E-Paper
Advertisement

బాన్సువాడలో బిగ్ ట్విస్ట్.. KCR వద్ద పోచారం పశ్చాత్తాపం.. BRS లైన్ క్లియర్ చేసిందా?

బాన్సువాడలో బిగ్ ట్విస్ట్.. KCR వద్ద పోచారం పశ్చాత్తాపం.. BRS లైన్ క్లియర్ చేసిందా?
Advertisement

Pocharam Srinivas: తెలంగాణ రాజకీయాల్లో మరో ఆసక్తికరమైన చర్చ మొదలైంది. బాన్సువాడ నియోజకవర్గానికి చెందిన సీనియర్ నాయకుడు, మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి తిరిగి సొంత గూటికి చేరుతారనే వార్తలు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. కొన్ని నెలల క్రితం బిఆర్‌ఎస్ నుండి కాంగ్రెస్‌లోకి వెళ్లిన ఆయన, మళ్లీ బిఆర్‌ఎస్‌లోకి వస్తారనే ప్రచారం జోరు అందుకుంది.

పోచారం పశ్చాత్తాపం.. పార్టీ వర్గాల్లో చర్చ

Advertisement

కేసీఆర్‌ను వీడి వెళ్లడం సరికాదని.. ‘అన్నం పెట్టిన వారిని మరవకూడదు’ అంటూ పోచారం భావోద్వేగానికి లోనైనట్లు ప్రచారం జరుగుతోంది. బిఆర్‌ఎస్‌లో తగిన ప్రాధాన్యం పొందిన ఆయన, పార్టీ మారిన తర్వాత చోటుచేసుకున్న పరిణామాలపై పశ్చాత్తాపం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. పార్టీ నాయకులు కూడా ఈ విషయంపై అంతర్గతంగా చర్చించుకుంటున్నారు.

కేటీఆర్ సూచనలు.. మారిన సమీకరణాలు

Advertisement

పోచారంపై బిఆర్‌ఎస్ నాయకులు ఎవరూ బహిరంగంగా విమర్శలు చేయవద్దని కేటీఆర్ పార్టీ నాయకులకు అంతర్గతంగా సూచించినట్లు సమాచారం. సీనియర్ నాయకుడు కావడం, సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉండటంతో ఆయన రాకను బిఆర్‌ఎస్ నాయకత్వం కూడా పరిశీలిస్తోంది. గతంలో విమర్శలు చేసిన నాయకులు ప్రస్తుతం మౌనంగా ఉండటం ఈ ప్రచారానికి మరిన్ని బలాన్ని చేకూరుస్తోంది.

బాన్సువాడలో గెలుపు గుర్రం

బాన్సువాడ నియోజకవర్గంలో పోచారానికి ప్రత్యామ్నాయంగా బలమైన నేత లేకపోవడం కూడా బిఆర్‌ఎస్ ఆలోచనకు ప్రధాన కారణంగా కనిపిస్తోంది. క్షేత్రస్థాయిలో ఆయనకున్న పట్టు, ప్రజల్లో ఉన్న ప్రజాదరణ దృష్ట్యా ఆయన మళ్లీ బిఆర్‌ఎస్‌లోకి వస్తే పార్టీకి మేలు జరుగుతుందని భావిస్తున్నారు.

అయితే ఆయనకు గతంలో ఇచ్చినట్లే పార్టీలో సరైన గౌరవం దక్కుతుందా లేదా అనేది వేచి చూడాలి. పోచారం తిరిగి గులాబీ గూటికి చేరితే, అది కాంగ్రెస్ పార్టీకి పెద్ద షాక్ అనడంలో సందేహం లేదు.

Also Read: హైడ్రాకు మద్దతుగా వృత్తి నిపుణులు.. కమీషనర్‌ ఏవీ రంగనాథ్‌తో భేటీ!

Tags

Related News

ప్రధాని పీఠం నెహ్రూ-గాంధీ కుటుంబం సొత్తా: రాంచందర్ రావు!

కులగణనపై దేశవ్యాప్తంగా ఉద్యమానికి కాంగ్రెస్ బిగ్ ప్లాన్..!

భవిష్యత్‌లో తెలంగాణకు బీసీయే సీఎం.. క్లారిటీ ఇచ్చిన మహేష్ కుమార్ గౌడ్!

ఎల్-నినోతో ఎండిపోతున్న పంటలు.. గద్వాల జిల్లా మదనపల్లిలో కన్నీటి దృశ్యం!

తొర్రూరు స్కూల్‌లో హైడ్రామా.. ప్రిన్సిపల్ కోసం రోడ్డెక్కిన విద్యార్థులు!

దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఘోర ప్రమాదం.. రాపిడో డ్రైవర్ మృతి..!

మందు బాబులకు షాకింగ్ న్యూస్.. రాష్ట్ర వ్యాప్తంగా బార్లు, రెస్టారెంట్లు బంద్!

వరుణయాగాలు చేసి ప్రజలను వదిలేసారా.. సీఎం రేవంత్ పై కవిత ఫైర్!

Big Stories

Advertisement
×