Jabardasth:గత పుష్కర కాలంగా బుల్లితెర ప్రేక్షకులకు మంచి వినోదాన్ని పంచుతూ దూసుకుపోతున్న జబర్దస్త్ (Jabardasth) కార్యక్రమం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ముఖ్యంగా ఈ జబర్దస్త్ వేదిక ప్రేక్షకులకు మంచి వినోదాన్ని పంచడమే కాదు.. ఎంతోమంది ప్రతిభ ఉన్నవారికి తమ టాలెంట్ ను ప్రూవ్ చేసుకోవడానికి వేదిక గా మారింది. ఇప్పటికే ఈ జబర్దస్త్ కార్యక్రమంలో పొట్టకూటి కోసం వచ్చి, తమదైన టాలెంట్ తో ప్రేక్షకుడిని కడుపుబ్బా నవ్వించి, ఇప్పుడు ఒక్కో మెట్టు ఎక్కుతూ.. స్టార్ సెలబ్రిటీలుగా ఎదిగిన వారు కూడా లేకపోలేదు. చమ్మక్ చంద్ర , వేణు ఎల్దండి, ధనరాజ్ , తాగుబోతు రమేష్ , సుడిగాలి సుధీర్ , ఆటో రాంప్రసాద్ , గెటప్ శ్రీను ఇలా చెప్పుకుంటూ పోతే ఎంతోమంది ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా జబర్దస్త్ కార్యక్రమంలో అడుగుపెట్టి, మంచి ప్రజాదారణ సొంతం చేసుకొని.. నేడు సినిమాలలో హీరోలుగా, కమెడియన్లుగా వ్యవహరిస్తుంటే .. మరికొంతమంది సినిమాలకు దర్శకత్వం వహిస్తున్నారు. ఇంకొంతమంది నిర్మాతలుగా మారి మంచి పేరు దక్కించుకుంటున్నారు.
జబర్దస్త్ లో కమెడియన్లు ఎలా అయితే ఆకట్టుకుంటున్నారో.. అటు జడ్జెస్ కూడా తమదైన తీర్పుతో మెప్పిస్తున్నారు. మొదట్లో రోజా, నాగబాబులతో ప్రారంభమైన ఈ జబర్దస్త్ కార్యక్రమం.. ఆ తర్వాత వాళ్ళిద్దరూ వెళ్లిపోవడం..కుష్బూ, కృష్ణ భగవాన్ తోపాటు మరికొంతమంది జడ్జెస్ గా మెప్పించడం.. ఇప్పుడు మళ్లీ నాగబాబు తిరిగి రావడంతో పూర్వ వైభవం తిరిగి వచ్చింది. ఇక రోజా స్థానంలో ఇంద్రజ సెటిలైపోయింది. ప్రస్తుతం నాగబాబు , ఇంద్రజ ఇద్దరూ కూడా తమదైన పర్ఫామెన్స్ తో ఆడియన్స్ ని ఆకట్టుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే వీరిద్దరి రెమ్యూనరేషన్ ఎంత అనే విషయాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.
అందం, అభినయంతో ప్రేక్షకులను ఉర్రూతలూగించి, స్టార్ హీరోయిన్గా పేరు సొంతం చేసుకున్న ఇంద్రజ.. సెకండ్ ఇన్నింగ్స్ లో క్యారెక్టర్ ఆర్టిస్టు పాత్రలు పోషించి మెప్పించింది. తర్వాత శ్రీదేవి డ్రామా కంపెనీ షోలో జడ్జిగా కొంతకాలం కొనసాగిన ఈమె.. ఇప్పుడు జబర్దస్త్ లో సెటిల్ అయిపోయింది. ఇకపోతే ప్రస్తుతం జబర్దస్త్ లో జడ్జిగా కొనసాగుతున్నందుకుగాను ఇంద్రజకి ఒక్కొక్క ఎపిసోడ్ కి సుమారుగా రూ.2.5లక్షలు పారితోషకం తీసుకుంటున్నట్లు సమాచారం . ముఖ్యంగా రోజా తరువాత పర్మినెంట్ జడ్జిగా ఇంద్రజ స్థిరపడ్డారు. ఈ నేపథ్యంలోని ఈమెకు ఒక్కో ఎపిసోడ్కి ఈ రేంజ్ రెమ్యూనరేషన్ ఇస్తున్నట్లు సమాచారం. ఇకపోతే వారానికి నాలుగు లేదా ఐదు ఎపిసోడ్లు వస్తాయి.. నెల వారి ఆదాయం చూసుకుంటే సుమారుగా రూ.10 లక్షలకు పైగా ఈమె రెమ్యూనరేషన్ అందుకుంటున్నట్లు తెలుస్తోంది.. ఈమెకు ఉన్న క్లీన్ ఇమేజ్, కామెడీ టైమింగ్ తో షో టి ఆర్ పి కి ఇంద్రజ ఒక వరంలా మారిందని చెప్పవచ్చు.
also read:అపూర్వ ఎలిమినేటెడ్.. వైల్డ్ కార్డు ఎంట్రీలో సంపాదించింది ఎంతంటే?
ఇకపోతే ఒకప్పుడు తనదైన కామెడీతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించిన నాగబాబు.. కొంతకాలం జబర్దస్త్ కి దూరమైన విషయం తెలిసిందే. మళ్ళీ ఇప్పుడు రీఎంట్రీ ఇచ్చారు. మరి రీ ఎంట్రీలో నాగబాబుకి ఒక్కో ఎపిసోడ్ కి ఎంత ఇస్తున్నారు అనే విషయానికి వస్తే.. ఆయన మార్కెట్, ఆయన కామెడీ టైమింగ్ తో పాటు ఆయనకున్న క్రేజ్ ని దృష్టిలో పెట్టుకొని సుమారుగా ఒక్కో ఎపిసోడ్కి రూ.5నుండి 6 లక్షల వరకు రెమ్యూనరేషన్ ఇస్తున్నారట. దీన్ని బట్టి చూస్తే నెలకు సుమారుగా 20 లక్షలకు పైగా రెమ్యూనరేషన్ ను ఒక్క జబర్దస్త్ నుండే తీసుకోవడం గమనార్హం. ఏది ఏమైనా జడ్జిలలో ఇద్దరిలో ఈ రేంజ్ వ్యత్యాసం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది.