E-Paper
Advertisement

కమిట్మెంట్ ఆరోపణలపై జబర్దస్త్ వెంకీ రియాక్షన్.. నాపై తప్పుగా చూపిస్తే ఊరుకోను..

కమిట్మెంట్ ఆరోపణలపై జబర్దస్త్ వెంకీ రియాక్షన్.. నాపై తప్పుగా చూపిస్తే ఊరుకోను..
Advertisement

Jabardast Venky Reaction : బుల్లితెరపై ప్రసారమవుతున్న టాప్ కామెడీ షో జబర్దస్త్ ద్వారా పాపులర్ అయిన వెంకీ గురించి అందరికి తెలుసు.. వెంకీ మంకీస్ టీమ్ లీడర్ వెంకీ పై ఇటీవల ఈ కమెడియన్ ఓ వివాదంలో చిక్కుకున్న విషయం అందరికీ తెలుసు.. ఒక అమ్మాయిని అవకాశాలు ఇస్తామని చెప్పి వాడుకొని మోసం చేశాడని ఆయన పై ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే.. ఈ ఆరోపణల పై ఆయన ఇప్పటివరకు ఎక్కడా రియాక్ట్ అవ్వలేదు.. తాజాగా సోషల్ మీడియా ద్వారా ఓ వీడియోను రిలీజ్ చేశారు. ఆ వీడియోలో తనపై వచ్చిన ఆరోపణలపై ఎందుకు ఇంకా స్పందించలేదంటూ చాలామంది తనకు మెసేజ్ చేశారని చెప్పారు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అసలు వెంకీ తనపై వచ్చిన ఆరోపణల గురించి ఏం చెప్పాడో అన్నది ఇప్పుడు మనం తెలుసుకుందాం..

ఓ ఛానెల్ వల్లే నాపై ఆరోపణలు..

జబర్దస్త్ కమెడియన్ వెంకీ ఇటీవల ఓ వివాదంలో చిక్కుకున్న విషయం అందరికీ తెలుసు. ప్రముఖ ఇన్ఫ్లుయెన్సర్ తో ఆయన అసభ్యంగా ప్రవర్తించారు అంటూ ఆ మధ్య వార్తలు వినిపించాయి.. ఆ వార్తలు పై తాజాగా జబర్దస్త్ వెంకీ రియాక్ట్ అయ్యాడు. తన ఇంస్టాగ్రామ్ వేదికగా ఒక వీడియోని రిలీజ్ చేశాడు. ఆ వీడియోలో వెంకీ మాట్లాడుతూ.. ఓ ప్రముఖ టీవీ ఛానల్ వాళ్లు నేను ఓ అమ్మాయిని కమిట్మెంట్ అడిగానని బూతులు మాట్లాడానని నా ఫోటోలు వేసి మరీ లైవ్ డిబేట్స్ పెట్టారు. ఈ వార్తల్లో నిజం ఎంత ఉంది అని నేరుగా అమ్మాయికి ఫోన్ చేసి అసలు ఏమైంది అని కనుక్కున్నాను అమ్మాయితో మాట్లాడిన కాల్ రికార్డు ఇదే అని ఒక ఆడియో రికార్డును కూడా వినిపించాడు. కేవలం ఆ ఛానల్ వాళ్లు కావాలనే ఇలాంటి ఫేక్ న్యూస్ ప్రచారం చేస్తున్నారు. దీనిపై నాకు చాలా కాల్స్ వచ్చినా రియాక్ట్ కాలేదు. నాకు తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళు అందరూ కూడా మెసేజ్ చేసి ఏంటి ఇదంతా అని అడుగుతుంటే నేనేంటో ప్రూవ్ చేసుకోవాలని ఆ ఛానల్ కి డిబేట్ కి వెళ్లాను అని వెంకీ అందులో చెప్పారు. వెంకీ రిలీజ్ చేసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. ఎవరి గురించే నా మాట్లాడేటప్పుడు అన్ని తెలుసుకుని మాట్లాడాలి ఊరికే తప్పుడు ప్రచారం చేయొద్దు అంటూ వెంకీ ఇండైరెక్టుగా వార్నింగ్ ఇచ్చాడు.

ఆధారాలు లేకుండా తప్పుడు ప్రచారం చెయ్యొద్దు..

Advertisement

ఎవరి గురించైనా మాట్లాడేటప్పుడు వాళ్ళ గురించి పూర్తిగా తెలుసుకొని ఆ తర్వాత మాట్లాడడం మంచిది.. ఆధారాలు లేకుండా ఎవరిని తప్పుగా ప్రచారం చేయొద్దు. ఇలాంటి వార్తలు నాకు ఏమి సమస్యలు తీసుకురావు కానీ నేనేంటో నిరూపించుకోవాలని ఈ వీడియోని రిలీజ్ చేశాను అని వెంకీ అన్నారు. నా గురించి తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళు కూడా అందరూ నాకు సపోర్ట్ గా ఉండి నన్ను ముందుకు నడిపించారు మీ అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు అని వెంకీ అన్నారు.. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. వెంకీ తప్పు ఏమీ లేదని తెలుసుకున్న కొందరు నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా కామెంట్లు పెడుతున్నారు.. ఇక వెంకీ విషయానికొస్తే జబర్దస్త్ షో లాంటి ఎన్నో కామెడీ సీ షోలలో నటిస్తూ ప్రేక్షకులను నవ్విస్తున్నాడు.. అలాగే సినిమాలలో కూడా అవకాశాలను అందుకుంటూ వరుసగా సినిమాలను చేస్తూ బిజీగా ఉన్నాడు..

?igsh=ZzVyN2gwYTNwYWdj

Advertisement

Also Read : మూవీ లవర్స్ కు జాతరే.. ఓటీటీల్లోకి 22 సినిమాలు..!

Related News

బిగ్ బాస్ ఆదిరెడ్డికి కౌంటర్ ఇచ్చిన కృష్ణుడు..వ్యూస్ కోసమే అంటూ!

బిగ్ బాస్ రివ్యూయర్ గా మారిన ప్రభాకర్… సృష్టి పై ప్రశంశలు!

ఝాన్సీని ఇరకాటంలో పెట్టేసిన బిగ్ బాస్.. బలయ్యేది ఎవరు?

శ్రీముఖికి కౌంటర్ ఇచ్చిన బిగ్ బాస్ బోలే.. దెబ్బకు రియాక్షన్?

Nirupam Paritala : మంచుకొండల్లో డాక్టర్ బాబు… ఏమున్నాడ్రా బాబు..

బిగ్ బాస్ ఫేమ్ వర్షిణి అరెస్ట్?

Gundeninda GudiGantalu Today episode: ప్రభాకు వంట కష్టాలు.. కామాక్షి మాటతో అనుమానం.. రోహిణికి కన్నీళ్లు..

Podarillu Today Episode : మహా దెబ్బకు షాక్.. గోపిక మాటతో మహా ఫైర్.. శైలు, కేశవ ఫైట్..

Big Stories

Advertisement
×