Serial Heroines: సీరియల్స్ దేముంది గురు ఒకసారి సినిమాలు చేసి చూడు సాలిడ్ రెమ్యూనరేషన్ ని వెనకేయోచ్చు.ఇది కొంతకాలం క్రితం వినిపించిన మాట.కానీ సీన్ మారింది ఇప్పుడు సినిమాలకు దీటుగా సీరియల్స్ లో పారితోషికాన్ని అందుకుంటున్నారు బుల్లితెర స్టార్స్.ఒక్క సీరియల్ సక్సెస్ అయితే చాలు క్రేజ్ అమాంతం పెరిగిపోతుంది.ఇక దానికి తగ్గట్టుగానే రెమ్యూనరేషన్ కూడా.
దీపికా రంగరాజు
మరి ఇంతకీ ప్రస్తుతం తెలుగు టీవీ ఇండస్ట్రీలో అత్యధిక పారితోషికం అందుకుంటున్న తెలుగు సీరియల్ హీరోయిన్స్ ఎవరో ఒకసారి చూసేద్దాం.ఈ లిస్టులో ముందుగా చెప్పుకోవాల్సింది దీపికారంగరాజు.తమిళ నాట న్యూస్ యాంకర్ గా కెరీర్ మొదలెట్టిన ఈవిడ అక్కడ కొన్ని సీరియల్స్ చేసి ఆ తర్వాత తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది.ముఖ్యంగా స్టార్ మా లో టెలికాస్ట్ అవుతున్న బ్రహ్మముడి సీరియల్ లోని కావ్య పాత్రతో ఆడియన్స్ లో మంచి క్రేజ్ కొట్టేసింది.
ఇక ఆ క్రేజ్ వల్లే ఆమె అత్యదికంగా ఒక్క ఎపిసోడ్ కి 50 నుండి 55 వేల పారితోషికం అందుకుంటుందన్న టాక్ వినిపిస్తుంది.మరి సర్క్యులేట్ అవుతున్న ఈ వార్తలపై దీపిక నోరు విప్పితే కాని అసలు విషయం ఆడియన్స్ కి తెలిసేలా లేదు.
వంటలక్క
ఇక ఈమె తర్వాత ఎక్కువగా పాతోషకం తీసుకుంటున్న టీవీ సీరియల్ హీరోయిన్ గా వంటలక్కకి పేరు ఉంది.వంటలక్క అంటే ఎవరో కాదు ప్రేమి విశ్వనాథ్.మలయాళం లో కర్మముత్తు సీరియల్ తో టీవీ బుల్లితెరపైకి ఎంట్రీ ఇచ్చిన ప్రేమీ తెలుగులో కార్తీక దీపం ద్వారా తెలుగు ఆడియన్స్ కి బాగా దగ్గరయింది.ఆ తర్వాత కల్యాణ వైభోగం లో కూడా కనిపించి మంచి పేరు తెచ్చుకుంది .ఇక ఈమెకు ఉన్న క్రేజ్ కారణంగా ఒక్కో ఎపిసోడ్ కి దాదాపు 30 నుంచి 35వేల పారితోషకం అందుకుంటున్నట్టు తెలుస్తుంది.అయితే తన రెమ్యూనరేషన్ పై వచ్చే వార్తలన్నీ రూమర్స్ అని గతంలోనే క్లారిటీ ఇచ్చింది ఈ వంటలక్క.
నవ్య స్వామి
ఇక ఆతర్వాత అత్యధిక పారితోషికం తీసుకుంటున్న సీరియల్ నటిగా కనిపిస్తుంది నవ్య స్వామి.బుల్లితెరపై సాలిడ్ ఫ్యాన్ బేస్ ని సొంతం చేసుకున్న ఈ సీరియల్ హీరోయిన్ నా పేరు మీనాక్షి,ఆమె కథ, ఇంటిగుట్టు వంటి సీరియల్స్ తో మంచి గుర్తింపు సంపాదించింది .ఇక ప్రస్తుతం ఈమె ఒక్క ఎపిసోడ్ కు దాదాపు 25వేల నుంచి 30 వేల మధ్యలో తీసుకుంటున్నట్టు ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తుంది.
ప్రియాంక జైన్
ఇక ఈమె తర్వాత ఎక్కువ పారితోషికం తీసుకునే నటిగా పేరు సంపాదించుకుంది ప్రియాంక జైన్.మౌనరాగం, జానకి కలగనలేదు సీరియల్స్ తో తెలుగు ఆడియన్స్ దగ్గరైన ప్రియాంక ఆ తర్వాత రియాల్టీ షో లతో కూడా మంచి గుర్తింపు దక్కించుకుంది .ఇక ఈమె ఒక్క ఎపిసోడ్ కి 20 నుంచి 25 వేల పారితోషికం పుచ్చుకుంటుందని టీవీ ఇండస్ట్రీలో వినిపిస్తున్న టాక్.
శోభా శెట్టి
ఇక వీళ్ల తర్వాత ఈ లిస్టులో ఉన్న సీరియల్ హీరోయిన్ శోభా శెట్టి .శోభా శెట్టి అనగానే మనకు గుర్తొచ్చేది కార్తిక దీపం లోని మౌనిత పాత్రే.నెగిటివ్ క్యారెక్టర్ లో ఆమె పండించిన నటన బుల్లితెర ఆడియన్స్ కి బాగా ఎక్కేసింది .ఇక అష్టా చమ్మా వంటి సీరియల్స్ కూడా శోభాకి మంచి పేరు తెచ్చినవే.ఇక ఈ క్రేజ్ తోనే ప్రస్తుతం రోజుకు 20 నుంచి 25 వేల పారితోషకం తీసుకుంటున్నట్టు సమాచారం .
సుజిత
మరోవైపు సీనియర్ సీరియల్ హీరోయిన్ సుజిత కూడా ఎంతో కాలంగా తెలుగు ఆడియన్స్ ని అలరిస్తున్నదే.చిన్నప్పటి పాడుతా తీయగా నుంచి అత్తారింటికి దారేది, గుప్పెడంత మనసు, మమత సీరియల్ దాకా ఈమెని గుర్తుపట్టని తెలుగువారు ఉండరంటే ఆశ్చర్యం లేదు .ఈమె కూడా తన అనుభవానికి తగ్గట్టుగానే దాదాపు 20 నుంచి 25 వేల మధ్యలో రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్టు టీవీ వర్గాల్లో వినిపిస్తుంది.
also read :‘ఫౌజీ’లో ప్రభాస్ మదర్ ఎవరో తెలుసా?.. ఈ పేరు వింటే షాక్ అవుతారు!
అయితే వీళ్ళ సంపాదన కేవలం సీరియల్స్ మాత్రమే పరిమితం కాదండోయ్ .సోషల్ మీడియా ప్రమోషన్స్, టీవీ ఈవెంట్స్ ,స్పెషల్ ఈవెంట్స్, రియాల్టీ షోలు వంటివి వీటికి బోనస్.అందుకే బులితెర హీరోయిన్ల క్రేజ్ సినిమా హీరోయిన్లకు ఏమాత్రం తీసిపోవడం లేదన్నది అభిమానుల్లో వినిపిస్తున్న మాట !