E-Paper
Advertisement

Gundeninda GudiGantalu Today episode: రవి, శృతి ఫుల్ హ్యాపీ.. మీనా పై ప్రశంసలు.. ఇట్స్ ఫ్యామిలీ పార్టీ..

Gundeninda GudiGantalu Today episode: రవి, శృతి ఫుల్ హ్యాపీ.. మీనా పై ప్రశంసలు.. ఇట్స్ ఫ్యామిలీ పార్టీ..
Advertisement

Gundeninda GudiGantalu Today episode june 13th: శృతికి రవి రెస్టారెంట్లో ఏం చేశాడన్న విషయాన్ని  బాలు కళ్లకు కట్టినట్లు చూపిస్తాడు. దాంతో విడాకులు తీసుకోవాలన్న ఆలోచనను మానుకుంటుంది శృతి.. శృతి ఫంక్షన్ కు రావడం చూసినా రవి ఎక్కడికి వెళ్లావు అని కంగారు పడిపోతూ మాట్లాడుతాడు. మీరిద్దరూ కనిపించకపోవడంతో అందరికీ అనుమానం వచ్చింది.. అని రోహిణి వాళ్ళు కూడా అంటారు. ఇక శృతి ఫంక్షన్ లోకి రావడంతో అందరూ చాలా సంతోషంగా ఉంటారు.. బాలు మీనాలకు రవి థాంక్స్ చెప్తాడు. మీరే గనక లేకపోతే ఈరోజు నా పరువు పోయేది. అసలు శృతి నాకు దూరమయ్యేది అని రవి అంటాడు.. శృతి వచ్చింది కదా ఇక నువ్వు వెళ్లి నైటీలు వేసుకోరా అని బాలు అంటాడు. ఆ మాట వినగానే రవి షాక్ అవుతాడు..

మనోజ్ ను దారుణంగా తిట్టిన బాలు..

శృతి రవి మీద కోపంతో అలిగి వెళ్లిపోయిన తర్వాత మళ్లీ రావడంతో రవి చాలా సంతోషంగా ఉంటాడు.. అయితే మనోజ్ ఏంట్రా ఇంతసేపు వెయిట్ చేయించావు రెండు గంటలు వెయిట్ చేశాను తెలుసా..? నేను అసలే అతి పెద్ద బిజినెస్ మాన్ ని అయినా కూడా నీకోసం వెయిట్ చేస్తాను అని అనగానే బాలు బొక్కలో బిజినెస్ మాన్ ఎం కాదు అని కౌంటర్లు వేస్తాడు.. నువ్వు అంత బిజినెస్ మాన్ అయితే వెళ్లి బిజినెస్ చేసుకో పో అని దారుణంగా తిట్టేస్తాడు బాలు.. రోహిణి మేం ఇంతగా వెయిట్ చేస్తే నువ్వు ఇలా చేస్తావా అని తిడుతుంది..

శృతిని తీసుకొని వెళ్తుంది ప్రభా..

Advertisement

అమ్మ శృతి నువ్వు ఎక్కడికెళ్లావ్ అమ్మ ఇంతసేపు నీకోసం ఎంతగా వెయిట్ చేసామో తెలుసా అని ప్రభావతి అంటుంది. అయితే బయటికి వెళ్దాం రా పద అని ప్రభావతి శృతిని తీసుకొని బయటికి వస్తుంది.. ప్రభావతి శృతిని అలా బయటకు తీసుకుని వెళ్లడంతో బాలు అమ్మవతికి ఆనందం వచ్చిన తట్టుకోలేము. బాధ వచ్చినా తట్టుకోలేము. ఇప్పటివరకు ఈ నాట్యమతి డాన్స్ వేసి స్టేజ్ విర్గ్గొట్టేసిందని బాలు కౌంటర్ మీద కౌంటర్ వేస్తాడు.. కానీ రవి మాత్రం బాలుని నువ్వు లేకపోతే ఈరోజు నా జీవితం ఏమైపోయావ్ అన్నయ్య చాలా థాంక్స్ అని అంటారు. అయితే మీనా వదిన మీకు ఎలా థాంక్స్ చెప్పాలో నాకు అర్థం కావడం లేదు అని రవి అంటాడు.

రవి, శృతిలు కేక్ కట్టింగ్..

శృతి రెడీ అయింది కదా ఇక నువ్వు రెడీ అయ్యి రా అని బాలు మీనా రవితో చెప్తారు.. అయితే రవి వెళ్లి రెడీ అవ్వగానే అందరూ కూడా కేక్ కటింగ్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. కేక్ కటింగ్ చేసిన తర్వాత ప్రభావతి శోభ ఇద్దరూ కూడా ఫీల్ అయిపోతూ ఉంటారు. ఎందుకంటే రవి శృతి ఇద్దరూ కూడా మీనా బాలులకు కేక్ తినిపిస్తారు.. మేము ఈరోజు ఇంత సంతోషంగా ఉన్నాము అంటే కారణం మా అన్నయ్య బాలు మా వదిన మీనా.. మీనా వదిన లేకున్నా అంటే మేము అసలు పెళ్లి చేసుకునే వాళ్ళమే కాదు అని చాలా గొప్పగా మాట్లాడుతారు రవి శృతి. అది విన్న బాలు చూసావా నువ్వే వాళ్ళ పెళ్లి దగ్గరుండి చేసావట అంటూ మీనాని ఆటపట్టిస్తాడు.. కానీ శోభ ప్రభావతి ఇద్దరు కూడా ముందుగా తమకి కేక్ పెట్టలేదని కాస్త ఫీలవుతారు.

అయ్యో.. మనోజ్..

Advertisement

ఇక మనోజ్ అరె మీరు మీరే పెట్టుకుంటారా కేకు మాకు పెట్టరా అని అడుగుతాడు. ఈ కేక్ కోసం నేను రెండు గంటలు వెయిట్ చేశాను నా బిజినెస్ ఎంత లాస్ అయి ఉంటుందో తెలుసా అని గొప్పలు చెప్పుకుంటూ ఉంటాడు మనోజ్.. అయితే బాలు కేక్ మొత్తం మనోజ్ కి ఇచ్చి ఈ మొత్తం కేక్ తీసుకుని వెళ్లి తినరా అనేసి అంటాడు. కానీ సత్యం మాత్రం కేక్ అక్కడ పెట్టరా అని అంటాడు. ఇక మనోజ్ ప్రతిసారి ఏదో ఒక విధంగా అంటూ ఉండడంతో బాలు మనోజ్ పై కౌంటర్ల వర్షం కురిపిస్తాడు. కనీసం నీ పెళ్లి రోజున కేకు కట్ చేసావా అన్నట్లుగా వెటకారంగా మాట్లాడుతాడు.. నువ్వు చేయలేనివన్నీ ఈ లేచిపోయినోడు చేస్తున్నాడు రా ఇప్పటికైనా నువ్వు బుద్ధి తెచ్చుకో అని మనోజ్ ని అంటాడు. పక్కనే ఉన్న రోహిణి ఎక్కడికి వచ్చిన నువ్వు ఏదో ఒకటి అంటూనే ఉంటావా బాలు ఈ ఫంక్షన్ అయిపోయేంతవరకు కాస్త సైలెంట్ గా ఉండొచ్చు కదా అని అంటుంది.

శృతికి రవి సర్ప్రైజ్..

నేను లేట్ రావడానికి కారణం నా డిజైనర్ డ్రెస్ ని సరిగా కుట్టకపోవడం అని శృతి కావాలని అబద్ధం చెప్తుంది. అదేవిధంగా రవి కూడా శృతి కీర్తన మీద ఉన్న నమ్మకం గురించి గొప్పగా చెప్పుకుంటాడు. అటు శృతి కూడా రవికి నేనంటే చాలా ఇష్టం నాకోసం ఏదైనా చేస్తాడు నాకు కోపం వస్తే తానే దగ్గరుండి తగ్గిస్తాడు. నేను చిన్నపిల్లలాగా మారం చేస్తే నా కోరిక తీరుస్తాడు అని శృతి రవి గురించి గొప్పగా చెప్తుంది.. మా మధ్య ఎంత గొడవలు వచ్చినా సరే రవిని దగ్గరుండి వాటిని దూరం చేసేలా చేస్తాడు. నాకు వచ్చిన కోపానికి రవి ఎప్పుడు బలవుతూనే ఉంటాడు పాపం రవి అని శృతి రవి ఇద్దరు ఒకరి మీద ఒకరు పొగడ్తల వర్షం కురిపించుకుంటారు.. ఇక వీరిద్దరూ అన్యోన్యమైన జంట అని అందరూ పొగిడేస్తూ ఉంటారు. శృతికి సర్ప్రైజ్ ఇవ్వాలని తనకి ఇష్టమైన  సింగర్ని తీసుకుని వస్తాడు రవి. మొత్తానికి శృతి కోసం రవి ఏదైనా చేస్తాడు అని మరోసారి నిరూపించాడు.. అటు శృతి కూడా నా భర్త నాకోసం ఏదైనా చేస్తాడు అని చాలా సంతోషంగా ఉంటుంది.. ఇది ఫ్యామిలీ పార్టీగా ఎపిసోడ్కి హైలైట్ గా నిలుస్తుంది. మొత్తానికి శృతి రవిలా పెళ్లి రోజు వేడుక మాత్రం గ్రాండ్గా జరుగుతుంది.. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. సోమవారం ఎపిసోడ్లో శృతికి డైమండ్ నెక్లెస్ ని గిఫ్ట్ గా ఇవ్వబోతాడు రవి.. మధ్యలో ప్రభావతి అడ్డుపడుతుందా? రోహిణి మనోజ్ ఇద్దరూ గొడవ పడతారా? మీనా బాలులో నెక్స్ట్ ప్లాన్ ఏంటో చూడాలి…

Also Read :Illu Illalu Pillalu Today Episodes: శ్రీవల్లికి టెన్షన్.. నర్మద కు భాగ్యం పై అనుమానం.. భద్రకు ఘోర అవమానం..

Related News

పవన్‌తో రీతూ పెళ్లి.. మొత్తానికి బయటపెట్టేశారు, ట్విస్ట్ ఏమిటంటే?

అవినాష్ దెబ్బకు నవ్యస్వామి షాక్!

ఎక్స్ లవర్ తో అడ్డంగా బుక్ అయిన రోహిణి.. !

సర్వస్వం అన్నాడు..8 ఏళ్లు వాడుకొని వదిలేసాడు- జబర్దస్త్ బ్యూటీ

Gundeninda GudiGantalu Today episode: మాణిక్యం పై ప్రశంసలు.. అడ్డంగా బుక్కయిన రోహిణి… బాలు ట్విస్ట్ అదుర్స్..

Podarillu Today Episode : కేశవ మాట విన్న శైలు.. చక్రీ మాటపై ఫైర్ .. శైలు ఎంట్రీతో వరాలు షాక్..

Illu Illalu Pillalu Today Episodes: కన్నీళ్లు పెట్టుకున్న రామారాజు.. అయ్యో పాపం వేదవతి.. ధీరజ్, ప్రేమ కలిస్తారా..?

Brahmamudi Serial Today Episode July 31st ‘బ్రహ్మముడి’ సీరియల్‌: రేఖకు వార్నింగ్ ఇచ్చిన ఐశ్వర్య

Big Stories

Advertisement
×