BigTV English

UP Man: ఒక రైలు ఎక్కబోయి.. మరో రైలు ఎక్కాడు.. చివరి ప్రాణాలు కోల్పోయాడు!

UP Man: ఒక రైలు ఎక్కబోయి.. మరో రైలు ఎక్కాడు.. చివరి ప్రాణాలు కోల్పోయాడు!

UP Train Accident:

ప్రయాణీకులు సేఫ్ గా జర్నీ చేసేందుకు రైల్వే అధికారులు ఎన్ని సూచనలు, సలహా ఇచ్చినప్పటికీ, వాటిని పాటించక ప్రాణాలు కోల్పోతున్నారు. రైల్వే స్టేషన్ సహా, రైల్వే పరిసరాల్లోనూ జాగ్రత్తగా ఉండాలని, వెళ్లాల్సిన రైలు ఏ ప్లాట్ ఫారమ్ మీదికి వస్తున్నాయో తెలుసుకుని ఎక్కాలని అధికారులు చెప్తూనే ఉంటారు. రైలు ఆగిన తర్వాతే ఎక్కడంతో పాటు దిగాలని సూచనలు చేస్తుంటారు. అయినప్పటికీ కొంత మంది అవేమీ పట్టించుకోకుండా ప్రమాదాలకు గురై చనిపోతున్నారు. తాజాగా ఓ వ్యక్తి పొరపాటుగా వేరే రైలు ఎక్కి ప్రాణాలు కోల్పోయాడు. ఇంతకీ ఈ ఘటన ఎక్కడ జరిగిందంటే..


యూపీ రైలు ప్రమాదంలో వ్యక్తి మృతి    

యూపీలోని సాలెంపూర్ రైల్వే స్టేషన్‌ లో ఓ వ్యక్తి తప్పుగా ఎక్కి.. కదులుతున్న రైలు నుంచి దూకి చనిపోయిన ఘటన సంచలనం కలిగించింది. ఆ వ్యక్తిని లార్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రేవాలి గ్రామానికి చెందిన సంజయ్ ప్రసాద్ (42)గా పోలీసులు గుర్తించారు. అతడు ముంబైలోని ఒక ప్రైవేట్ కంపెనీలో కార్మికుడిగా పని చేస్తున్నాడు. సుమారు నాలుగు నెలల సెలవుతో ఇంటికి వచ్చిన ఆయన, తిరిగి ముంబైకి వెళ్లాలనుకున్నాడు. గురువారం రాత్రి ముంబైకి బయల్దేరేందుకు అతడి  సోదరుడు అతడిని సాలెంపూర్ రైల్వే స్టేషన్‌కు తీసుకెళ్లాడని పోలీసులు తెలిపారు. అయితే, అతడు పొరపాటున ముంబైకి వెళ్లాల్సిన రైలుకు బదులుగా, బర్హాజ్ వెళ్లే రైలు ఎక్కాడు.

Read Also: వేగంగా వస్తున్న.. వందే భారత్ ముందుకు దూకిన కుక్క.. తర్వాత జరిగింది ఇదే!


కదులుతున్న రైల్లో నుంచి దూకి మృతి

కాసేపటి తర్వాత రైలు స్టార్ట్ అయ్యింది. ముందుకు కదిలింది. రైలు బర్హాజ్ సెక్షన్ వైపు కదలడం ప్రారంభించింది. అప్పుడే తాను పొరపాటుగా వేరే రైలు ఎక్కానని గుర్తించాడు. అప్పటికే రైలు స్పీడ్ అందుకుంది. అయినప్పటికీ రైల్లో నుంచి కిందికి దూకాడు. వేగంగా కిందపడటంతో సంజయ్ ప్రసాద్ అక్కిక్కడే చనిపోయాడు. వెంటనే అక్కడ ఉన్న ప్రయాణీకులు వచ్చి చూసే సరికి తను చనిపోయి ఉన్నట్లు తెలిపారు. వెంటనే స్పాట్ కు చేరుకున్న పోలీసులు, కేసు నమోదు చేసుకున్నారు.  మృతదేహాన్ని పోస్ట్‌ మార్టం కోసం హాస్పిటల్ కు తరలించినట్లు సాలెంపూర్ పోలీసులు తెలిపారు. ప్రయాణీకులు ఇప్పటికైనా రైల్వే అనౌన్స్ మెంట్స్ ను జాగ్రత్తగా విని, ఫాలో కావాలన్నారు. లేదంటే ప్రసాద్ లా ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉందన్నారు.

Read Also: పట్టాలు తప్పిన రైలును మళ్లీ పట్టాలు ఎక్కించడం ఇంత కష్టమా? అస్సలు ఊహించి ఉండరు!

Related News

Woman Train Driver: తొలి లేడీ లోకో పైలెట్ సురేఖ పదవీ విరమణ, ఘన వీడ్కోలు పలికి సిబ్బంది!

Trains Derail: పట్టాలు తప్పిన రైలును మళ్లీ పట్టాలు ఎక్కించడం ఇంత కష్టమా? అస్సలు ఊహించి ఉండరు!

Airways New Rule: కాఫీ తాగొద్దు, ఫోటోలు తియ్యొద్దు, సిబ్బందిపై విమానయాన సంస్థ కఠిన ఆంక్షలు!

Dussehra – Diwali: పండుగ సీజన్ లో భారతీయులు వెళ్లాలనుకుంటున్న టాప్ ప్లేసెస్ ఇవే, మీరూ ట్రై చేయండి!

IRCTC – Aadhaar: వెంటనే ఇలా చేయండి.. లేకపోతే అక్టోబర్ 1 నుంచి టికెట్ల బుకింగ్ కష్టమే!

TIRUN Cruise: ఫ్యామిలీ ట్రిప్‌కి బంపర్ ఆఫర్.. 60శాతం డిస్కౌంట్, పిల్లలకు ఉచితం

Smallest Railway Station: ఇండియాలోనే అతి చిన్న ప్లాట్‌ఫాం కలిగిన రైల్వే స్టేషన్ ఇదే.. అంత చిన్నదా?

Big Stories

×