Saudi Arabia Ban: హజ్ యాత్రను దృష్టిలో పెట్టుకుని సౌదీ ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. ఆ దేశ భద్రతను దృష్టిలో పెట్టుకుని కీలక నిర్ణయం తీసుకుంది. భారత్, పాకిస్తాన్, బంగ్లాదేశ్ సహా 14 దేశాలపై వీసా బ్యాన్ విధించింది. ఈ ఏడాది హజ్ యాత్ర ముగిసేవరకు ఆదేశాలు అమల్లో ఉన్నట్లు వెల్లడించింది. వీసా సస్పెన్షన్‌లో ఉమ్రా వీసాలతోపాటు బిజినెస్, ఫ్యామిలీ సందర్శన వీసాలు సైతం ఉన్నాయి.
ముస్లింలు జీవితంలో ఒక్కసారైన హజ్ యాత్ర చేయాలని భావిస్తున్నారు. ఇస్లాం మత విశ్వాసం కూడా. ఇస్లాం సంప్రదాయం ప్రకారం ప్రతి ముస్లిం నిర్వర్తించాల్సిన అయిదు బాధ్యతల్లో హజ్ యాత్ర కూడా ఒకటి. మిగతా నాలుగు కల్మ, రోజా, నమాజ్, జకాత్ అనేవి ఉన్నాయి. ప్రతి ఏడాది ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ముస్లింలు హజ్ యాత్ర కోసం మక్కాకు వెళ్తారు. ఐదురోజులపాటు ఈ యాత్ర సాగనుంది. చివరకు బక్రీదు రోజున ముగియనుంది.
భారత్- సౌదీ అరేబియా ప్రభుత్వాల మధ్య హజ్ యాత్ర గురించి ఒప్పందం జరిగింది. గతేడాది భారత్ నుంచి 1,75,025 మంది యాత్రికులు వెళ్లారు. భారత హజ్ కమిటీ ద్వారా 1,40,020 మందికి సీట్లు రిజర్వ్ చేశారు. హజ్ గ్రూప్ ఆపరేటర్ల ద్వారా వెళ్లేందుకు మిగిలిన 35 వేల మంది యాత్రికులను అనుమతిస్తారు. ఈసారి ఆ సంఖ్య మరింత పెరగనుంది. తొలిసారి హజ్ యాత్ర చేస్తున్న యాత్రికులకు ఇది ఎంతో ఉపయోగపడుతుంది.
అసలు కారణం ఇదే
తాజాగా హజ్ యాత్రలో భద్రతా సమస్యల్ని దృష్టిలో పెట్టుకున్న సౌదీ అరేబియా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మొత్తం 14 దేశాలపై వీసా బ్యాన్ విధించింది. ఈ ఏడాది హజ్ యాత్ర ముగిసేవరకు అంటే జూన్ వరకు ఈ నిషేధం అమల్లో ఉంటుంది. వీసా సస్పెన్షన్‌లో ఉమ్రా వీసాలతో పాటు బిజినెస్, ఫ్యామిలీ సందర్శన వీసాలు సైతం ఉన్నాయి.
ALSO READ: పెంట్ హౌస్ రూ.940 కోట్లా? అంత స్పెషల్ ఏంటో!
సరైన రిజస్ట్రేషన్ లేకుండా యాత్రకు వచ్చే వారిని నియంత్రించేందుకు సౌదీ ప్రభుత్వం ఆయా దేశాలకు వీసాను నిషేధించింది. సౌదీ అధికారులు చెబుతున్న వివరాల మేరకు.. అధికారిక అనుమతులు లేకుండా చాలామంది విదేశీయులు ఉమ్రా, విజిట్ వీసాలపై ప్రవేశిస్తారని అంటున్నారు. అనధికారికంగా హజ్ యాత్రలో పాల్గొని వెళ్లిపోతున్నారు.
ఎలాంటి ఆటంకాలు లేకుండా యాత్రను సజావుగా సాగేందుకు వీసా నిబంధనలను తీసుకువచ్చినట్లు చెబుతున్నారు. యాత్రకు సంబంధించి కఠినమైన నిబంధనలు అమలు చేయాలని సౌదీ అరేబియా యువరాజు బిన్ సల్మాన్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో ఏప్రిల్ 13 వరకు ఉమ్రా వీసాలకు దరఖాస్తు చేసుకునే అవకాశం లేదు. హజ్ యాత్ర ముగిసేవరకు కొత్త ఉమ్రా వీసాలు జారీ చేయలేదని తెలిపింది.
ఆయా దేశాలపై వీసా బ్యాన్
సౌదీ అరేబియా వీసా నిషేధించిన జాబితాలో మొత్తం 14 దేశాలు ఉన్నాయి. వాటిలో భారత్, పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఈజిప్ట్, ఇండోనేషియా, ఇరాక్, నైజీరియా, జోర్డాన్, అల్జీరియా, సూడాన్, ఇథియోపియా, ట్యునీషియా, యెమెన్ ఉన్నాయి.
గతేడాది జరిగిన ఘటనల తర్వాత హజ్ యాత్రను మరింత పకడ్బందీగా నిర్వహించేందుకు సౌదీ అరేబియా అధికారులు సిద్ధం అయ్యారు. ఎండవేడిమి తట్టుకోలేక వెయ్యి మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో చాలామంది అనధికారిక యాత్రికులేనని తేలింది.