E-Paper
Advertisement

సోమరితనం కూడా నేరమే.. ఈ దేశంలో పని చేయకపోతే శిక్ష తప్పదు!

సోమరితనం కూడా నేరమే.. ఈ దేశంలో పని చేయకపోతే శిక్ష తప్పదు!
Advertisement

North Korea Labour Laws Explained: ప్రపంచంలోని ప్రతి దేశంలో పని చేయడం, ఉపాధి పొందడం వ్యక్తిగత నిర్ణయంగా ఉంటుంది. కానీ, ఉత్తర కొరియా దేశంలో పరిస్థితి పూర్తి భిన్నంగా ఉంటుంది. అక్కడ ఉద్యోగం అనేది కేవలం సంపాదనకు సంబంధించిన విషయం కాదు.. ప్రభుత్వ వ్యవస్థలో భాగంగా పరిగణిస్తారు. పని చేసే వయసులో ఉన్న వ్యక్తులు ప్రభుత్వం నిర్దేశించిన విధంగా పని చేయాల్సి ఉంటుంది. అందుకే, ఉత్తర కొరియాలో నిరుద్యోగం, పని చేయకపోవడం, సోమరితనం  లాంటి పదాలు తరచూ చర్చకు వస్తుంటాయి. అక్కడి కఠినమైన కార్మిక నియంత్రణ వ్యవస్థ ఉంటుంది.

ఉద్యోగం ఎంచుకునే స్వేచ్ఛ ఎంత?

ఉత్తర కొరియాలో ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థపై, ముఖ్యంగా అధికారిక ఉద్యోగాలపై గట్టి నియంత్రణ కలిగి ఉంటుంది. పౌరులకు పనిని కేటాయించడంతో పాటు ఉద్యోగానికి హాజరు కావడం, ప్రొడక్టివిటీ లాంటి అంశాల్లో ప్రభుత్వ జోక్యం ఎక్కువగా ఉంటుంది. ఒక వ్యక్తి ఉద్యోగానికి హాజరుకాకపోతే, పని వ్యవస్థకు దూరంగా ఉంటే.. వ్యక్తిగత నిర్ణయంగా పరిగణించరు. అలాంటి వ్యక్తుల మీద స్థానిక అధికారులు చర్యలు తీసుకుంటారు.

‘నిరుద్యోగం’ ఎందుకు పెద్ద సమస్య?

Advertisement

ఉత్తర కొరియా అధికారికంగా ప్రతి ఒక్కరికీ పని కల్పించే వ్యవస్థను చూపిస్తుంది. కానీ, వాస్తవ పరిస్థితి అంత సులభం కాదు. ఆర్థిక ఇబ్బందులు, ప్రభుత్వ రంగంలోని తక్కువ వేతనాలు, మార్కెట్ ఆధారిత జీవనోపాధి పెరగడం లాంటి కారణాలతో చాలామంది అధికారిక ఉద్యోగాల కంటే ఇతర మార్గాల్లో ఆదాయం సంపాదించాల్సి వస్తుంది. అయినప్పటికీ, ప్రభుత్వం నిర్దేశించిన పనికి రాకపోయినా, పట్టించుకోకపోవడం వల్ల సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది.

బలవంతపు శ్రమ దోపిడీ ఆరోపణలు!

ఉత్తర కొరియాపై అంతర్జాతీయ సంస్థలు, మానవ హక్కుల సంఘాలు చాలా కాలంగా బలవంతపు శ్రమకు సంబంధించిన ఆరోపణలు చేస్తూనే ఉన్నాయి. ప్రభుత్వ ప్రాజెక్టులు, వ్యవసాయ పనులు, నిర్మాణ రంగం, సైనిక సంబంధిత కార్యక్రమాల్లో  ప్రజలను తప్పనిసరిగా పని చేయాలనే నిబంధనలు తీసుకొచ్చినట్లు ల్లడించారు. అంతేకాదు, అక్కడి ఖైదీలతో కఠినమైన పరిస్థితుల్లో శ్రమ చేయిస్తున్నారని మానవ హక్కుల సంస్థలు సైతం వెల్లడించాయి.

అసలు విషయం ఏంటి?

Advertisement

ఉత్తర కొరియాను సోమరితనం నేరమైన దేశంగా చెప్పినా, అక్కడ పని అనేది వ్యక్తిగత ఎంపిక కంటే ప్రభుత్వ నియంత్రణలో ఉన్న సామాజిక, ఆర్థిక వ్యవస్థలో ఎక్కువగా భాగం కావాల్సి ఉంటుంది. అందుకే ఉత్తర కొరియాలో పని చేయకపోవడం,  అధికారిక పని వ్యవస్థకు దూరంగా ఉండటం సాధారణ నిరుద్యోగ సమస్యలా కాకుండా.. ప్రభుత్వ నియంత్రణను ఉల్లంఘించిన అంశంగా పరిగణిస్తారు. ఈ నేపథ్యంలో ప్రపంచంలో అత్యంత కఠినమైన కార్మిక వ్యవస్థల గురించి చర్చ వచ్చినప్పుడు ఉత్తర కొరియా పేరు తరచూ వినిపిస్తుంది.

Read Also: చంకలో వెంట్రుకలకు రంగులు.. ఆ దేశంలో ఇదే ట్రెండ్!

Tags

Related News

ఇండియన్ బుల్లెట్ రైలుపై పట్టాలెక్కేది ఎప్పుడంటే.. జపాన్ అధికారి షాకింగ్ కామెంట్స్!

హైదరాబాద్‌లోనే జపాన్ ఫీలింగ్, మచ్చా తాగుతూ.. అనిమే చూస్తూ.. ఎంజాయ్ చేసేయండి!

స్వర్ణగిరి ఆలయ నిర్వాహకులకు యాదగిరిగుట్ట దేవస్థానం లీగల్ నోటీసులు.. అసలేం జరిగిందంటే?

అమరావతి ORR డిజైన్‌లో కీలక మార్పులు.. కొత్త రూట్ మ్యాప్ ఇదే!

చంకలో వెంట్రుకలకు రంగులు.. ఆ దేశంలో ఇదే ట్రెండ్!

మధుర మీనాక్షి ఆలయాన్ని కట్టించింది తెలుగు రాజులేనా? అసలు విషయం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా 70 మలుపులు.. ఈ రోడ్డు మీద డ్రైవింగ్ అంటే మామూలు విషయం కాదు!

Big Stories

Advertisement
×