Mahindra Vision S and BE 7: మహీంద్రా నుంచి సరికొత్త SUVలు మార్కెట్లోకి రావడానికి సిద్ధమవుతున్నాయి. ఆగస్టు 14, 15 తేదీల్లో కంపెనీ విజన్ S, BE 7 పేర్లతో రెండు కొత్త SUVలను ప్రదర్శించనుంది. వీటిలో ఒకటి పెట్రోల్, డీజిల్ వంటి సంప్రదాయ ఇంజిన్ ఆప్షన్లతో వచ్చే అవకాశం ఉండగా, మరోటి పూర్తిగా ఎలక్ట్రిక్ SUVగా మార్కెట్లోకి రానుంది. మహీంద్రా ఇప్పటికే SUV విభాగంలో మంచి గుర్తింపు తెచ్చుకుంది. స్కార్పియో, XUV700, థార్ లాంటి మోడళ్లకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. ఇప్పుడు కొత్త మోడళ్లతో మరింత మంది కస్టమర్లను ఆకట్టుకునేందుకు కంపెనీ సిద్ధమవుతోంది.
మహీంద్రా విజన్ S ఆధారంగా రూపొందిస్తున్న కొత్త SUVపై ఇప్పటికే ఆసక్తి పెరిగింది. ఈ SUV స్కార్పియో కుటుంబంలో చిన్న మోడల్ గా నిలిచే అవకాశం ఉంది. అందుకే దీనిని బేబీ స్కార్పియో అని కూడా పిలుస్తున్నారు. ఇటీవల కనిపించిన టెస్ట్ వెహికల్స్ ను బట్టి చూస్తే, ఈ SUV పరీక్షలు చివరి దశకు చేరుకున్నట్లు తెలుస్తోంది. 2026 చివర్లో, 2027 ప్రారంభంలో మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉంది. ఇది సాధారణ కాంపాక్ట్ SUVలా కాకుండా రగ్గడ్ లుక్‌తో కనిపించనుంది. ముందు భాగంలో కొత్త డిజైన్ గ్రిల్, L ఆకారంలో LED హెడ్‌ల్యాంప్స్, మస్కులర్ బోనెట్ ఉండే అవకాశం ఉంది. ADAS కోసం ముందు భాగంలో రాడార్ మాడ్యూల్ కూడా కనిపించవచ్చు. వెనుక వైపు స్పేర్ వీల్, ఫ్లష్ డోర్ హ్యాండిల్స్, పనోరమిక్ సన్‌రూఫ్ లాంటి ఫీచర్లు ఉండే అవకాశం ఉంది. చిన్న రియర్ ఓవర్ హాంగ్ కారణంగా SUVకి స్పోర్టీ లుక్ వచ్చే అవకాశం ఉంది.
క్యాబిన్‌లో కూడా అత్యాధునిక ఫీచర్లు అందించనున్నట్లు తెలుస్తోంది. డ్యూయల్ స్క్రీన్ సెటప్, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్ ప్లే, వెంటిలేటెడ్ సీట్లు, ఆటోమేటిక్ AC, వైర్‌లెస్ ఫోన్ ఛార్జింగ్ వంటి ఫీచర్లు ఉండొచ్చని తెలుస్తోంది. భద్రతకు సంబంధించి ఆరు ఎయిర్‌బ్యాగ్స్, ABS, EBD, ESC, హిల్ హోల్డ్, హిల్ డిసెంట్ కంట్రోల్, పార్కింగ్ సెన్సార్లు, TPMSతో పాటు Level 2 ADAS కూడా ఉండే అవకాశం ఉంది. కొత్త NU_IQ మాడ్యులర్ ప్లాట్ ఫామ్‌పై తయారయ్యే మొదటి మోడల్ ఇదే కావచ్చని తెలుస్తోంది. పెట్రోల్, డీజిల్, ఎలక్ట్రిక్, హైబ్రిడ్ లాంటి పలు పవర్‌ట్రెయిన్ ఆప్షన్లను కంపెనీ పరిశీలిస్తున్నట్లు సమాచారం.
మరోవైపు మహీంద్రా BE 7 కూడా మార్కెట్లోకి రావడానికి సిద్ధమవుతోంది. ఇది BE.07 కాన్సెప్ట్ ఆధారంగా రూపొందుతున్న ఎలక్ట్రిక్ SUV. ప్రస్తుతం కంపెనీ లైనప్‌లో ఉన్న BE 6, XEV 9e మధ్య ఈ కొత్త SUVను ఉంచే అవకాశం ఉంది. BE 7 కుటుంబ అవసరాలకు సరిపోయే విధంగా విశాలమైన SUVగా రానుంది. టెస్ట్ మోడళ్లను పరిశీలిస్తే ఫ్రేమ్‌లెస్ డోర్లు, ఫ్లష్-ఫిట్టింగ్ పాప్-అవుట్ డోర్ హ్యాండిల్స్ లాంటి ఫీచర్లు కనిపిస్తున్నాయి. ఈ SUV INGLO బోర్న్EV ప్లాట్ ఫామ్‌పై రూపొందనుంది. దీని పొడవు సుమారు 4.6 మీటర్లు ఉండొచ్చని అంచనా. బ్యాటరీ విషయంలో 59 kWh, 79 kWh ఆప్షన్లు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. పెద్ద బ్యాటరీ వెర్షన్‌లో డ్యూయల్ మోటార్, ఆల్-వీల్ డ్రైవ్ సెటప్ ఉండొచ్చని సమాచారం. మార్కెట్లోకి వచ్చిన తర్వాత మహీంద్రా BE 7 ప్రధానంగా Tata Harrier EV వంటి మోడళ్లకు పోటీ ఇవ్వనుంది.
Read Also: అమ్మకాల్లో దుమ్మురేపిన మారుతి గ్రాండ్ విటారా.. ఏకంగా 4 లక్షల యూనిట్లు సేల్!