Indian Railways: ప్రయాణీకులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడమే లక్ష్యంగా భారతీయ రైల్వే పలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నది. రైల్వే స్టేషన్ లోకి అడుగు పెట్టినప్పటి నుంచి.. రైల్వే స్టేషన్ నుంచి బయటకు వెళ్లే వరకు ప్యాసింజర్లు సేఫ్ గా ఉండేలా పలు అవగాహన కార్యక్రమాలు చేపడుతోంది. రైల్వే భద్రతకు సంబంధించి ప్రయాణీకులలో మరింత అవేర్నెస్ కలిగించేందుకు భారతీయ రైల్వే సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. అందులో భాగంగానే పిల్లలు ఎంతో ఇష్టపడే ఇండియన్ యానిమేటెడ్ అడ్వెంచర్ సిరీస్ క్యారెక్టర్ చోటా భీమ్ తో జతకట్టింది.
చోటా భీమ్ తో రైల్వే ఎందుకు చేతులు కలిపిందంటే?
ప్రయాణీకుల భద్రతకు సంబంధించిన అవగాహన కార్యక్రమాలను చోటా భీమ్ ద్వారా చేపట్టనున్నట్లు పశ్చిమ రైల్వే చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ వినీత్ అభిషేక్ వెల్లడించారు. తమ ప్రచార కార్యక్రమాల కోసం చోటా భీమ్ తో అగ్రిమెంట్ చేసుకున్నట్లు తెలిపారు. “పిల్లలను అలరించే, వారిని ఎడ్యుకేట్ చేసే ఇండియన్ యానిమేషన్ క్యారెక్టర్ చోటా భీమ్. ఆ పాత్ర ద్వారా ప్రయాణీకుల భద్రతతో పాటు ఇతర అంశాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని భావిస్తున్నాం. ప్రధానమంత్రి మన్ కీ బాత్ లో కార్టూన్ పాత్రను ప్రశంసించిన నేపథ్యంలో, చోటా భీమ్ ను పశ్చిమ రైల్వేలో భాగస్వామ్యం చేయాలని భావించాం” అన్నారు.
పిల్లల ద్వారా పెద్దలకు అవగాహన
సాధారణంగా రైల్వే ప్రయాణాలు చేసేది పెద్దలే అయినప్పటికీ, చిన్న పిల్లల ద్వారా వారిలో అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తున్నట్లు వినీత్ అభిషేక్ తలిపారు. “సాధారణంగా రైల్వే ప్రయాణీకులు పెద్దలే. కానీ, చోటా భీమ్ ద్వారా పిల్లలను చేరుకుని, వారి ద్వారా వారి పేరెంట్స్ ను ఎడ్యకేట్ చేయాలని భావిస్తున్నాం. పిల్లలు చోటా భీమ్ ద్వారా కల్పించే అవగాహనక కార్యక్రమాలను బాగా అర్థం చేసుకుంటారు. వారు పేరెంట్స్ కు చెప్పే ప్రయత్నం చేస్తారు. పిల్లలు భద్రత గురించి తెలుసుకుని, ఇంట్లో వారితో ఈ విషయాలను పంచుకుంటే, మొత్తం కుటుంబానికి అవగాహన కలుగుతుంది. అది మొత్తం కుటుంబాలపై బలమైన ప్రభావాన్ని చూపుతుంది. అందుకే చోటా భీమ్ ను ఎంచుకున్నాం” అన్నారు.
Chhota Bheem Boards Western Railway!
Western Railway signed a Letter of Collaboration today to promote railway safety through the beloved cartoon character Chhota Bheem.
This initiative aims to promote Western Railway's outreach amongst its passengers through animation and… pic.twitter.com/jzW3uBKLEw
— Western Railway (@WesternRly) May 2, 2025
ప్రతి రైల్వే స్టేషన్ లోనూ చోటా భీమ్ ప్రచారాలు
“రైల్వే భద్రతకు సంబంధించి పశ్చిమ రైల్వే సాంప్రదాయ పద్ధతులతో పాటు ప్రజలతో మరింత కనెక్ట్ కావడానికి ప్రయత్నిస్తోంది. చోటా భీమ్, అతని స్నేహితుల పాత్రలను ప్రింట్, డిజిటల్, టెలివిజన్, రేడియో, పోస్టర్లతో పాటు పాఠశాలల్లోనూ ప్రచారం చేయబోతున్నాం. ఈ ప్రచారం ఒక సంవత్సరం పాటు కొనసాగుతుంది. రైల్వే భద్రత, స్టేషన్లలో మంచి ప్రవర్తన గురించి ప్రచారం కల్పించేందుకు చోటా భీమ్ ను ఉపయోగిస్తాం. చోటా భీమ్ కు పిల్లల్లో ఉన్న క్రేజ్ కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. పిల్లలతో పాటు తల్లిదండ్రులు కూడా రైల్వే భద్రత గురించి మరింత బాగా తెలుసుకునే అవకాశం ఉంటుంది” అని పశ్చిమ రైల్వే వెల్లడించింది.
Read Also: ప్రపంచంలోనే అత్యంత భయానకమైన రైలు ప్రమాదం.. ఏకంగా 1700 మంది దుర్మరణం!