E-Paper
Advertisement

పానీపూరీ తినడం వల్ల రోగాలు వస్తాయా? షాకింగ్ ఫ్యాక్ట్స్ బయటపెట్టిన కామాక్షి!

పానీపూరీ తినడం వల్ల రోగాలు వస్తాయా? షాకింగ్ ఫ్యాక్ట్స్ బయటపెట్టిన కామాక్షి!
Advertisement

Kissik Talks: చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ల వరకు ప్రతి ఒక్కరు ఇష్టంగా తినే స్నాక్ ఐటమ్ పానీపూరీ.. సాయంత్రం అయిందంటే చాలు పానీ పూరిలో ఎన్నో రకాల వెరైటీలు మనకు రోడ్ సైడ్ దర్శనమిస్తూ ఉంటాయి. ముఖ్యంగా పానీ పూరీ తినడం ఆరోగ్యానికి హానికరం అని ఎంతమంది చెప్పినా.. వాటి డిమాండ్ మాత్రం ఎక్కడ తగ్గడం లేదు. ప్రత్యేకంగా కొన్ని రాష్ట్రాలలో ఈ పానీపూరీని బ్యాన్ చేసినప్పటికీ కూడా వీటి వినియోగం ఉంది అంటే ప్రజలు దీనిని ఎంత అమితంగా ఇష్టపడుతున్నారో అర్థం చేసుకోవచ్చు. అయితే పానీ పూరీ తినడం వల్ల నిజంగానే రోగాలు వస్తాయా ?అందులో కలిపే పదార్థాలు ఏమిటి? ముఖ్యంగా పానీ పూరిలో మైదా, గోధుమపిండే కదా!.. మరి రోగాలు రావడానికి కారణం ఏంటి? అంటూ ఇలా చాలామంది తమ అనుమానాలు వ్యక్తం చేస్తూ ఉంటారు.

పానీ పూరీ తింటే నిజంగా రోగాలు వస్తాయా?

అయితే పానీ పూరీ తినడం వల్ల నిజంగానే రోగాలు వస్తాయా? అనే ప్రశ్నకు ప్రముఖ టాలీవుడ్ హీరోయిన్, డా .కామాక్షి భాస్కర్ల ఇచ్చిన సమాధానం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. పొలిమేర 1,2 చిత్రాలతో ఊహించని పాపులారిటీ సొంతం చేసుకుని.. ఇప్పుడు ఎంఎస్ రాజు (MS Raju) దర్శకత్వంలో ‘అగధ’ అనే సినిమాతో ఆగస్టు 14వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ తెలుగమ్మాయి.. ఈ ఒక్క సినిమాతో ఊహించని పాపులారిటీ సొంతం చేసుకుంది. చైనాలో డాక్టర్ వృత్తిని చేపట్టిన మీనాక్షి సినిమాలపై మక్కువతో 2017లో ఇండియాకి వచ్చింది.. అప్పటినుంచి సినిమాలు చేస్తూ అలరిస్తున్న ఈమె తాజాగా అగధ సినిమాతో మంచి విజయాన్ని దక్కించుకుంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా బిగ్ టీవీ ఎక్స్ క్లూజివ్గా నిర్వహిస్తున్న కిస్సిక్ టాక్స్ కార్యక్రమానికి గెస్ట్ గా విచ్చేసిన కామాక్షి తో పానీపూరి విషయంపై హోస్ట్ వర్ష ప్రశ్నించింది.

Advertisement

ALSO READ:‘జూనియర్ అనుష్క’గా కామాక్షి.. ప్రొడ్యూసర్ మాట నిలబెడుతుందా?

షాకింగ్ నిజాలు బయటపెట్టిన మీనాక్షి..

“కామాక్షి మీరు మెడికల్ చదువుకున్నారు కాబట్టి.. చిన్నపిల్లల్లో పానీ పూరి తినడం వల్ల ఎక్కువగా హార్ట్ ఎటాక్ రావడం, హెల్త్ ప్రాబ్లమ్స్ రావడం మనం చూస్తూనే ఉన్నాం.. నిజంగా పానీపూరి తినడం వల్ల హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయా? అని వర్షా అడగగా.. కామాక్షి భాస్కర్ల మాట్లాడుతూ.. “ముఖ్యంగా పానీ పూరీ స్టాల్స్ పెట్టే ఏరియాలు చాలా అశుభ్రంగా ఉంటున్నాయి. ఇప్పుడు ఏ ఫుడ్ అయినా పెట్టే ప్రదేశం శుభ్రంగా లేకపోతే ఏదైనా సరే విషంగా మారుతుంది. ఇక పానీ పూరి తినడం వల్ల కాదు పానీ పూరి తయారు చేసే విధానం, పెట్టే ప్రదేశం వల్లే అది విషంగా మారి పిల్లలకు ప్రాణాంతకంగా మారుతుంది” అంటూ ఒక డాక్టర్ గా అసలు విషయాన్ని బయటపెట్టింది కామాక్షి భాస్కర్ల . ఏదైనా సరే శుభ్రం లేని ఆహారం శరీరానికి హానికరం అంటూ సూచించింది.

కామాక్షి భాస్కర్ల కెరియర్..

Advertisement

కామాక్షి భాస్కర్ల విషయానికి వస్తే.. 2017 లోనే పొలిమేర సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టినప్పటికీ లీడ్ రోల్ పోషించడానికి పదేళ్ల సమయం పట్టిందని, ముఖ్యంగా ఎమ్మెస్ రాజుగారు తన నటనను మెచ్చి అగధ సినిమాతో తనకు అవకాశం కల్పించాలని, ఇప్పుడు ఆయన మాటను నిలబెట్టుకుంటున్నాను అంటూ పరోక్షంగా చెప్పుకొచ్చింది. మొత్తానికైతే ఈ సినిమాతో మంచి విజయాన్ని సొంతం చేసుకుంది కామాక్షి భాస్కర్ల.

 

Related News

Karthika Deepam 2 Serial Today Episode October 5th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: మాలినికి షాక్ ఇచ్చిన సూరజ్ – పీఏగా జ్యోత్స్న అపాయింట్            

Ninnu kori Serial Today Episode October 5th ‘నిన్ను కోరి’ సీరియల్‌: సామ్రాట్ ను జీవన్ చంపేస్తాడా..? చంద్ర కనిపెడుతుందా..? 

Nindu Noorella Saavasam Serial Today Episode October 5th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మనోహరి తనను చంపేస్తుందని పార్థు పసిగడతాడా..?    

Monday Tv Movies : మూవీ లవర్స్ కు పూనకాలే.. వీటిని మస్ట్ వాచ్..

సుప్రీత ఆస్తుల విలువ ఎంతో తెలుసా? చిట్టా మొత్తం బయటపెట్టిందిగా?

పవన్ కళ్యాణ్ రాజకీయాల పై సుప్రీత కామెంట్స్… పండగ చేసుకున్నాం అంటూ!

సుప్రీత నెల సంపాదన ఎంతో తెలుసా? అందం కోసం అంత ఖర్చు చేస్తుందా?

డ్రగ్స్ వ్యవహారం…ఏడవని రోజు లేదు సుప్రీత ఎమోషనల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×