E-Paper
Advertisement

మధ్యాహ్నం కాగానే కళ్లు మూతలు పడుతున్నాయా? శరీరం ఇచ్చే డేంజర్ సిగ్నల్ ఇది!

మధ్యాహ్నం కాగానే కళ్లు మూతలు పడుతున్నాయా? శరీరం ఇచ్చే డేంజర్ సిగ్నల్ ఇది!
Advertisement

Vitamin D Deficiency: రోజంతా హుషారుగా ఉందామనుకున్నా.. మధ్యాహ్నం ఒంటిగంట దాటాక కళ్లు మూతలు పడిపోతున్నాయా? రాత్రిపూట ఎనిమిది గంటలు హాయిగా నిద్రపోయినా కూడా.. మధ్యాహ్నం అయ్యేసరికి ఒంట్లో సత్తువ అంతా అయిపోయినట్లు అనిపిస్తుందా? ఈ రోజుల్లో చాలామంది అనుభవిస్తున్న ప్రధాన సమస్య ఇది. కేవలం పని ఒత్తిడి లేదా మానసిక అలసట వల్ల మాత్రమే ఇలా జరుగుతుందని మనం అనుకుంటాం. కానీ దీని వెనుక విటమిన్ డి లోపం ఉందేమో ఒక్కసారి ఆలోచించాలి.

విటమిన్ డి ప్రాముఖ్యత..

విటమిన్ డి అనగానే మనకు ఎముకల ఆరోగ్యమే గుర్తుకు వస్తుంది. కానీ మన శరీరానికి తగినంత శక్తిని ఇవ్వడంలో కూడా ఇది కీలక పాత్ర పోషిస్తుంది. మన శరీర కణాలలో శక్తిని తయారు చేసే ప్రక్రియ సరిగ్గా జరగాలంటే విటమిన్ డి చాలా అవసరం. శరీరంలో దీని స్థాయిలు తగ్గిపోతే, కణాలు శక్తిని ఉత్పత్తి చేయడంలో విఫలమవుతాయి. దీనివల్ల నిద్ర సరిగ్గా పోయినా సరే, పగటిపూట విపరీతమైన అలసట, నీరసం ఆవహిస్తాయి.

Advertisement

Also Read: ‘నేను బాగానే ఉన్నా’ అన్న ప్రతీసారీ నమ్మకండి.. పిల్లల ఆ ప్రవర్తన వెనుక పెద్ద రహస్యమే ఉంది!

మధ్యాహ్నపు అలసటకు కారణాలు..

సాధారణంగా మధ్యాహ్నం 2 నుండి 4 గంటల మధ్య మన శరీరంలోని హార్మోన్ల మార్పుల వల్ల కాస్త బద్ధకంగా అనిపించడం సహజమే. అయితే విటమిన్ డి లోపం ఉన్నవారిలో ఈ బద్ధకం రెట్టింపై, ఏ పని చేయలేని స్థితికి తీసుకెళ్తుంది. విటమిన్ డి మన మెదడులోని మూడ్, ఉత్సాహాన్ని పెంచే రసాయనాలను సమతుల్యంగా ఉంచుతుంది. ఇది తగ్గినప్పుడు నాడీ వ్యవస్థ మందగించి, మధ్యాహ్నం కాగానే విపరీతంగా నిద్ర వస్తుంది.

సమస్య పెరగడానికి కారణాలు..

Advertisement

మన దగ్గర ఎండ పుష్కలంగా ఉన్నప్పటికీ.. నగరాల్లో ఉండే దాదాపు 70 శాతం మంది విటమిన్ డి లోపంతో బాధపడుతున్నారు. రోజంతా ఏసీ గదుల్లో ఉండటం, వాహనాల కాలుష్యం వల్ల ఎండ ఒంటికి తగలకపోవడం, సూర్యరశ్మికి దూరంగా ఉండే అలవాట్లు దీనికి ముఖ్య కారణాలు. దీనికి తోడు మధ్యాహ్న భోజనంలో కార్బోహైడ్రేట్లు ఎక్కువగా తీసుకోవడం, తగినంత నీరు తాగకపోవడం, గంటల తరబడి ఒకేచోట కూర్చోవడం కూడా ఈ సమస్యను మరింత తీవ్రతరం చేస్తాయి.

సమస్యకు పరిష్కారాలు..

ఈ అలసట నుంచి బయటపడటానికి కేవలం ఎక్కువ సమయం నిద్రపోతే సరిపోదు. అనుమానం ఉంటే ముందుగా రక్త పరీక్ష చేయించుకుని, డాక్టర్ సలహాతో విటమిన్ డి సప్లిమెంట్లు వాడాలి. రోజుకు కనీసం 15 నుంచి 20 నిమిషాలు ఉదయపు ఎండలో గడపడం అలవాటు చేసుకోవాలి. భోజనం చేసిన వెంటనే కూర్చోకుండా కాసేపు తేలికగా నడవాలి. ప్రోటీన్లు ఉన్న ఆహారం తీసుకోవడం, తగినంత నీరు తాగడం వల్ల మధ్యాహ్నపు అలసటను జయించి రోజంతా ఉత్సాహంగా ఉండవచ్చు.

Also Read: హెల్దీ రిలేషన్‌షిప్ అంటే ఇదే.. మీ ప్రేమ, పెళ్లి బంధంలో ఈ 7 లక్షణాలు ఉన్నాయా?

Tags

Related News

చాణక్య నీతి.. ఒక వ్యక్తి నిజస్వరూపం తెలుసుకోవాలంటే ఈ 5 లక్షణాలు గమనించండి

నవరాత్రుల్లో ప్రతి రోజు డిఫరెంట్‌గా కనిపించాలా? రెండవరోజు స్టైలిష్ ట్రెడిషనల్ లుక్ కోసం టిప్స్

రిలేషన్‌లో ప్రేమ, నమ్మకం పెరగాలంటే మీ భాగస్వామిని రోజూ ఈ 5 ప్రశ్నలు అడగండి

వ్యసనంగా మారుతున్న ఏఐ.. జెన్ Zలో తగ్గిపోతున్న ఆలోచించే శక్తి

భర్తకు లక్షల్లో పెరిగిన ఆదాయం.. రెట్టింపు భరణం కావాలన్న భార్య.. కోర్టు ఏం చెప్పిందంటే

పిల్లల కోసం ఇంట్లో ఆయాని నియమిస్తున్నారా? ముందుగా ఈ 5 ప్రశ్నలు తప్పకుండా అడగండి

నవరాత్రి ఉపవాసం చేస్తున్నారా? ఆహారంలో ఈ 4 మసాలా దినుసులు తినకూడదు

Big Stories

Advertisement
×