E-Paper
Advertisement

Brahmamudi Serial Today Episode August 15th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: రేఖను అడుక్కోమని బొచ్చ ఇచ్చిన శేషు 

Brahmamudi Serial Today Episode August 15th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: రేఖను అడుక్కోమని బొచ్చ ఇచ్చిన శేషు 
Advertisement

Brahmamudi serial today Episode: సుభాష్‌కు ఆపరేషన్‌ కోసం వచ్చిన లాభాల్లోంచి కొంత డబ్బు తీసి అపర్ణకు ఇస్తే.. తనకెందుకు ఇప్పుడు ఆపరేషన్‌ అని సుభాష్‌ అంటే తను ఇంటికోసం కష్టపడిన విషయాలు గుర్తు చేసి ఎమోషనల్‌ అవుతుంది ఇందు.  డబ్బులు అపర్ణ చేతిలో పెట్టి డాక్టర్‌ అపాయింట్‌ తీసుకున్న తర్వాత చెప్తాను వెళ్లి కలుద్దామని చెప్తుంది. భ్రమరాంబ మాత్రం సరే ఇక మిగిలిన డబ్బు ఏం చేస్తారు అని అడగ్గానే.. రాజు మిగిలిన డబ్బు ఒక్క లక్ష రూపాయలు మాత్రమే అంటాడు. భ్రమరాంబ బాధగా ఏంటి లక్షనా..? వచ్చిందంతా మనదే అనుకున్నాను లక్షే మిగిలిందా..? అని మనసులో అనుకుంటూ.. ఇదిగో ఇందు నువ్వు తప్పుడు లెక్కలు చూపిస్తున్నావు అనగానే..

మరి ఇన్ని రోజులు మీరు ఏం చూపించారు అని అడగ్గానే.. భ్రమరాంబ తడబడుతుంది… రాజు ఇందు మరి ఈ లక్ష ఏం చేద్దాం అంటే.. ఇంటి ఖర్చుల కోసం ఆంటీ ఇవి మీరే తీసుకోండి అనగానే.. రాజు పిన్ని ఇంటి బాధ్యతల చూసుకోవడం ఏంటి..? అవన్నీ నువ్వే చూస్తున్నావు కదా అవి నీ దగ్గర ఉండాలి అంటూ డబ్బులు తీసి ఇందుకే ఇస్తాడు రాజు. భ్రమరాంబ కోపంగా రేఖ ఫీలయ్యావా..? అని అడిగితే.. చెల్లెమ్మ ఎందుకు ఫీల్‌ అవుతుంది. సీఈవో పదవినే త్యాగం చేసింది. ఆప్రాల్‌ ఈ లక్ష రూపాయలు ఒక లెక్కనా..? అంటూ శేషు వెటకారంగా మాట్లాడుతుంటే.. రేఖ నేను ఫీల్‌ అవ్వలేదు అంటుంది. దీంతో భ్రమరాంబ కోపంగా విన్నావా అమ్మ ఏం ఫీల్‌ అవ్వలేదట.. లక్ష రూపాయలు నీ దగ్గరే పెట్టుకో అంటూ వెళ్లిపోతుంది.

Advertisement

వెంకీ ఒకవైపు నందు ఫోటో చూస్తూ బాధపడుతుంటాడు. మరోవైపు నందు కూడా తన ఫోన్‌లో వెంకీ ఫోటో చూస్తూ బాధపడుతూ.. ఎందుకురా నన్ను ఇలా మోసం చేస్తున్నావు.. నీకు వచ్చిన పెళ్లి సంబంధం అబద్దం అయితే బాగుండు అనుకుంటుంది. వెంకీ కూడా అది అబద్దమే నందు. కానీ నీ మనసులో నా మీద ఉన్న ప్రేమ చెరిగిపోవాలని ఇలా మాట్లాడాను అనుకుంటాడు.. చెరిపేసుకుంటే చెరిగిపోయే ప్రేమ కాదురా నాది అనుకుంటుంది నందు. కానీ నువ్వు నాతో కలిసి బతకలేవు అని వెంకీ అనుకుంటే.. నేను అలా ఊహించుకోలేకపోతున్నాను అని నందు అనుకుంటుంది.

నువ్వు నాకు కావాలిరా..? అనుకుంటుంది. వెంకీ కూడా నాకు నువ్వే కావాలి అనిపిస్తుంది కానీ పరిస్థితులు అడ్డుపడుతున్నాయి.. అనుకోగానే.. ఏ పరిస్థతులైనా నాకు చెబితే నేను సాల్వ్‌ చేస్తాను కదా… కానీ నీ మనసులో నేను ఉన్నా కూడా లేనని ఎలా చెప్తున్నావురా అనుకుంటూ నందు బాధపడుతుంది. ఇది పరిష్కారం లేని సమస్య నందు అందుకే నిన్ను దూరం పెడుతున్నాను అనుకుంటూ వెంకీ బాధపడతాడు. వెంకీ బాధను చూసి దగ్గరకు వెల్లి ఓదారుస్తుంది. మొదటిసారి తల్లిదండ్రులను అర్థం చేసుకున్న కొడుకును చూస్తున్నాను.. కానీ నువ్వు ఈ భారాన్ని ఎలా మోస్తావోనని భయంగా ఉందిరా అంటుంది.

Advertisement

గార్డెన్‌లో కూర్చున్న రేఖ, భ్రమరాంబ, భూషణ్‌ ల దగ్గరకు అడుక్కుతినే బొచ్చలు తీసుకుని వెళ్లి తలా ఒకటి ఇస్తాడు శేషు. రేఖ ఏంటి అన్నయ్య ఇది అని అడిగితే.. మీరు ఇక నుంచి అడుక్కుతినాల్సిందే.. వెళ్లండి.. అంటూ ఎవరు ఎక్కడ ఆడుక్కోవాలో వారికి ఆ అడ్రస్ చెప్తాడు. శేషు మాటలకు రేఖ కోప్పడుతుంది. శేషు మాత్రం అవును చెల్లెమ్మ మీరు ఇలాగే వెలితే ఎవరూ ఒక్క రూపాయి కూడా వేయరు.. చినిగిపోయిన గుడ్డలు ఉంటే వేసుకోండి.. లేదంటే ఉన్న గుడ్డలే చింపుకోండి అంటూ సలహా ఇస్తాడు.

దీంతో రేఖ కోపంగా అన్నయ్య అసలు నువ్వేం మాట్లాడుతున్నావో నీకైనా అర్తం అవుతుందా..? అంటుంటే.. భ్రమరాంబ మా ఆయన చెప్పింది నిజమే కదా రేఖ మనం ఎన్ని కలలు కన్నాం చివరికి ఏం మిగిలింది ఈ బొచ్చే కదా..? చూస్తుంటే.. మనం అడుక్కోవాల్సిన పరిస్థితి వస్తుందేమో అనిపిస్తుంది అంటూ చెప్పగానే.. రేఖ కోపంగా భ్రమరాండను తిడుతుంది. భ్రమరాండ కూడా రేఖను తిడుతుంది. నువ్వే ఏదేదో చెప్పావు కానీ ఇక్కడ జరుగుతున్నదేంటి..? నువ్వు ఇలాగే ఉంటే మనల్ని కట్టుబట్టలతో బయలకు గెంటేస్తారు అంటూ వార్నింగ్‌ ఇస్తుంది.

రూంలో ఉన్న రాజు, ఇందును చూస్తూ.. అందరికీ డబ్బులు ఇచ్చింది కానీ నాకు ఇవ్వాల్సిన పేమెంట్‌ ఇవ్వడం లేదు అని మనసులో అనుకుంటూ బాధపడుతుంటాడు. ఇన్‌డైరెక్టుగా ఇందును ఇంకెవరికైనా పేమెంట్‌ ఉందేమో గుర్తు చేసుకో అని చెబుతాడు. ఇందు మాత్రం ఇంకెవ్వరికీ ఒక్క రూపాయి కూడా ఇచ్చేది లేదు అంటుంది.. రాజు అసహనంగా వెళ్లిపోతుంటే.. పిలిచి రాజుకు ఐదు లక్షలు ఇస్తుంది ఇందు. రాజు షాక్‌ అవుతాడు. ఇందు మాత్రం నువ్వు నా కోసం ఎంతో చేస్తున్నావు కానీ నీకు ఇవ్వాల్సింది ఇస్తున్నాను అని చెప్తుంది. డబ్బులు చూసిన రాజు ఎమోషనల్‌గా ఇందును హగ్‌ చేసుకుంటాడు. ఇందు మాత్రం ఈ సంతోషం మీ ఇంట్లో వాళ్లతో కూడా షేర్‌ చేసుకుందాం పద మీ ఇంటికి వెళ్దాం అంటుంది ఇందు.  ఇందు రాజు కలిసి చలపతి ఇంటికి వెళ్తారు. ఇంతలో ఈరోజు బ్రహ్మముడి సీరియల్‌ ఎపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: మిథున రాశిలోకి శుక్రుడు – ఆ ఐదు రాశులకు గజలక్ష్మీ యోగం – అపర కుబేరులు అవ్వడం ఖాయం

 

Related News

Gundeninda GudiGantalu Today episode: చింతామణికి దిమ్మతిరిగే షాక్.. మీనా ఫుల్ హ్యాపీ.. ఇది కదా అసలు ట్విస్ట్..

Podarillu Today Episode : చక్రీ మాటతో గోపిక షాక్.. బాధపడ్డ మాధవ్.. లక్కీ, విక్కీ లవ్ ట్రాక్..

మా బంధం ముగిసిపోయింది..రీతూ – పవన్ బ్రేకప్.. ఏమైందంటే..?

Illu Illaalu pillalu Srivalli : శ్రీవల్లి అవుట్.. చందుకు కొత్త జోడిగా ఎవరంటే..?

Illu Illalu Pillalu Today Episodes: భద్రకు ప్రేమ దిమ్మతిరిగే షాక్.. తండ్రిగా మారిన తిరుపతి.. వల్లికి కొత్త టెన్షన్..

Intinti Ramayanam Today Episode: మీనాక్షిని మోసం చేసిన పల్లవి.. పార్వతికి పల్లవి పై అనుమానం.. కమల్ కు షాక్..

Ninnu kori Serial Today Episode September 30th ‘నిన్ను కోరి’ సీరియల్‌: రైస్ మిల్లు లెక్కల్లో రెండు లకలు తేడా చూపించిన చంద్ర  

Intinti Ramayanam Pallavi : పల్లవికి ఏమైంది..? ఇది అసలు ఊహించలేదు..

Big Stories

Advertisement
×