ద ఏవియేషన్ గేట్ వేగా అందుబాటులో.. ఉంటుంది. ఢిల్లీ-ఎన్‌సీఆర్ ప్రాంతంలో విమాన రద్దీని తగ్గించడానికి, యూపీ ప్రజలకు మరింత ఈజీగా విమాన ప్రయాణ సౌకర్యం కల్పించడానికి ఈ ఎయిర్‌పోర్ట్ ఎంతగానో ఉపయోగ పడుతుంది.
గౌతమ్ బుద్ధ నగర్ జిల్లాలోని జేవార్‌లో .. ఉన్న ఈ విమానాశ్రయం జ్యూరిచ్ ఎయిర్ పోర్ట్ ఇంటర్నేషనల్ ఏజీ వారి అనుబంధ సంస్థ అయిన యమునా ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో.. పబ్లిక్-ప్రైవేట్ భాగస్వామ్యంతో అభివృద్ధి చేసారు.
ఈ ప్రాజెక్ట్ నాలుగు దశల్లో.. అభివృద్ధి చేయబడుతోంది. మొదటి దశలో ఒక రన్‌వే, ఒక టెర్మినల్ అందుబాటులో ఉండగా.. ఏడాదికి దాదాపు 1.2 కోట్ల మంది ప్రయాణికులను ఇది హ్యాండిల్ చేయగలదు. అన్ని దశలు పూర్తయితే ఏటా 7 కోట్ల మంది ప్రయాణికులకు సేవలు అందించేలా దీనిని తీర్చిదిద్దుతున్నారు.
రన్‌వే వివరాలు: దీని రన్‌వే పొడవు 3,900 మీటర్లు , వెడల్పు 45 మీటర్లు ఉంటుంది. ఇది లేటెస్ట్ ఇన్‌స్ట్రుమెంట్ ల్యాండింగ్ సిస్టమ్ తో అమర్చబడి ఉంది.
Also Read: దసరా, దీపావళికి ఊరెళ్తున్నారా? తెలుగు రాష్ట్రాల మీదుగా ప్రత్యేక రైళ్లు, ఎప్పటి నుంచంటే?
రాజకీయ నాయకులు, చారిత్రక పురుషుల పేరిట ఇప్పటికే.. అనేక విమానాశ్రయాలు ఉన్నాయి. ఢిల్లీలో ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం, ముంబైలో ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయం, కోల్‌కతాలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ అంతర్జాతీయ విమానాశ్రయం, లక్నోలో చౌదరి చరణ్ సింగ్ అంతర్జాతీయ విమానాశ్రయాలు ఈ కోవకే చెందుతాయి. ఇప్పుడు ఈ లిస్ట్ లో నరేంద్ర మోడీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ కూడా చేరనుంది.
నోయిడా అంతర్జాతీయ విమానాశ్రయం పేరు మార్పు నిర్ణయం ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక, పారిశ్రామిక,పర్యాటక రంగానికి భవిష్యత్తులో నూతన ఉత్తేజాన్ని ఇస్తుందని ప్రభుత్వం భావిస్తోంది. రయాణికులకు మెరుగైన వసతులు, వేగవంతమైన కనెక్టివిటీ అందించడమే ఈ ప్రాజెక్ట్ ప్రధాన లక్ష్యం.