E-Paper
Advertisement

రైల్లో వాష్‌ రూమ్ ఉపయోగిస్తున్నారా? ఈ 6 హైజీన్ టిప్స్ తప్పకుండా పాటించాల్సిందే!

రైల్లో వాష్‌ రూమ్ ఉపయోగిస్తున్నారా? ఈ 6 హైజీన్ టిప్స్ తప్పకుండా పాటించాల్సిందే!
Advertisement

Train Toilet Tips: రైలు ప్రయాణం అంటే చాలామందికి ముందుగా గుర్తొచ్చేది సీటు, ఫుడ్, కిటికీ బయట కనిపించే అందమైన దృశ్యాలు. కానీ, ప్రయాణం కాస్త ఎక్కువ సమయం ఉంటే, వాష్‌ రూమ్‌ను ఉపయోగించాల్సి రావచ్చు.  ముఖ్యంగా రైలులోని టాయిలెట్‌ ను చాలా మంది ప్రయాణికులు ఉపయోగిస్తారు. అందుకే, వాష్‌రూమ్‌ను ఉపయోగించే సమయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. పరిశుభ్రత కోసం ప్రత్యేకంగా పెద్ద ఏర్పాట్లు చేసుకోవాల్సిన అవసరం లేదు. చేతులను సరిగ్గా శుభ్రం చేసుకోవడం, కొన్ని అవసరమైన వస్తువులను వెంట ఉంచుకుంటే చాలు.

1.చేతులను సరిగ్గా శుభ్రం చేసుకోండి!

టాయిలెట్ ఉపయోగించిన తర్వాత చేతులు కడుక్కోవడం అత్యంత ముఖ్యం. వీలైతే సబ్బుతో కనీసం 20 సెకన్ల పాటు చేతులను శుభ్రం చేసుకోవాలి. అరచేతులతో పాటు చేతుల వెనుక భాగం, వేళ్ల మధ్య, గోళ్ల చుట్టూ కూడా శుభ్రం చేయాలి. వాష్‌రూమ్ నుంచి బయటకు వచ్చేటప్పుడు తలుపు హ్యాండిల్‌ ను తాకాల్సి వస్తే టిష్యూ ఉపయోగించాలి.

2.చిన్న హైజీన్ కిట్ వెంట ఉంచుకోండి!

Advertisement

రైలు ప్రయాణంలో చిన్న హైజీన్ కిట్ చాలా ఉపయోగపడుతుంది. హ్యాండ్ శానిటైజర్, టిష్యూలు, టాయిలెట్ పేపర్, వెట్ వైప్స్, చిన్న డిస్‌ ఇన్ఫెక్టెంట్ వైప్స్, వాడిన వస్తువులు వేసేందుకు డిస్పోజబుల్ బ్యాగ్ లాంటి వాటిని వెంట తీసుకెళ్లొచ్చు.  వాష్‌రూమ్‌లో సబ్బు, నీరు అందుబాటులో లేకపోతే  60 శాతం ఆల్కహాల్ ఉన్న హ్యాండ్ శానిటైజర్ ఉపయోగించాలి.

3.ప్రతి వస్తువును తాకడానికి భయపడాల్సిన అవసరం లేదు!

ట్యాప్, డోర్ హ్యాండిల్స్ ను చాలా మంది ప్రయాణికులు తాకుతుంటారు. అందువల్ల వాటిపై క్రిములు ఉండే అవకాశం ఉంటుంది. అయితే, వాటిని తాకినంత మాత్రాన అనారోగ్యం వస్తుందని భావించాల్సిన అవసరం లేదు. చేతులు శుభ్రం చేసుకోవడం, ఆ తర్వాత ముఖాన్ని తాకకుండా ఉండటం లాంటి జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది. మీ ఫోన్, వాటర్ బాటిల్, తినే పదార్థాలను వాష్‌ రూమ్‌ లో పెట్టకుండా ఉండటం మంచిది.

4.చెప్పులు లేకుండా నడవకండి!

Advertisement

రైలు టాయిలెట్‌లో నేల తడిగా ఉండే అవకాశం ఉంటుంది. అందుకే వాష్‌రూమ్‌లోకి వెళ్లేటప్పుడు చెప్పులు తప్పనిసరిగా వేసుకోవాలి. ప్రయాణంలో అలసిపోయినా ఈ విషయంలో నిర్లక్ష్యం చేయకపోవడం మంచిది.

5.నెలసరి విషయంలో జాగ్రత్త!

నెలసరి సమయంలో ప్రయాణించే మహిళలు ముందుగానే అవసరమైన వస్తువులను సిద్ధం చేసుకోవడం మంచిది. అవసరమైన ప్యాడ్స్, టాంపన్స్, ఇతర మెన్‌స్ట్రువల్ ఉత్పత్తులతో పాటు కొన్ని అదనంగా తీసుకెళ్లడం ఉపయోగపడుతుంది. ప్యాడ్‌ను సాధారణంగా 4 నుంచి 6 గంటల వ్యవధిలో మార్చడం మంచిది. వాడిన ప్యాడ్‌లను పేపర్‌ లో చుట్టి డస్ట్‌ బిన్‌ లో వేయాలి. వాటిని రైలు టాయిలెట్‌లో ఫ్లష్ చేయకూడదు.

6.తినే ముందు చేతులు శుభ్రం చేసుకోండి!

వాష్‌రూమ్ ఉపయోగించిన తర్వాత సీటులోకి వచ్చి వెంటనే స్నాక్స్ తినడం చాలామందికి అలవాటు. కానీ, ముందుగా చేతులు శుభ్రంగా ఉన్నాయో లేదో చూసుకోవాలి. సబ్బు, నీటితో చేతులను సరిగ్గా కడుక్కోవడం మంచిది.

Read Also: ఇక నేరుగా గోవాకు వెళ్లిపోవచ్చు, కొత్త వందేభారత్ వచ్చేస్తోంది!

Tags

Related News

ఇక నేరుగా గోవాకు వెళ్లిపోవచ్చు, కొత్త వందేభారత్ వచ్చేస్తోంది!

1975లో పెళ్లి ఖర్చులు.. అమ్మమ్మ లెక్కల చిట్టా చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే!

రూ.17 వేల నుంచే వైల్డ్‌ లైఫ్ టూర్.. ఈ 3 ప్లేసులు మిస్ అవ్వొద్దు!

వందే భారత్ స్లీపర్ vs రాజధాని.. ఫుడ్ ఏ రైల్లో బాగుంటుంది?

రైలు పట్టాల కింద రాళ్లు లేకపోతే ఏం జరుగుతుందో తెలుసా? ఊహించడానికే భయంగా ఉంది బాబోయ్!

సైట్ ఓపెన్ చేస్తే సర్వర్ డౌన్.. క్షణాల్లో మాయమవుతున్న రైల్వే టికెట్లు!

రైలు ప్రయాణికులకు అలర్ట్.. టికెట్‌ ఉన్నా జరిమానా తప్పదు.. ఎందుకంటే?

Big Stories

Advertisement
×