E-Paper
Advertisement

ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఆవు.. దీని ప్రత్యేకత తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!

ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఆవు.. దీని ప్రత్యేకత తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!
Advertisement

World’s Most Expensive Cow: సాధారణంగా ఒక ఆవు ధర ఎంత ఉంటుంది? పాడి రైతులు మంచి జాతి ఆవులను వేలల్లో లేదంటే లక్షల్లో కొనుగోలు చేస్తుంటారు. కానీ, బ్రెజిల్‌ లో జరిగిన ఓ వేలం  అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. అక్కడ ఒక ఆవు యాజమాన్యంలోని మూడో వంతు వాటా ఏకంగా రూ. 40 కోట్లకు అమ్ముడైంది. ఆ ఆవు పేరు వియాటినా-19 FIV మారా ఇమోవీస్ (Viatina-19 FIV Mara Imóveis). భారతీయ మూలాలున్న నెల్లూరు జాతికి చెందిన ఈ ఆవు ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది.

నెల్లూరు జాతికి చెందిన ఆవు!

వియాటినా-19కు మరో ప్రత్యేకత ఉంది. ఇది బ్రెజిల్‌కు చెందిన జాతి కాదు. మన దేశంలోని నెల్లూరు జాతి నుంచి వచ్చిన పశువుల వారసత్వానికి చెందినది. ఈ జాతి పశువులను బ్రెజిల్‌లో ‘నెలోర్’గా పిలుస్తారు. అక్కడి పశుసంవర్ధక రంగంలో ఈ జాతికి మంచి డిమాండ్ ఉంది. బలమైన శరీర నిర్మాణం, వేగంగా బరువు పెరగడం, వేడి వాతావరణాన్ని తట్టుకునే సామర్థ్యం లాంటి లక్షణాల కారణంగా నెల్లూరు జాతి పశువులకు అంతర్జాతీయంగా మంచి పేరు వచ్చింది.  వియాటినా-19 సాధారణ ఆవులతో పోలిస్తే భారీ శరీరాకృతితో ఉంటుంది. దీని బరువు సుమారు 1,101 కిలోలుగా ఉంది. ఈ లక్షణాల కారణంగానే సాధారణ పాడి ఆవుగా కాకుండా తనకంటూ ఓ గుర్తింపు పొందేలా చేశాయి. అంతేకాదు, పశుసంవర్ధక రంగంలో మంచి జన్యువులను భవిష్యత్ తరాలకు అందించగల సామర్థ్యం కూడా దీని విలువను పెంచింది.

రూ.40 కోట్ల ధర ఎందుకు పలికింది?   

Advertisement

వియాటినా-19కు సంబంధించిన వేలంలో దాని 33.33 శాతం యాజమాన్య వాటా దాదాపు 4.3 మిలియన్ డాలర్లకు అమ్ముడయ్యింది. భారత కరెన్సీలో ఇది సుమారు రూ.40 కోట్లకు సమానం. అంటే, ఈ మొత్తం ఆవు మొత్తానికి చెల్లించిన ధరగా కాకుండా, దాని యాజమాన్యంలో మూడో వంతు వాటాకు సంబంధించినదే కావడం విశేషం. ఆవు జన్యు విలువ, భవిష్యత్ సంతానం ద్వారా వచ్చే ఆదాయం, అధిక నాణ్యత కలిగిన పశువుల పెంపకంలో దాని ప్రాధాన్యం ఈ ధరకు ప్రధాన కారణాలుగా చెప్పొచ్చు.

గిన్నిస్ రికార్డు కూడా!

వియాటినా-19 పేరు కేవలం భారీ ధర కారణంగానే ప్రపంచవ్యాప్తంగా వినిపించలేదు. ఇది ప్రపంచంలో అత్యంత ఖరీదైన ఆవుగా రికార్డు సృష్టించింది. అంతేకాదు, అందం, శరీరాకృతి వంటి అంశాల్లో నిర్వహించిన పోటీల్లో కూడా గుర్తింపు పొందింది. ‘మిస్ సౌత్ అమెరికా’ టైటిల్‌ ను కూడా గెలుచుకున్నది.

ఆవు అండాలకు భారీ డిమాండ్!

Advertisement

ఈ ఆవు విషయంలో మరో ఆసక్తికరమైన విషయం దాని జన్యు విలువ. భవిష్యత్ తరాల్లో ఇదే తరహా లక్షణాలను అభివృద్ధి చేయడానికి పశుసంవర్ధక రంగంలో ఎంబ్రియో, అండ కణాలకు డిమాండ్ ఉంటుంది. అందుకే వియాటినా-19 నుంచి లభించే జన్యువులకు కూడా భారీ విలువ ఏర్పడింది. ఒకప్పుడు భారతదేశం నుంచి బ్రెజిల్‌కు వెళ్లిన నెల్లూరు జాతి పశువుల వారసత్వం ఇప్పుడు ప్రపంచ పశుసంవర్ధక రంగంలో కోట్ల విలువను సంపాదించడం నిజంగా గొప్పవిషయం.

Read Also: వామ్మో.. ఏకంగా అగ్నిపర్వతంలోనే ఇళ్లు కట్టేసుకున్నారు, పేలితే?

Tags

Related News

ఒంటరితనానికి క్రేజీ సొల్యూషన్.. జస్ట్ రూ. 300కే రెంట్ కు గర్ల్ ఫ్రెండ్, ఈ కాన్సెప్ట్ భలే ఉందే!

రైలు ప్రయాణంలో ఫ్యామిలీకి వేర్వేరు సీట్లు వచ్చాయా? ఇదిగో ముందుగానే ఇలా మార్చుకోండి

వామ్మో.. ఏకంగా అగ్నిపర్వతంలోనే ఇళ్లు కట్టేసుకున్నారు, పేలితే?

రూమ్ ఫ్రెష్‌నర్స్ లేకున్నా.. హోటల్ బాత్‌రూమ్స్ చాలా ఫ్రెష్‌.. దీని వెనుక రహస్యం ఇదే!

సోలో ట్రిప్ వెళ్లాలనుకుంటున్నారా? అమ్మాయిలకైనా, అబ్బాయిలకైనా ఈ 4 ప్రదేశాలు సేఫ్ & బడ్జెట్ ఫ్రెండ్లీ!

శివుడు ఖండించిన.. వినాయకుడి మొదటి మానవ రూప తల ఎక్కడుందో తెలుసా?

గర్భిణీలకు రైలులో లోయర్ బెర్త్ రూల్ ఇదే.. అప్పర్ బెర్త్ వస్తే ఏం చేయాలంటే?

Big Stories

Advertisement
×