Jabardast Rajamouli:గత దశాబ్ద కాలానికి పైగా ప్రేక్షకులకు మంచి ఎంటర్టైన్మెంట్ అందిస్తున్న ఏకైక కామెడీ షో జబర్దస్త్ (Jabardast).ఈ జబర్దస్త్ చూసేవారికి రాజమౌళి (Rajamouli) గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు.. తాగుబోతు మాటలతోనే కాదు పాటలతో కూడా అలరిస్తూ తనకంటూ ఒక ప్రత్యేకత చాటుకున్నారు. అలాంటి రాజమౌళి ఇప్పుడు సినిమాలపై ఎక్కువగా దృష్టి పెట్టాడని చెప్పవచ్చు. తాజాగా ఒక ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తనకు సంబంధించిన ఎన్నో విషయాలను ప్రస్తావించారు. అంతేకాదు జబర్దస్త్ లో వచ్చే రెమ్యూనరేషన్ పై కూడా స్పందించి, అందరిని ఆశ్చర్యపరిచారు రాజమౌళి.
తమకు వచ్చే రెమ్యూనరేషన్ పై కీలక కామెంట్స్..
జబర్దస్త్ రాజమౌళి(Jabardast Rajamouli) ఆ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. “చిన్నప్పటి నుంచి నాకు యాక్టింగ్ అంటే ఎంతో ఇష్టం. ముఖ్యంగా తాగుబోతులా నటించడం అనేది నాకు కాలేజీ రోజుల నుంచే ఉంది.. నిజంగానే తాగేసి వచ్చాను అనుకొని నన్ను స్టేజిపై నుంచి దింపేసిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. ముఖ్యంగా నాకు జబర్దస్త్ మంచి పేరు తెచ్చిపెట్టింది. అప్పట్లో నాగబాబు.(nagababu) నా స్కిట్స్ , నేను పాడే పేరడీ సాంగ్స్ ని బాగా ఎంజాయ్ చేసేవారు. అలాగే నేను ఈవెంట్స్ కూడా చేస్తూ ఉంటాను. సినిమాలు కూడా చేస్తున్నాను. స్పెషల్ షోలు కూడా చేస్తున్నాను. అందువల్లే నాకు బాగా డబ్బులు వస్తున్నాయని మా ఊళ్లో అనుకుంటున్నారు. వాస్తవానికి ఇక్కడ ఇచ్చేది చాలా తక్కువ. అయినా సరే ఈ విషయం చెబితే ఎవరూ నమ్మరు. ఇక్కడ ఎప్పుడు షూటింగ్లు ఉంటాయో.. ఎప్పుడు ఉండవో కూడా తెలియదు. షూటింగులు లేకపోయినా సరే ఖర్చులు అనేవి ఆగవు కదా.. ఇవి దూరం నుంచి చూసే వారికి మాత్రం అర్థం కావు. ఎప్పటికీ దూరపు కొండలు నునుపు అన్నట్టు మేము దూరంగా పడే కష్టాలు ఎవరికీ అర్థం కావు” అంటూ జబర్దస్త్ రాజమౌళి తెలిపారు. ఏది ఏమైనా రాజమౌళి చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.
ప్రతిభకు వేదికగా మారిన జబర్దస్త్..
ఇకపోతే ఈ జబర్దస్త్ ఎంతోమంది టాలెంట్ కు వేదిక అయింది అని చెప్పవచ్చు. తమకంటూ ఒక టాలెంట్ ఉంటే జబర్దస్త్ ఎప్పుడు ఎప్పటికీ ఆహ్వానం పలుకుతూనే ఉంటుంది. ఈ క్రమంలోనే తమ టాలెంట్ ను చేతిలో పట్టుకొని ఇండస్ట్రీలోకి వచ్చిన వారికి జబర్దస్త్ ఒక మంచి భవిష్యత్తును కల్పించింది.అలా జబర్దస్త్ లో కామెడీ స్కిట్లు చేస్తూ ప్రేక్షకులను అలరించిన ఎంతోమంది నేడు సినీ ఇండస్ట్రీలో దర్శకులుగా, నిర్మాతలుగా, హీరోలుగా, కమెడియన్లుగా కూడా సెటిలైపోయారు. అంతేకాదు ఇప్పుడు ఇంకా కొంతమంది జబర్దస్త్ లోనే తమ పెర్ఫార్మెన్స్ తో అందరినీ ఆకట్టుకుంటున్నారు. ఇక ఈ జబర్దస్త్ కార్యక్రమం గత దశాబ్ద కాలానికి పైగా నిర్విరామంగా ప్రేక్షకులకు మంచి ఆనందాన్ని పంచుతూ.. మంచి టిఆర్పి రేటింగ్ తో దూసుకుపోతోంది. ఏది ఏమైనా ఎంతోమందికి జీవితాన్ని ప్రసాదించే ఈ జబర్దస్త్ ఎప్పటికీ ఉండాలని ఇందులో చేసే చాలామంది కామెంట్లు చేస్తూ ఉంటారు. ఇకపోతే ఈ జబర్దస్త్ కార్యక్రమాన్ని మల్లెమాల అధినేత శ్యామ్ ప్రసాద్ రెడ్డి నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.