Gundeninda GudiGantalu Today episode May 17th: నిన్నటి ఎపిసోడ్ లో.. మనోజ్ జాబ్ మానేయడం పై రోహిణి దారుణంగా మాట్లాడుతుంది. అసలు నువ్వు ఎందుకు జాబ్ మానేస్తున్నావ్ నీకు జాబ్ చేయడం ఇష్టం లేదా.. రెండు వారాలు కూడా కాలేదు అప్పుడే జాబ్ మానేశావ్ ఏ రోజైనా ఒక నెల జాబ్ చేసి చేతిలో నెల జీతం పెట్టావా? అని మనోజ్ ని దారుణంగా అవమానిస్తుంది రోహిణి. అదేంటి రోహిణి నేను జాబ్ చేస్తేనే నువ్వు నాతో ఉంటావా ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు అని అంటే.. లేకుంటే ఏంటి మనోజ్ ఈ విషయం కనుక మీ తమ్ముడికి కానీ ఇంట్లో వాళ్లకు గాని తెలిస్తే ఎంత దారుణంగా మాట్లాడతారో నువ్వు ఆలోచించవా అని రోహిణి అంటుంది.. ఓనర్ అన్నాడు అందుకే జాబ్ మానేశాను అని అంటాడు. రోహిణి మాత్రం ఏది అర్థం చేసుకోకుండా మనోజ్ ని తిట్టి వెళ్ళిపోతుంది. ఇక శివను మరోసారి బాలు కొట్టి వెళ్ళిపోతాడు. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది..
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. మీనా వాళ్ళ నాన్న సంవత్సరికం కోసం బాలును పిలుస్తారు. తీసుకోవాలనుకున్న కావాలనుకున్న బాలు వస్తాడు కానీ అప్పటికే పార్వతి తన అల్లుడు తన కొడుకు చేయని విరగొట్టాడని అందరికీ చెప్తూ ఉంటుంది అది విన్న బాలు రెచ్చిపోతాడు. మరోసారి శివ పై దాడి చేస్తాడు. మీనా బాలుని కంట్రోల్ చేసి అక్కడి నుంచి పంపిస్తుంది. ఇక మీనా ఇంటికి వెళ్ళిపోతుంది. అక్కడ బాలు చేసిన నిర్వాహకం గురించి అందరికీ చెప్తుంది. నా పుట్టింటి వాళ్ల మీద ఎందుకు ఇంత పగ పెంచుకున్నారు అంటూ కన్నీళ్లు పెట్టుకుంటుంది.
సత్యం ఎంత చెప్పినా కూడా బాలు వినకపోవడంతో సత్యం సీరియస్ అవుతాడు. తనను ఇంటికి పిలిచి మరీ అవమానిస్తున్నారని బాలు మండిపడుతాడు. శివ చేసిన తప్పును చెప్పలేక పోవడమే తన తప్పుగా అవుతుందని, దాంతో మీనాతో కూడా దూరం పెరుగుతూ వస్తోందని, రోజురోజుకు మీనా తనను నిందితుడిలాగా చూస్తోందని బాధపడుతూ ఉంటాడు. ఇక బాలు మీనాను పుట్టింటిలోనే వదిలేసి తిరిగి ఇంటికి వస్తాడు. ఇంటికి వచ్చే సరికి సత్యం కంగారు పడుతూ ఉంటాడు. అసలే అందరిపై ఈ మధ్య చిర్రు బుర్రులాడుతున్న బాలు అక్కడికి వెళ్లి ఎలాంటి గొడవ చేశాడోనని కంగారులో ఉంటాడు. అదే సమయంలో బాలు ఇంటికి తిరిగి వస్తాడు. అంతకంటే ముందే మీనా ఇంటికి వచ్చి ఉంటుంది.
అక్కడ ఏం జరిగిందన్న విషయం సత్యంతో చెప్తుంది.. బాలు వచ్చే సరికి అక్కడ ఏం చేశావని ప్రశ్నిస్తాడు. అందుకు బాలు నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన పని ఏముంది మీ కోడలు మీనా చెప్పే ఉంటుంది కదా అని అంటాడు. ఇలా తిక్క తిక్కగా సమాధానం ఇస్తూన్నావేంటని సత్యం కొడుకు బాలుపై మండి పడుతాడు. ఇక బాలు ఎక్కువగా మాట్లాడటం ఇష్టం లేక తన గదిలోకి వెళ్లిపోతాడు. బాలు ఏదో కారణం లేకుండా అస్సలు కొట్టడని, ఏదో పెద్ద కారణం ఉన్నందుకే బాలు నీ కుటుంబం మొత్తంపై మండి పడుతున్నాడని ప్రభావతి కూడా మీనాపై కస్సుబుస్సులాడుతుంది. దాంతో సత్యం ప్రభావతిని నోరుమూసుకోమని, సంధు దొరికితే దూరిపోతావని మండిపడుతాడు. ఇక మీనా కూడా ధీటుగానే బదులిస్తుంది. అంత పెద్ద తప్పు ఏమీ చేయలేదని, ఊరికే మా ఇంటి వాళ్లపై ఆడిపోసుకోవడం మానేయండి అంటూ మీనా గట్టిగా సమాధానం చెబుతుంది. బాలు మరోసారి మీ నాన్నను ఏడిపించడంతో సత్యం గట్టిగా వార్నింగ్ ఇస్తాడు అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది. ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..