Brahmamudi serial today Episode: ధాన్యలక్ష్మీ, రుద్రాణి ఇద్దరూ కలిసి సీతారామయ్యను తిడతారు. ఇక మనం వీధిన పడాల్సిందే అంటూ ధాన్యలక్ష్మీ తిడుతుంది. సచ్చినా బయట వెళ్లాల్సిన అవసరమే లేదు అంటుంది రుద్రాణి. అయితే పోలీసులను తీసుకొచ్చి బలవంతంగా బయటకు గెంటివేస్తాం అంటారు బాంకర్లు. మేము కోర్టుకు పోతాం అని ధాన్యలక్ష్మీ, స్టే ఆర్డర్ తీసుకొస్తామని రుద్రాణి.. పెద్దాయన మతి స్థిమితం కోల్పోయి ఏదో రాసిస్తే మాకేంటి సబంధం అని రాహుల్ అంటాడు. అసలు పెద్దాయన ఇచ్చిన మాటతో కానీ రాసిచ్చిన పత్రంతో కానీ మాకెలాంటి సంబంధం లేదు అంటుంది ధాన్యలక్ష్మీ.
అది కాదు పిన్ని తాతయ్య మాటకు మనం తల వంచాలి కదా అని రాజ్ చెప్పగానే తల వంచడం కానీ తల దించడం కానీ లేదు. కావాలంటే నువ్వు మీ అమ్మ, మీ నాన్న తల వంచండి. మీ తాత మాటలకు కట్టుబడి ఉంటే అడుక్కుతినాలి. మాకేం కర్మ వారసులుగా మా ఆస్థి మేము రాబట్టుకోవడానికి కోర్టుకు వెళ్లే తీరుతాం అంటుంది ధాన్యలక్ష్మీ. అవును నా చెవి దుద్దులు అమ్మైనా సరే మంచి లాయర్ ను పెట్టుకుని కోర్టుకు వెళ్తాం అంటుంది రుద్రాణి. దీంతో ఇందిరాదేవి కోపంగా ఆపండి అంటూ ఇన్నాళ్లు ఆయన ముందు మాట్లాడటానికే భయపడే మీరు ఇవాళ ఆస్థులు పోయాయి అనగానే ఆయనకు మతిస్థిమితం లేదంటారా..? ఇదంతా నా భర్త స్వార్జితం.. పోతే పోయింది. ఆయన ఇచ్చిన మాట పెట్టిన సంతకం అన్ని ఆయన కోసం గౌరవించి తీరాలి అంటుంది.
దీంతో కుదరదని రుద్రాణి, ధాన్యలక్ష్మీ చెప్తారు. కోర్టుకు వెళ్లే తీరతామని అంటారు. ఆస్థుల కోసం భాగాల కోసం కోర్టుకు వెళ్తారా..? చావుబతుకుల మధ్య ఉన్న మనిషికి ఈ విషయం తెలిస్తే ఆయన బతుకుతారా..? ఆయన మాట పోయిన రోజు ప్రాణాలు వదిలేస్తారు. ఆయనే లేకుంటే ఈ చిట్టి బతకదు.. అంటూ హార్ట్ స్ట్రోక్‌తో కుప్పకూలిపోతుంది. రాజ్ కంగారుగా నాన్నమ్మా అంటూ ఉలికి పడి నిద్ర లేస్తాడు. ఏంటి ఇదంతా కలా అని భయపడతాడు. బాంకు వాళ్లు చెప్పినట్టు లోన్ కట్టకపోతే ఇదంతా నిజంగానే జరుగుతుంది. ఇప్పుడు ఎలా..? ఏం చేయాలి అని ఆలోచిస్తూ సంతోష్‌కు ఫోన్ చేసి లోన్ అడుగుతాడు. డాక్యుమెంట్స్ అన్ని తీసుకుని రమ్మని చెప్తాడు.
డాక్టర్ వచ్చి సీతారామయ్యను చెక్ చేస్తాడు. తాతగారు ఎప్పుడు మమూలు మనిషి అవుతారని అడుగుతాడు. చెప్పలేమని.. ట్రీట్‌మెంట్ చేసుకుంటూ వెళ్తుంటే ఏదో ఒకరోజు కోమాలోంచి బయటకు వస్తాడని చెప్పి డాక్టర్ వెళ్లిపోతాడు. మరోవైపు అందరూ కలిసి భోజనం చేస్తుంటే.. ధాన్యలక్ష్మీ ఏంటి కూరలన్నీ ఇంత చప్పగా ఉన్నాయి. ఉప్పు లేని చప్పిడి కూడు పెడుతున్నావేంటి.. అంటుంది. ఉప్పు వేసినా ఏం లాభం అనుకున్నావా..? కావ్య. ఈ ఇంటి ఉప్పు తిన్న విశ్వాసం కూడా వీళ్లెవరికీ లేదని ఉప్పేయడం మానేశావా..? అంటుంది అపర్ణ. నేను సరిగ్గానే వేశాను అత్తయ్య అంటుంది కావ్య. సరిగ్గానే వేసిందంట ధాన్యలక్ష్మీ.. అత్తగారు వెనకేసుకొస్తున్నారు కదా..? రుచి చూసిన వాళ్లు పిచ్చోళ్లు.. నోట్లో నాలుకే లేనివాళ్లు అంటుంది రుద్రాణి.
నడమంత్రపు సిరి బాగా తలకు ఎక్కినట్టు ఉంది అంటుంది ధాన్యలక్ష్మీ. ఎవరికీ నీకా… నీ పుట్టింట్లో నీకెలాగూ గతి లేదు కదా..? అంటాడు ప్రకాష్. మధ్యలో నా పుట్టింటిని ఎందుకు లాక్కొస్తారు అంటుంది ధాన్యలక్ష్మీ. నువ్వు ఉప్పు గురించి కావ్యను అనలేదా..? అంటాడు ప్రకాష్. నడమంత్రపు సిరి వచ్చాక మొదటగా నా మొగుడిని నా అత్తను ఇంట్లోంచి గెంటి వేయాల్సింది కానీ అది ఏం చేయలేదు కావ్య అంటుంది స్వప్న. దీంతో వాళ్లు బయటకు వెళితే వాళ్లతో పాటు నువ్వు కూడా బయటకు పోవాలి తెలుసా..? అంటే నాకేం కర్మ నాకు నా పుట్టబోయే బిడ్డకు తాతయ్య ఆస్థి రాసిచ్చారు కదా..? అంటుంది స్వప్న. అందరి మధ్య గొడవ జరగుతుంది. ఇంతలో రాజ్ వస్తాడు. నేరుగా కళావతిని సాయం అడగకుండా ముందు పొగడ్తలతో ముంచెత్తాలి. తర్వాత సాయం అడగాలి అనుకుంటూ దగ్గరకు వచ్చి ఏంటి కళావతి వంటలన్నీ గుమగుమలాడుతున్నాయి అంటాడు.
వాసన చూస్తుంటేనే నోరూరుతుంది అనగానే ఏంట్రా తినక ముందే మాట్లాడుతున్నావు అని ఇందిరాదేవి అడగ్గానే కళావతి వంటకు వంకలు పెట్టాలా నాన్నమ్మ.. కళావతి వంటలు బాగా లేవన్న వాళ్లు ఇంటింటికి తిరుగుతూ అడుక్కుతినాలి అంటాడు. ముందు తిని తర్వాత మెచ్చుకో అంటుంది ధాన్యలక్ష్మీ. సరేనని రాజ్ తిని అబ్బా ఈరోజే వంటల్లో ఉప్పు తక్కువ కావాలా..? అని మనసులో అనుకుని బయటకు మాత్రం సూపర్బ్ గా ఉన్నాయి అంటాడు. దీంతో రుద్రాణి రాజ్ కూడా నాటకాలు చాలా బాగా ఆడుతున్నాడు.. యావదాస్తి, ఇంటి తాళాలు కావ్య దగ్గర ఉన్నాయి కదా అందుకే ఈ నటన అంటుంది. రాజ్ కోపంగా ఆస్తుల కోసం ఒకరిని పొగిడి భజన చేసి బతకాల్సిన కర్మ నాకేం పట్టలేదు అంటూ రాజ్ తినకుండా వెళ్లిపోతాడు. దీంతో కావ్య కోపంగా నా భర్తను తినకుండా చేశారు. చీ కనీసం మనుషుల్లా ప్రవర్తించండి అంటూ వెళ్లిపోతుంది. ప్రకాష్ కూడా భోజనం చేయకుండా వెళ్లిపోతాడు.
ట్రైనింగ్ లో ఉన్న అప్పు, కళ్యాణ్‌కు ఫోన్ చేస్తుంది. ట్రైనింగ్ గురించి కళ్యాణ్‌కు చెప్తుంది అప్పు. రోజంతా దూకి, ఎక్కి అలసిపోతున్నాను అంటుంది. పక్కన నువ్వుంటే సాయంత్రానికి నాకు తినిపించాలి అనిపిస్తుంది అని చెప్తుంది. పోలీస్ ట్రైనింగ్ అంటే అలాగే ఉంటుంది పొట్టి అంటాడు కళ్యాణ్. ఇంతటితో నేటి బ్రహ్మముడి సీరియల్ ఎపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: సకల బాధలను దూరం చేసే షణ్ముఖి రుద్రాక్ష ధారణ ఎవరు చేయాలి..?