Jabardast: ప్రముఖ బుల్లితెర ఛానల్లో గత దశాబ్ద కాలానికి పైగా ప్రేక్షకులను నవ్విస్తూ మంచి టీఆర్పీ రేటింగ్తో దూసుకుపోతున్న ఏకైక కామెడీ ఎంటర్టైన్మెంట్ షో జబర్దస్త్(Jabardast). ఇప్పటికే ఈ షో ద్వారా ఎంతో మంది తమ టాలెంట్ ను నిరూపించుకొని, సినిమాలలో కూడా అవకాశాలు దక్కించుకుంటున్నారు. అయితే మరికొంతమంది జబర్దస్త్ లో కమెడియన్ గా చేసి.. చాలీచాలని జీతంతో అవస్థలు పడ్డవాళ్ళు కూడా ఉన్నారు. మరికొంతమంది జబర్దస్త్ లోకి వచ్చాక సెటిల్ అయ్యామని చెబుతున్నారు. ఇదిలా ఉండగా జబర్దస్త్ కమెడియన్ ఒకరు.. వచ్చే జీతం సరిపోక, కూతురు పెళ్లి ఎలా చేయాలో తెలియక, చందాలు వేసి మరీ తన కూతురు పెళ్లి జరిపించాను అంటూ ఫ్యామిలీ స్టార్ ఈవెంట్లో తన కష్టాలు చెప్పుకొని మరీ అందరికీ కన్నీళ్లు పెట్టించారు జబర్దస్త్ కమెడియన్ రైజింగ్ రాజు(Raising Raju).
Hero Nani: ‘కోర్టు’లాంటి మరో సినిమా… నాని బిజినెస్ మైండ్ అదుర్స్..!
చందాలు వేసుకుని నా కూతురు పెళ్లి చేసాము – రైజింగ్ రాజు
గత కొన్ని సంవత్సరాలుగా సినిమా ఇండస్ట్రీలో చిన్న చిన్న పాత్రలు చేస్తూ ప్రేక్షకులను అలరించిన రైజింగ్ రాజుకి సినిమాల ద్వారా గుర్తింపు రాలేదు. కానీ అదే సమయంలో జబర్దస్త్ లోకి ఎంట్రీ ఇచ్చి తన కామెడీతో గుర్తింపు సొంతం చేసుకున్నారు. హైపర్ ఆది(Hyper Adi)తో కలిసి టీం లీడర్ గా వందలాది స్కిట్లు చేసిన ఈయన.. అడపాదడపా సినిమాలలో నటిస్తున్నారు. తాజాగా ఒక టీవీ షో కి హాజరైన ఈయన తన కష్టాల గురించి చెబుతూ.. నేను జబర్దస్త్ కి వెళ్ళకముందు నా బిడ్డ పెళ్లి చేయడానికి కూడా డబ్బులు లేవు. దాంతో రాఘవ, రమేష్, ధనరాజు ఇలా కొంతమంది ఒక్కొక్కరు రూ.5000 చొప్పున నాకు డబ్బులు ఇచ్చారు. ఆ డబ్బులతోనే నేను, నా కూతురు పెళ్లి చేశాను అంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు రాజు. మొత్తానికి అయితే చందాలు వేసి మరీ తన కూతురు పెళ్లి జరిపించానని తెలిపారు.
హైపర్ ఆది పై ప్రశంసల కురిపించిన రాజు..
హైపర్ ఆది పై ప్రశంసలు కురిపిస్తూ..”ఆది నాకు ఎంతో సహాయం చేశారు. కరోనా సమయంలో నాకు మనవరాలు పుట్టింది. అయితే నేను బయటకి వెళ్తే పాపకి లేనిపోని ఆరోగ్య సమస్యలు వస్తాయి ఏమో అని భయపడి ఇంట్లోనే ఉండిపోయాను. ఇక ఆర్థికంగా ఇబ్బందులు తలెత్తాయి. అలాంటి సమయంలో నాకు ఎంతో సహాయం చేశారు. నా ఇంటికి ప్రతి నెల పేమెంట్ పంపించేవారు.నిజంగా హైపర్ ఆది నా దృష్టిలో దేవుడు. నేను స్కిట్స్ చేసినా.. చేయకపోయినా పేమెంట్ మాత్రం కరెక్ట్ టైం కి ఇచ్చేవారు” అంటూ ఆది పై ప్రశంసలు కురిపించారు రైజింగ్ రాజు. ఇక రాజు మనవరాలు ప్రస్తుతం పెద్దదైపోయింది. ఇక రాజు కూడా వయసు మీద పడడంతో అవకాశాలు అందుకోలేకపోతున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే ఇంట్లో మనవరాలితో కలిసి రీల్స్ చేస్తూ సమయాన్ని గడుపుతున్నారు. ఇక మొత్తానికైతే రాజు చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ఇంక మరోవైపు రాజు పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) పిఠాపురంలో నిర్వహించిన మీటింగ్ కి హాజరు అవ్వడమే కాకుండా అక్కడ తనదైన శైలిలో సందడి చేసి అందరిని ఆకట్టుకున్నారు.