Free Uber Shuttle Services In Hyderabad: హైదరాబాద్ ప్రయాణీకులకు అగ్రిగేటర్ సంస్థ ఉబెర్ అదిరిపోయే న్యూస్ చెప్పింది. సిటీలో ఫ్రీగా షటిల్ రైడ్స్ అందిస్తున్నట్లు ప్రకటించింది. నగరంలోని పలు ప్రాంతాల నుంచి హైటెక్ సిటీకి ఉబెర్ షటిల్ సర్వీసులను ప్రారంభించింది. మూడు వారాల పాటు ఈ ఉచిత సేవలన కొనసాగించనున్నట్లు కంపెనీ ప్రకటించింది. ప్రస్తుతం ఈ సెటిల్ సర్వీసులు వనస్థలిపురం, ఉప్పల్, నాంపల్లి, బాచుపల్లి, అమీన్ పూర్, అల్వాల్ నుంచి హైటెక్ సిటీ వరకు రాకపోకలు కొనసాగించనున్నాయి. అటు హైటెక్ సిటీ నుంచి పలు ప్రాంతాలకు ఫ్రీగా రైడ్స్ అందిస్తున్నట్లు ఉబెర్ తెలిపింది.
హైదరాబాద్ లో పైలెట్ ప్రాజెక్ట్ గా..
ఉబర్ షటిల్ సర్వీసులు ఇప్పటికే దేశ రాజధాని న్యూఢిల్లీతో పాటు కోల్ కతా నగరాల్లో సక్సెస్ ఫుల్ గా నడిపిస్తున్నది. ఈ నగరాల్లో నిత్యం 10 వేల మందికి పైగా ప్రయాణీకులకు తన సర్వీసులను అందిస్తున్నది. ఈ సర్వీసును హైదరాబాద్ లోనూ అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించింది. అందులో భాగంగానే ప్రస్తుతం హైదరాబాద్ లో పైలెట్ ప్రాజెక్టుగా ఉచిత షటిల్ సర్వీసులను అందిస్తున్నది. సుమారు 3 వారాలత తర్వాత అసలు సర్వీసులు ప్రారంభం కానున్నాయి. ఉబెర్ షటిల్ సర్వీసులు హైదరాబాద్ సిటీ ప్రయాణీకులకు మెరుగైన రవాణా సౌకర్యాన్ని కల్పించనున్నాయి. అదే సమయంలో ట్రాఫిక్ రద్దీ కొంతమేర తగ్గే అవకాశం ఉంది.
ఉబెర్ షటిల్ సర్వీసులలో ఉచితంగా ఎలా ప్రయాణించాలంటే?
హైదరాబాద్ లోని ప్రయాణీకులు ఉబర్ షటిల్ సర్వీసులలో ఫ్రీగా ప్రయాణించేందుకు సీట్లను ముందుగానే బుక్ చేసుకునే అవకాశం కల్పిస్తున్నది కంపెనీ. ఒక వారం ముందుగానే సీట్లను బుక్ చేసుకోవచ్చు. ఉబెర్ యాప్ ద్వారా సీట్లను బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. అంతేకాదు, ఈ బస్సులు ఎక్కడ ఉన్నాయనే విషయాన్ని యాప్ ద్వారా ట్రాక్ చేసే అవకాశం ఉంది. అంతేకాదు, ప్రయాణీకులు ఎక్కడ ఎక్కారు? ఎక్కడ దిగాలి? ప్రయాణానికి ఎంత సమయం పడుతుంది? అనే వివరాలు కూడా యాప్ లో ఎప్పటికప్పుడు చూసుకునే అవకాశం ఉంది. అయితే, ఈ షటిల్ సర్వీసులలో కేవలం సీట్ కెపాసిటీ మేరకే ప్రయాణీకులను ఎక్కించుకుంటారు. నిలబడి ప్రయాణించేందుకు అనుమతించరు. ముందస్తుగా సీట్లు బుక్ చేసుకున్న వారే ఈ షటిల్ సర్వీసులలో ప్రయాణించే అవకాశం ఉంటుంది.
Read Also: విశాఖ నుంచి వచ్చే ప్రయాణీకులకు అలర్ట్, ఇక ఆ రైళ్లు సికింద్రాబాద్ లో ఆగవట!
ఉబెర్ షటిల్ సర్వీసులతో ప్రయాణీకులకు మేలు
ఉబెర్ సర్వీసులతో హైదరాబాదీలకు ప్రయాణ కష్టాలు మరింత తీరే అవకాశం ఉందని ఉబెర్ షటిల్ ఇండియా హెడ్ అమిత్ దేశ్ పాండే వెల్లడించారు. ఈ ఉబెర్ షటిల్ సర్వీసులు ప్రయాణీకులకు ఆహాదకరమైన ప్రయాణ అనుభవాన్ని అందిస్తాయని అభిప్రయాపడ్డారు. ఇరుకు ప్రయాణంతో ఇబ్బందులు లేకుండా కేవలం సీటింగ్ కెపాసిటీ మేరకే ప్రయాణీకులు వెళ్లే అవకాశం ఉందన్నారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఉచిత షటిల్ సర్వీసులను ప్రయాణీకులు వినియోగించుకోవాలని సూచించారు. మూడు వారాల తర్వాత పే సర్వీసులు ప్రారంభం అవుతాయని దేశ్ పాండే తెలిపారు.
Read Also: ఇకపై రీఫండ్ పొందాలంటే అలా చెయ్యాల్సిందే, ప్రయాణీకులకు రైల్వే కీలక సూచన!