Brahmamudi serial today Episode: గుడిలో అన్నదానం అయిపోయాక రాజ్, అపర్ణ దగ్గరకు వెళ్లి మా అమ్మ పేరు మీద అన్నదానం చేశానని ఆమె చేత కేక్ కట్ చేయించాలనుకున్నాను కానీ తను ఇప్పుడు లేదు. ఇవాళ మీ పుట్టునరోజు కాబట్టి మీరు కేక్ కట్ చేస్తారని కేక్ కూడా తెప్పించాను మీరు ఏమీ అనుకోకుండా వచ్చి కేక్ కట్ చేస్తారా..? అమ్మా అంటూ రాజ్ అడగడంతో అపర్ణ మనసులో బాధపడుతుంది. కన్నతల్లినే సొంత తల్లిలా బావిస్తాను అనే పరిస్థితి వచ్చింది కదా అనుకుని ఎమోషనల్ అవుతుంది. రాజ్ ఏమైందమ్మా అని అడగ్గానే.. అపర్ణ ఏమీ లేదు బాబు నా కొడుకు గుర్తుకు వచ్చాడు అని చెప్పగానే.. ఆ కొడుకు కోసమే వచ్చి కేక్ కట్ చేయండి రండి అమ్మా అంటూ చేయి పట్టుకుని తీసుకువెళ్తాడు రాజ్. వాళ్లిద్దరూ అలా నడుస్తూ రావడం చూసిన కావ్య ఎమోషనల్ అవుతుంది.
ఇంతలో అక్కడకు యామిని వస్తుంది. అపర్ణ చేత రాజ్ కేక్ కట్ చేయించడం చూసి షాక్ అవుతుంది. కేక్ కట్ చేసిన అపర్ణకు రాజ్ కేక్ తినిపిస్తూ హ్యాపీ బర్తుడే అమ్మా అంటూ విష్ చేస్తాడు. యామిని మాత్రం రాజ్‌కు గతం గుర్తుకు వచ్చిందా..? వాళ్లమ్మకు కేక్ తినిపిస్తున్నాడు. సెలబ్రేషన్స్ చేసుకుంటున్నారు అలా జరగడానికి వీల్లేదు అనుకుంటూ వెళ్లి రాజ్‌ను పిలుస్తుంది. యామిని చూసిన రాజ్ కోపంగా నువ్వేంటి ఇక్కడ యామిని నేను ఇక్కడ ఉన్నట్టు నీకెలా తెలిసింది అంటూ నిలదీయడంతో యామిని ఏం చెప్పాలో అర్థం కాక చూస్తుంటుంది. ఇంతలో కావ్య తనను నేనే రమ్మన్నాను అని చెప్తుంది. దీంతో రాజ్ నువ్వు రమ్మనడం ఏంటి..? తను నీకెలా తెలుసు అని అడుగుతాడు.
దీంతో పరిచయం ఏం లేదు ఇందాక నువ్వు హ్యాండ్ వాష్ చేసుకోవడానికి వెళ్లినప్పుడు తను నీకు కాల్ చేసింది. నేనే లిఫ్ట్ చేసి చెప్పాను అనగానే యామిని కూడా అవును అంటూ బావ ఇంతకీ ఈవిడ ఎవరు అని అపర్ణ గురించి అడుగుతుంది. దీంతో రాజ్ అమ్మ అని చెప్తాడు. యామిని షాక్ అవుతుంది. కావ్య, అపర్ణ ఆశ్చర్యపోతారు. తర్వాత అపర్ణ, కావ్యలకు రాజ్ బై చెప్పి వెళ్లిపోతూ.. వెనక్కి వెళ్లి అపర్ణ కాళ్ల మీద పడి ఆశీర్వదించమని అడుగుతాడు. అపర్ణ దీవించగానే.. యామిని వెళ్లి ఆంటీ పెళ్లి చేసుకుని త్వరలో ఒక్కటవ్వబోతున్నాం పనిలో పనిగా మా జంటను దీవించండి అని అడుగుతుంది. దీంతో అపర్ణ, కావ్య షాక్ అవుతారు. ముభావంగా దీవిస్తుంది అపర్ణ. యామిని, రాజ్ వెళ్లిపోతారు.
ఇంటికి వచ్చిన రాజ్, యామినిలను చూసి వైదేహి వాళ్లు దర్శనం ఎలా జరిగిందని అడుగుతారు. యామిని బాగానే జరిగిందని.. పైగా బావ ఇవాళ అన్నదానం చేశారని చెప్తుంది. అన్నదానం ఎందుకు చేశారని అడిగితే.. ఇవాళ అమ్మ పుట్టినరోజు అని చేశానని చెప్తాడు. దీంతో అవును కదా మేము మర్చిపోయాం అని వైదేహి వాళ్లు చెప్తారు. అయినా ఇవాళ మీ అమ్మ పుట్టినరోజు అని మీకెలా తెలిసింది అని అడుగుతారు. అమ్మ వాళ్ల సమాధి మీద ఉంది కదా అని చెప్తాడు రాజ్. అలాగే గుడిలో జరిగిన అపర్ణ బర్తుడే విషయాలు కూడా చెప్తాడు. తర్వాత అపర్ణ ఎవరని వైదేహి అడుగుతుంది. రాజ్ వాళ్ల కన్నతల్లి అని యామిని చెప్పడంతో వైదేహి షాక్ అవుతుంది. ఇంతటితో నేటి బ్రహ్మముడి సీరియల్ ఎపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: సకల బాధలను దూరం చేసే షణ్ముఖి రుద్రాక్ష ధారణ ఎవరు చేయాలి..?