E-Paper
Advertisement

విడాకులు తీసుకున్న నవ్య స్వామి వదిన.. పోస్ట్ వైరల్!

విడాకులు తీసుకున్న నవ్య స్వామి వదిన.. పోస్ట్ వైరల్!
Advertisement

Navya Swamy:సినీ, టీవీ ఇండస్ట్రీలో సెలబ్రిటీలు ఎప్పుడు ఎవరిని ఇష్టపడతారో.. ఎప్పుడు ఎవరిని పెళ్లి చేసుకుంటారో.. ఎలా విడిపోతారో చెప్పడం అసాధ్యం. ప్రేమించి పెళ్లి చేసుకున్న ఎన్నో జంటలు సవ్యంగా కాపురం చేసుకుంటుంటే.. మరికొన్ని జంటలు అనూహ్యంగా విడాకులు తీసుకొని అభిమానులను నిరాశకు గురి చేస్తున్నారు ఈ క్రమంలోనే ఒక బుల్లితెర నటి తాను ప్రేమించిన అబ్బాయిని పెళ్లి చేసుకొని, పిల్ల పాపలతో సవ్యంగా ఉంటారు అనుకునే సమయంలో అనూహ్యంగా విడాకులు తీసుకున్నామని ప్రకటించడం అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. పైగా తన నిర్ణయాన్ని గౌరవించాలని, తనకు గోప్యత కావాలి అంటూ సోషల్ మీడియా వేదికగా షేర్ చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది.

విడాకులు ప్రకటించిన ఐశ్వర్య పిస్సే..

ఆమె ఎవరో కాదు ఐశ్వర్య పిస్సే (Aishwarya Pisse).. కన్నడ బుల్లితెర వీక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు. అక్కడ హిట్ సీరియల్స్ చేసి ఇప్పుడు తెలుగులో కూడా మరింత పాపులారిటీ సొంతం చేసుకున్నారు. అగ్నిసాక్షి సీరియల్ తో ప్రేక్షకులు అలరించిన ఈమె.. ఇప్పుడు వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయంతో మళ్లీ వార్తల్లో నిలిచారు. సుమారు ఏడేళ్ల క్రితం హరి వినయ్ తో ఐశ్వర్య పిస్సే వివాహం జరిగింది. అయితే గత కొద్ది రోజులుగా వీళ్ళిద్దరూ విడిపోయారని , కలిసి ఉండడం లేదు అంటూ ఇండస్ట్రీ వర్గాలలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.. దాంతో తామిద్దరం విడిపోయామని, విడాకులు తీసుకున్నామని ఐశ్వర్య అధికారికంగా ప్రకటించడంతో అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అసలు వీళ్ళిద్దరూ విడాకులు తీసుకోవడానికి గల కారణం ఏమిటి అంటూ ఆరా తీస్తున్నారు.

మా గోప్యతను గౌరవించండి..

Advertisement

ఈ మేరకు ఆమె తన అధికారిక ఇంస్టాగ్రామ్ ఖాతా ద్వారా ఇంగ్లీష్ , తెలుగు, కన్నడ భాషల్లో తాను విడాకులు తీసుకున్న విషయాన్ని అభిమానులతో పంచుకున్నారు. “నా ప్రియమైన అభిమానులకు, ఫాలోవర్స్ కి , శ్రేయోభిలాషులకు నా వ్యక్తిగత జీవితానికి సంబంధించి వ్యాపిస్తున్న అనవసరమైన పుకార్లకు ఊహాగానాలకు ముగింపు పలకడానికి ఈ విషయంపై స్పష్టత ఇవ్వడం అవసరమని భావిస్తున్నాను. నేను, నా భర్త హరి గత ఏడాదిన్నర కాలంగా విడివిడిగా నివసిస్తున్నాము. చాలాసార్లు ఆలోచించి, పరస్పర అంగీకారంతోనే మేము విడాకులు తీసుకున్నాము. ఇది మా ఇద్దరి వ్యక్తిగత నిర్ణయం. ఈ సమయంలో మాకు అవసరమైన గోప్యతను, మనశాంతిని గౌరవిస్తూ మా నిర్ణయాన్ని అందరూ అంగీకరించి , గౌరవించాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను.

also read:ప్రేమించిన వాడి చేతిలోనే నరకం.. మొన్న అనుపమ.. నేడు?

చట్టపరమైన చర్యలు తీసుకుంటాం..

Advertisement

న్యూస్, ఫాలోవర్స్, లైక్స్ పెంచుకోవాలనే ఉద్దేశంతో తప్పుడు కథనాలను సృష్టించడం , తప్పుదారి పట్టించే వీడియోలను ప్రచురించడం, ఆధారాలు లేని ఆరోపణలు చేయడం , నా సీరియల్ లోని సన్నివేశాలను సందర్భానికి సంబంధం లేకుండా ఉపయోగించడం, నా వ్యక్తిగత పరిస్థితిని దుర్వినియోగం చేయడం చట్టరీత్యా ఆమోదయోగ్యం కాదు. దయచేసి తెరపై కనిపించే జీవితానికి, నిజ జీవితానికి మధ్య ఉన్న వ్యత్యాసాన్ని అర్థం చేసుకోండి. పుకార్లను వ్యాప్తి చేయడం ఆపండి. ఈ ప్రకటన ఇవ్వడం వెనక ఉద్దేశం స్పష్టమైన హద్దులను తెలియజేయడం మాత్రమే.. మరిన్ని చర్చలకు లేదా ఊహగానాలకు అవకాశం కల్పించడం కాదు.. ప్రతి ఒక్కరూ నా వ్యక్తిగత గోప్యతను గౌరవిస్తూ, బాధ్యతాయుతంగా వ్యవహరిస్తారని ఆశిస్తున్నాను.

నవ్య స్వామి సోదరుడే ఐశ్వర్య భర్త..

నా పని. నా వృత్తి ,నా వ్యక్తిగత జీవితం నా ప్రైవేటు విషయం.. తప్పుడు, పరువు నష్టం కలిగించే ప్రచారాన్ని తగిన చట్టపరమైన మార్గాల ద్వారా ఎదుర్కొంటాను. ఇలాంటి చర్యలు కొనసాగితే సంబంధిత వ్యక్తులపై కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయి అంటూ సుదీర్ఘ పోస్టు షేర్ చేసింది. ఐశ్వర్య భర్త ఎవరో కాదు ప్రముఖ సీరియల్ నటి నవ్య స్వామి సోదరుడు కావడం గమనార్హం.

Related News

నామినేషన్ హీట్ మధ్య నరేష్ రిలీఫ్ వర్డ్స్.. లవ్ స్టోరీ అదుర్స్?

నామినేషన్స్ లో పెద్ద గొడవ.. ఈ వారం వారికి రెడ్ కార్డ్ తప్పదా?

Gundeninda GudiGantalu Today episode: ఇదేం ట్విస్ట్ స్వామి.. అడ్డంగా బుక్కయిన విల్లా విజయ్.. రోహిణికి షాక్..

Podarillu Today Episode : బాధపడ్డ మాధవ్.. జమునకు నారాయణ స్ట్రాంగ్ వార్నింగ్.. ఇంతమోసమా..?

Intinti Ramayanam Today Episode: పల్లవి ప్లాన్ సక్సెస్.. కమల్, అవని అరెస్ట్.. పల్లవికి స్ట్రాంగ్ వార్నింగ్..

Nindu Noorella Saavasam Serial Today Episode October 13th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మనోహరిని వైజయంతి వదిలేసినట్టేనా..?  

Illu Illalu Pillalu Today Episodes: సాగర్ కు నర్మద వార్నింగ్.. సుక్కుకు ప్రేమ వార్నింగ్.. వల్లి నెక్స్ట్ ప్లానేంటి..?

Big Stories

Advertisement
×