E-Paper
Advertisement

ప్రపంచంలోనే 5 బెస్ట్ రైలు ప్రయాణాలు.. జీవితంలో ఒక్కసారైనా వెళ్లాల్సిందే!

ప్రపంచంలోనే 5 బెస్ట్ రైలు ప్రయాణాలు.. జీవితంలో ఒక్కసారైనా వెళ్లాల్సిందే!
Advertisement

World’s Top 5 Train Journeys 2026: రైలు ప్రయాణం అంటే  ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళ్లడమే కాదు. ప్రపంచంలోని కొన్ని రైళ్లు ప్రయాణాన్ని ప్రత్యేకమైన అనుభూతిగా మార్చేస్తాయి. అందమైన ప్రకృతి దృశ్యాలు, విలాసవంతమైన బోగీలు, నోరూరించే ఫుడ్, ప్రత్యేకమైన సర్వీసులతో ప్రయాణికులను ఆకట్టుకుంటాయి. రీసెంట్ గా ట్రావెల్ + లీజర్ ప్రకటించిన 2026 వరల్డ్స్ బెస్ట్ అవార్డ్స్‌ లో ప్రపంచంలోని అత్యుత్తమ రైలు ప్రయాణాలను ఎంపిక చేశారు. వాటిలో టాప్ 5 రైలు ప్రయాణాల గురించి ఇప్పుడు చూద్దాం..

1.ఆండియన్ ఎక్స్‌ ప్లోరర్: 96.84 పాయింట్లు

ఈ లిస్టులో మొదటి స్థానాన్ని పెరూకు చెందిన ఆండియన్ ఎక్స్‌ ప్లోరర్ దక్కించుకుంది. ఇది దక్షిణ అమెరికాలో తొలి విలాసవంతమైన నైట్ ట్రైన్లలో ఒకటిగా గుర్తింపు పొందింది. అరేక్విపా నుంచి కుస్కో వరకు మూడు రోజులు, రెండు రాత్రుల పాటు ఈ ప్రయాణం సాగుతుంది.  పెరూలోని ఎత్తైన ప్రాంతాల మీదుగా వెళ్లే ఈ రైలులో టిటికాకా సరస్సు లాంటి అందమైన ప్రదేశాలను చూసే అవకాశం ఉంటుంది. ప్రత్యేకమైన ఆండియన్ వంటకాలు, స్పా సర్వీసులు, సౌకర్యవంతమైన బోగీలు ఈ ప్రయాణానికి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి.

2.హిరామ్ బింగ్‌ హామ్: 96.46 పాయింట్లు

Advertisement

రెండో స్థానంలో నిలిచిన హిరామ్ బింగ్‌ హామ్ రైలు కూడా పెరూకే చెందినది. మాచు పిచ్చుకు వెళ్లే ప్రయాణాన్ని మరింత ప్రత్యేకంగా మార్చేస్తుంది. అద్భుతమైన చెక్క అలంకరణ, లైవ్ మ్యూజిక్, వెల్ కమ్ డ్రింక్స్, ప్రత్యేక వంటకాలతో ప్రయాణికులకు విలాసవంతమైన అనుభూతిని అందిస్తుంది. కొన్నిసార్లు సంప్రదాయ నృత్య ప్రదర్శనలు కూడా ఉంటాయి.

3.రాయల్ కెనడియన్ పసిఫిక్: 90.93 పాయింట్లు

కెనడాకు చెందిన రాయల్ కెనడియన్ పసిఫిక్ మూడో స్థానంలో ఉంది. కాల్గరీ నుంచి కెనడియన్ రాకీ పర్వతాల గుండా పాతకాలపు రైలు బోగీల్లో ఈ ప్రయాణం సాగుతుంది. ఇది సాధారణ రైలు సర్వీస్ కాదు. ప్రైవేట్ చార్టర్లు, ప్రత్యేక ప్రయాణాల ద్వారా ఎక్కువగా అందుబాటులో ఉంటుంది. పాతకాలపు బోగీలు, విలాసవంతమైన వాతావరణం దీని ప్రత్యేకత.

4.రాకీ మౌంటెనీర్: 90.80 పాయింట్లు

Advertisement

నాలుగో స్థానంలో ఉన్న రాకీ మౌంటెనీర్ కెనడా, అమెరికా రాకీ పర్వతాలను చూసేందుకు మంచి అవకాశం కల్పిస్తుంది. గాజు విండోలతో కూడిన బోగీల నుంచి ప్రయాణికులు అద్భుతమైన ప్రకృతి దృశ్యాలను ఆస్వాదించవచ్చు.

5.వెనిస్ సింప్లాన్-ఓరియంట్ ఎక్స్‌ ప్రెస్: 90.78 పాయింట్లు

ఐదో స్థానంలో ఉన్న వెనిస్ సింప్లాన్-ఓరియంట్ ఎక్స్‌ప్రెస్ ప్రపంచంలోనే అత్యంత విలాసవంతమైన రైళ్లలో ఒకటి. 1920ల నాటి ఆర్ట్ డెకో స్టైల్ బోగీలు, చెక్క అలంకరణ, ప్రత్యేకమైన డిజైన్ దీనికి ప్రత్యేక గుర్తింపు తెచ్చాయి. ప్యారిస్, వెనిస్ సహా యూరప్‌లోని ప్రముఖ నగరాలను కలుపుతూ ఈ రైలు ప్రయాణిస్తుంది. ఈ ఐదు రైళ్లు ప్రయాణికులను కేవలం గమ్యస్థానానికి చేర్చడం మాత్రమే కాదు. ప్రయాణాన్నే ఒక అందమైన జ్ఞాపకంగా మార్చేస్తుంది.

Read Also: రష్యా నుంచి భారత్‌కు డైరెక్ట్ ట్రైన్.. ప్రయాణికుల కోసం కాదా?

Tags

Related News

ప్రపంచంలో వింతైన రైళ్లు.. వీటి ప్రయాణం చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే!

దేశంలో అత్యంత అందమైన రైలు ప్రయాణాలు.. ఈ 5 రూట్లు అస్సలు మిస్ కావొద్దు!

భారతీయ రైల్వేలో అత్యంత ఎత్తైన స్టేషన్ ఇదే.. హైట్ ఎంతో తెలిస్తే షాకవ్వాల్సిందే!

దేశంలో అత్యంత అందమైన రైల్వే స్టేషన్.. అక్కడ అడుగు పెడితే అస్సలు రావాలి అనిపించదు!

పొల్లూరు జలపాతం ఉగ్రరూపం.. కుప్పకూలిన ‘ఇరుముడి’ చెక్క వంతెన!

నదీ జలాలు.. సముద్రపు అలలు.. అడవి మధ్యలో బోటింగ్.. అంతర్వేది అందాలు చూస్తే మైమరచిపోతారు!

రైలు ఆపారు.. సాయం కోరారు.. గంట గడిచినా పత్తాలేని అంబులెన్స్!

రాముడు, కృష్ణుడు నీలం రంగులో ఎందుకు కనిపిస్తారు? అసలు వర్ణం నలుపు కాదా?

Big Stories

Advertisement
×