E-Paper
Advertisement

Kissik Talks Show : బిగ్ బాస్ విన్నర్ పరిస్థితి ఇలా మారిందేంటి..? పాపం బుక్కయ్యాడుగా..

Kissik Talks Show : బిగ్ బాస్ విన్నర్ పరిస్థితి ఇలా మారిందేంటి..? పాపం బుక్కయ్యాడుగా..
Advertisement

BIG TV Kissik Talks: బిగ్ టీవీ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న పాపులర్ టాక్ షో ‘కిస్సిక్ టాక్స్’ (Kissik Talks) లో  తాజాగా బిగ్ బాస్ సీజన్ 9′ టైటిల్ విజేత కళ్యాణ్ పడాల పాల్గొన్నారు. యాంకర్ వర్ష హోస్ట్‌గా వ్యవహరించిన ఈ ఇంటర్వ్యూలో బిగ్ బాస్ హౌస్ లోని అనుభవాలు, గెలుపు వెనుక ఉన్న రహస్యాలు, సెలబ్రిటీ హోదా వచ్చాక వ్యక్తిగత జీవితంలో ఎదురవుతున్న ఇబ్బందులపై కళ్యాణ్ ఎన్నో ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు.

బాబు హీరో అయిపోయాడు.. డేట్ దొరకడం లేదు!

ఇంటర్వ్యూ ప్రారంభంలో యాంకర్ వర్ష మాట్లాడుతూ.. “బిగ్ బాస్ హౌస్ లో ఉన్నంతసేపు తెలుగు ఆడపడుచులు మా తమ్ముడు, మా అబ్బాయి లేదా మా అన్నయ్య ఇలా ఉంటే బాగుంటుంది అని అనుకునేలా కళ్యాణ్ ప్రవర్తించాడు” అని ఆకాశానికి ఎత్తేసింది. దీనికి కళ్యాణ్ స్పందిస్తూ.. తెలుగు ప్రేక్షకులు నన్ను తమ సొంత మనిషిగా గుండెల్లో పెట్టుకున్నారని ఎంతో వినయంగా చెప్పుకొచ్చాడు.
Also read :రిటైర్డ్ IPS భార్య హత్య కేసుపై RGV కన్ను: ‘నేపాలీ గ్యాంగ్స్’ కథతో నెక్స్ట్ సినిమా?
ఇదే క్రమంలో వర్ష ఆటపట్టిస్తూ.. “కళ్యాణ్ ని ఇంటర్వ్యూకి తీసుకురండి అని అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు కానీ, బాబు పెద్ద హీరో అయిపోయాడు.. అస్సలు డేట్ ఇవ్వడం లేదు” అనడంతో కళ్యాణ్ నవ్వేశాడు. “అఫీషియల్ అనౌన్స్ మెంట్ రానంతవరకు ప్రాజెక్ట్స్ గురించి బయట ఏమీ చెప్పకూడదు” అంటూ తన సినిమా ఎంట్రీపై హింట్ ఇచ్చాడు. త్వరలోనే కళ్యాణ్ వెండితెరపై కనిపించాలని కోరుకుంటూ వర్ష ‘తథాస్తు’ అంటూ ఈ సీట్లో కూర్చుని ఏం చెప్పినా జరుగుతుందని చాలామంది అన్నారని అనడంతో లైఫ్ లాంగ్ యాక్టింగ్ మాత్రం మిస్ అవ్వకూడదనేదే తన మనసులోని బలమైన కోరిక అని కళ్యాణ్ స్పష్టం చేశాడు.

బిఫోర్ బిగ్ బాస్ వర్సెస్ ఆఫ్టర్ బిగ్ బాస్

Advertisement

బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లకముందు, వెళ్లొచ్చిన తర్వాత జీవితంలో వచ్చిన మార్పుల గురించి కళ్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు బిఫోర్ బిగ్ బాస్ అయితే బైక్ వేసుకుని హ్యాపీగా నచ్చిన చోటుకి వెళ్లి బిరియాని తినేవాడినని, కానీ ఇప్పుడు బయట అడుగుపెట్టాలంటే ఉదయం ఏం తిన్నాం, మధ్యాహ్నం ఏం తింటున్నాం అంటూ లెక్కలు వేసుకోవాల్సి వస్తోందని నవ్వుతూ తన కష్టాలను చెప్పుకొచ్చాడు.

థియేటర్ ఎక్స్పీరియన్స్ ఒకప్పుడు సినిమా చూడాలనుకుంటే బైక్ పై వెళ్ళిపోయేవాడినని, ఇప్పుడు థియేటర్ కి వెళ్లాలంటే తెలిసిన వాళ్లకు ఫోన్లు చేసి, ముసుగులు (మాస్కులు) వేసుకుని సైలెంట్ గా వెళ్లాల్సి వస్తోందని తెలిపాడు.
Also read :ఆమెను తాకితే షాక్ కొడుతోంది.. తిరువీర్ ‘ఓ సుకుమారి’ టీజర్ ట్విస్ట్ చూశారా?

అంత ‘ఊర మాస్ కాదు 

Advertisement

రీసెంట్ గా విడుదలైన టాలీవుడ్ క్రేజీ మూవీ‘పెద్ది’ (Peddi) సినిమాకు కూడా తాను వెళ్లానని, అది కూడా  ప్రీమియర్ షోకే అని చెప్పాడు.థియేటర్ లో పేపర్లు ఎగరేస్తూ రచ్చ చేసే అలవాటు తనకు లేదని, తాను అంత ‘ఊర మాస్’ కాకపోయినా, పవన్ కళ్యాణ్ ‘ఖుషి’ రీ-రిలీజ్ అప్పుడు మాత్రం థియేటర్ లో ఫుల్ హంగామా చేశానని గుర్తుచేసుకున్నాడు. తనకు ఈల (Whistle) వేయడం బాగా వచ్చు కాబట్టి, ఏ సినిమా నచ్చినా విజిల్స్ తోనే తన ఆనందాన్ని వ్యక్తపరుస్తానని తెలిపాడు. మొత్తానికి ఈ ‘కిస్సిక్ టాక్స్’ ఇంటర్వ్యూ కళ్యాణ్ పడాల అభిమానులకు ఫుల్ మీల్స్ లాంటి వినోదాన్ని అందించి సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో నిలిచింది.

Related News

పవన్‌తో రీతూ పెళ్లి.. మొత్తానికి బయటపెట్టేశారు, ట్విస్ట్ ఏమిటంటే?

అవినాష్ దెబ్బకు నవ్యస్వామి షాక్!

ఎక్స్ లవర్ తో అడ్డంగా బుక్ అయిన రోహిణి.. !

సర్వస్వం అన్నాడు..8 ఏళ్లు వాడుకొని వదిలేసాడు- జబర్దస్త్ బ్యూటీ

Gundeninda GudiGantalu Today episode: మాణిక్యం పై ప్రశంసలు.. అడ్డంగా బుక్కయిన రోహిణి… బాలు ట్విస్ట్ అదుర్స్..

Podarillu Today Episode : కేశవ మాట విన్న శైలు.. చక్రీ మాటపై ఫైర్ .. శైలు ఎంట్రీతో వరాలు షాక్..

Illu Illalu Pillalu Today Episodes: కన్నీళ్లు పెట్టుకున్న రామారాజు.. అయ్యో పాపం వేదవతి.. ధీరజ్, ప్రేమ కలిస్తారా..?

Brahmamudi Serial Today Episode July 31st ‘బ్రహ్మముడి’ సీరియల్‌: రేఖకు వార్నింగ్ ఇచ్చిన ఐశ్వర్య

Big Stories

Advertisement
×