Energy Drinks: ప్రస్తుత బిజీ లైఫ్ స్టైల్‌లో తక్షణ శక్తి పొందడానికి చాలా మంది ఎనర్జీ డ్రింక్స్ తీసుకుంటారు కానీ ప్రతిరోజూ ఎనర్జీ డ్రింక్స్ తాగడం వల్ల మీ ఆరోగ్యానికి తీవ్ర నష్టం జరుగుతుందని మీకు తెలుసా? ఎనర్జీ డ్రింక్స్ అధిక మొత్తంలో కెఫిన్, చక్కెర, కృత్రిమ మూలకాలను కలిగి ఉంటాయి. ఇవి తక్షణ శక్తిని అందిస్తాయి. కానీ దీర్ఘకాలంలో అనేక ఆరోగ్య సమస్యలను కలిగిస్తాయి. ముఖ్యంగా వర్షాకాలంలో.. మన శరీరం ఇప్పటికే వ్యాధులతో పోరాడుతున్నప్పుడు.. ఎనర్జీ డ్రింక్స్ అధికంగా తీసుకోవడం వల్ల శరీరంలో తీవ్రమైన వ్యాధుల ప్రమాదం చాలా రెట్లు పెరుగుతుంది. వీటిని అధికంగా తీసుకోవడం వల్ల అంత మంచిది కాదు. తరచుగా ఎనర్జీ డ్రింక్స్ తాగడం వల్ల ఆరోగ్యంపై కలిగే ప్రభావం కలుగుతుంది ? తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
గుండె, రక్తపోటుపై ప్రభావాలు:
ఎనర్జీ డ్రింక్స్‌లో అధిక మోతాదులో కెఫిన్ , టౌరిన్ కంటెంట్ హృదయ స్పందన రేటు, రక్తపోటును పెంచుతాయి. ప్రతిరోజూ వీటిని తీసుకోవడం వల్ల గుండెపై అదనపు ఒత్తిడి పెరుగుతుంది. అంతే కాకుండా క్రమరహిత హృదయ స్పందన, రక్తపోటు, తీవ్రమైన సందర్భాల్లో.. గుండెపోటు ప్రమాదం పెరుగుతుంది. పలు అధ్యయనాల ప్రకారం.. రోజుకు 2-3 ఎనర్జీ డ్రింక్స్ కంటే ఎక్కువ తాగడం గుండె ఆరోగ్యానికి ప్రమాదకరం. ఇప్పటికే గుండె సమస్యలు ఉన్నవారికి.. ఎనర్జీ డ్రింక్స్ తాగడం వారి ఆరోగ్యానికి మరింత హానికరం.
డయాబెటిస్ ప్రమాదం:
ఎనర్జీ డ్రింక్స్ లో అధిక మొత్తంలో చక్కెర ఉంటుంది. ఇది డయాబెటిస్, ఊబకాయం ప్రమాదాన్ని పెంచుతుంది. రోజూ ఎక్కువ మోతాదులో చక్కెర తీసుకోవడం వల్ల శరీరంలో ఇన్సులిన్ నిరోధకత పెరుగుతుంది. ఇది టైప్-2 డయాబెటిస్ ప్రమాదాన్ని పెంచుతుంది.
బరువు పెరిగే ప్రమాదం:
ఈ ఎనర్జీ డ్రింక్స్ కేలరీలు అధికంగా ఉంటాయి. ఇది బరువు పెరగడానికి ఒక పెద్ద కారణం. కృత్రిమ శక్తిని కలిగి ఉన్న ఎనర్జీ డ్రింక్స్ జీవక్రియను కూడా ప్రభావితం చేస్తాయి. ఇది బరువు పెరిగే ప్రమాదాన్ని పెంచుతుంది.
Also Read: ఉదయం పూట కుంకుమ పువ్వు నీళ్లు తాగితే.. బోలెడు లాభాలు !
నిద్రలేమి:
ఎనర్జీ డ్రింక్స్‌లో ఉండే కెఫిన్ నిద్ర నాణ్యతను ప్రభావితం చేస్తుంది. నిద్రలేమి, చిరాకు, ఒత్తిడికి దారితీస్తుంది. తరచుగా ఎనర్జీ డ్రింక్స్ తీసుకోవడం వల్ల నాడీ వ్యవస్థపై ఒత్తిడి పెరుగుతుంది. ఇది ఆందోళన , భయము వంటి సమస్యలకు దారితీస్తుంది.
సలహా:
తరచుగా ఎనర్జీ డ్రింక్స్ తాగడం గుండె, మధుమేహం, బరువు, మానసిక ఆరోగ్యానికి హానికరం. బదులుగా.. కొబ్బరి నీరు, నిమ్మరసం లేదా హెర్బల్ టీ వంటి సహజంగా తయారు చేసిన డ్రింక్స్ ఎంచుకోండి. తినే ఆహారం విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. డయాబెటిస్, గుండె జబ్బుల రోగులు తమ డాక్టర్‌ను సంప్రదించిన తర్వాతే ఏదైనా డ్రింక్ తాగాలి. అంతే కాకుండా తగినంత నిద్ర పోవడం అలవాటు చేసుకోండి. సమతుల్య ఆహారం తీసుకోండి. మీ దినచర్యలో వ్యాయామాన్ని చేర్చండి. ఈ సహజ మార్గాల్లో మీ శక్తి సమతుల్యతను కాపాడుకోండి.