E-Paper
Advertisement

Brahmamudi Serial Today Episode July 28th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: మదన్ చెంప పగులగొట్టిన రేఖ   

Brahmamudi Serial Today Episode July 28th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: మదన్ చెంప పగులగొట్టిన రేఖ   
Advertisement

Brahmamudi serial today Episode: రూమ్‌లో కూర్చుని నందు ఫోటో చూస్తూ బాధపడుతుంటాడు వెంకట్‌. నువ్వు లేకుండా నేను ఎలా ఉండాలి. ఈ బాధ ఈ భారం నేను మోయగలనా..? అంటూ ఎమోషనల్‌ అవుతుంటే.. అప్పుడే నందు కాల్‌ చేస్తుంది. వెంకట్‌ కాల్‌ కట్‌ చేస్తాడు. నందు మళ్లీ ఫోన్‌ చేస్తుంది. వెంకట్‌ లిఫ్ట్‌ చేయగానే.. అరేయ్‌ అర్జెంట్‌గా వెళ్లాలి అని వెళ్లిపోయావు వెళ్లిన దగ్గరి నుంచి ఫోన్‌ లేదు నేను ఫోన్‌ చేస్తే కట్‌ చేస్తున్నావు అయినా సరే నేను వస్తున్నాను రెడీగా ఉండు బయటకు వెళ్లాలి అని నందు చెప్పగానే.. వెంకట్‌ నేను రాలేను నందు అని చెప్తాడు.

ఆ మాటకు నందు ఏంట్రా నేను దుగ్గిరాల అమ్మాయిని అని తెలిసినప్పటి నుంచి నీలో ఏదో చేంజ్‌ కనిపిస్తుంది అని అడగ్గానే.. వెంకీ అదేం లేదు నందు నాకు ఒక ఇంపార్టెంట్‌ వర్క్‌ ఉంది అని చెప్పగానే.. ఓ నాకన్నా ఇంపార్టెంట్‌ వర్కా..? అని నందు అడగ్గానే.. అదేం లేదు సారీ నందు ఏమీ అనుకోకు నేను రాను నువ్వు వెళ్లు అంటూ కాల్‌ కట్‌ చేస్తాడు వెంకీ. నందు అనుమానంగా అసలు వీడికి ఏమైంది. ఒకవేళ నాకు ప్రపోజ్‌ చేస్తే నేను ఏమనుకుంటానోనని భయపడుతున్నాడా..? అదే అయ్యుంటుంది. ఇక లాభం లేదు మనమే ఒక అడుగు ముందుకు వేయాలి. ఇప్పుడే వాళ్ల ఇంటికి వెళ్తాను అని డిసైడ్‌ అవుతుంది నందు.

Advertisement

లక్కీ టీవీలో సీరియల్‌ చూస్తూ.. ఉంటే మదన్‌ వచ్చి ఏం చూస్తున్నావు అని అడిగితే సీరియల్‌ చూస్తున్నాను అని చెప్తాడు లక్కీ ఈ రోజుల్లో ఎవరైనా సీరియల్స్ చూస్తారా..? అంటూ రిమోట్‌ తీసుకుని ఏదో చానెల్‌ పెడతాడు.. చానెల్‌ పెట్టి ఫోన్‌ చూస్తుంటాడు మదన్‌. తమ్ముడేంటి చానెల్‌ మార్చి ఫోన్‌ చూస్తున్నాడు కదా అనుకుని రిమోట్‌ తీసుకుని లక్కీ చానెల్‌ మార్చేస్తాడు. దీంతో మదన్‌, లక్కీని తిడతాడు. దీంతో ఇద్దరి మధ్య గొడవ జరుగుతుంది. ఒకరి గల్లా ఒకరు పట్టుకునే ఒకరు పట్టుకునే స్థాయికి చేరుకుంటుంది గొడవ. ఇద్దరి మధ్య పెనుగులాట జరుగుతుంది. అప్పుడే భ్రమరాంబ వచ్చి అందరినీ పిలుస్తుంది. అందరూ వస్తారు. రేఖ, భూషణ్‌ ఇద్దరిని దూరంగా లాగేస్తారు. భ్రమరాంబ కోపంగా చూశావా రేఖ మనం పడేసే ఎంగిలి మెతుకులు తినే వీడు ఇవాళ మదన్‌ కాలర్‌ పట్టుకునే స్థాయికి వచ్చాడంటే నువ్వు వీణ్ని వెనకేసుకురాబట్టే కదా వీడు ఇలా రెచ్చిపోతున్నాడు అంటూ తిడుతుంది.

భూషణ్‌ కూడా కోపంగా లక్కీని తిడతాడు. వాడు నీలాగా బస్తీ వాడు అనుకున్నావా..? అంటూ తిడతాడు. లక్కీని తన్ని ఇంట్లోంచి తరిమేయమని భ్రమరాంబ చెప్తుంది. లక్కీ సారీ మేడం అప్పటికీ నేను చాలా తగ్గాను అంటూ చెప్తుంటే.. రాజు వెళ్లి అరేయ్‌ నువ్వు తప్ప చేయకపోతే సారీ చెప్పడం ఏంటి..? అంటూ సపోర్టుగా మాట్లాడతాడు. భ్రమరాంబ మాత్రం రేఖ వాణ్ని తన్ని బయటకు పంపించేయ్‌ అంటూ చెప్తుంటే.. రాజు వచ్చి కొట్టమను చూస్తాను అంటాడు. రేఖ వెళ్లి కోపంగా లక్కీని చూసి.. తిరిగి మదన్‌ను కొడుతుంది.

Advertisement

అందరూ షాక్‌ అవుతారు. రేఖ కోపంగా ఎవరు నువ్వు ఈ రేఖ కొడుకువి.. నీ స్థాయి తెలిసి కూడా ఇలాంటి వాళ్లతో గొడవ పడుతున్నావంటే ఏంటి అర్థం నిన్ను ఇలాగే పెంచుతున్నానా..? ముందు నువ్వు ఇక్కడి నుంచి వెళ్లు అంటూ రేఖ వెళ్లిపోతుంది. మదన్‌ కోపంగా వెళ్లిపోతాడు. భ్రమరాంబ అనుమానంగా శేషు నేను చూసింది అంతా నిజమేనా..? ఇది నాకు అంత షాకింగ్‌గా ఉంది అని అడగ్గానే.. నేను ముందే చెప్పాను కదా భ్రమరం రేఖ ముందులా లేదు.. తనను ఏదో ఆవహించింది. అదేంటో తెలుసుకో లేదంటే ముందు ముందు ఇలాంటివి చాలా చూడాల్సి వస్తుంది అని చెప్తాడు శేషు.

పబ్బులో ఉన్న ఐశ్వర్య, శశికి దగ్గర అవుతుంది. క్లోజ్‌గా మూవ్‌ అవుతుంది. అంతా దూరం నుంచి చూస్తున్న రేణు మాత్రం ఈ శశి గాడు చాలా గ్రేట్‌ అనుకున్న అమ్మాయి అనుకున్నట్టే ట్రాప్‌ చేస్తుంటాడు. నిజంగా వీడు గ్రేట్‌ అనుకుంటుంది. ఇక రాజు, ఇందు ఇంట్లో జరిగిన లక్కీ, మదన్‌ల గొడవ గురించి మాట్లాడుకుంటారు. ఇక తాము డోస్‌ పెంచాలని రేఖ నోటి నుంచే నిజం చెప్పే వరకు ఏదో ఒకటి చేయాలని చెప్తాడు. అయితే మనం ఇలా ఆలోచిస్తున్నామంటే.. రేఖ ఆంటీ ఇంకా ఎంత ఆలోచిస్తుందో మనం జాగ్రత్తగా ఉండాలి అని చెప్తుంది నందు.

మరోవైపు బాధపడుతున్న మదన్‌ దగ్గరకు వెళ్లి రేఖ ఓదారుస్తుంటే.. అసలు ఆ లక్కీ గాడు ఎవడు..? వాణ్ని నా రూంలో ఎందుకు పెట్టావు అంటూ ప్రశ్నిస్తాడు. చిన్నప్పటి నుంచి ఒక్కసారి కూడా నా మీద చేయి చేసుకోని నువ్వు అందరి ముందు నన్ను కొట్టావు నాకు ఎంత అవమానంగా ఉందో తెలుసా మమ్మీ అంటూ ఎమోషనల్‌ అవుతుంటాడు. ఇంతలో ఈరోజు బ్రహ్మముడి సీరియల్‌ ఎపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: మిథున రాశిలోకి శుక్రుడు – ఆ ఐదు రాశులకు గజలక్ష్మీ యోగం – అపర కుబేరులు అవ్వడం ఖాయం

 

Related News

Illu Illaalu Pillalu Srivalli : హమ్మయ్య.. సీరియల్ లవర్స్ కు గుడ్ న్యూస్.. ఇదేం ట్విస్ట్ రా అయ్యా..

అనసూయ ఓపెన్ ఛాలెంజ్.. మరో వీడియోతో హల్చల్!

ఈ వారం సీరియల్ లవర్స్ కు బ్యాడ్ న్యూస్.. ఇది అస్సలు ఊహించలేదు మావా…

Friday OTT Releases : శుక్రవారం ఓటీటీలోకి బోలెడు సినిమాలు.. డోంట్ మిస్..

Illu Illalu Pillalu Today Episodes: నర్మద అనుమానమే నిజమే.. సుక్కు ప్లాన్ సక్సెస్.. వల్లికి మరో టెన్షన్..

Gundeninda GudiGantalu Today episode: బారుకు వెళ్లిన రోహిణి.. మనోజ్ దెబ్బకు షాక్.. మీనాకు నిజం తెలుస్తుందా..?

Podarillu Today Episode : నారాయణ సీన్లోకి ఎంట్రీ.. మాధవ్ పై తాయారు సీరియస్.. ఎంగేజ్మెంట్ క్యాన్సిల్..?

Intinti Ramayanam Today Episode: రాజేంద్రప్రసాద్ కు పిండం.. కన్నీళ్లు పెట్టుకున్న భానుమతి.. పల్లవి ప్లాన్ రివర్స్..

Big Stories

Advertisement
×