E-Paper
Advertisement

Karthika Deepam 2 Serial Today Episode June 17th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: జ్యోత్స్నకు చుక్కలు చూపిస్తున్న సూరజ్  

Karthika Deepam 2 Serial Today Episode June 17th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: జ్యోత్స్నకు చుక్కలు చూపిస్తున్న సూరజ్  
Advertisement

Karthika Deepam 2 serial today Episode: జ్యోత్స్న దగ్గరకు వచ్చిన ఆర్డర్‌ క్యాన్సిల్‌ అయి దీప చేతుల్లోకి వెళ్తుంది. ఆ వచ్చిన కస్టమర్‌ ఆర్డర్‌ కన్‌ఫం చేసుకుని పది లక్షలు అడ్వాన్స్‌ తీసుకుంటుంది. దీంతో జ్యోత్స్న కోపంతో ఊగిపోతుంది. అప్పుడే వచ్చిన కార్తీక్‌కు దీప విషయం చెప్తుంది. కార్తీక్‌ కంగ్రాట్స్‌ చెప్పబోతుంటే.. ఆపేస్తుంది. కార్తీక్‌ మాటలకు జ్యోత్న్స కోపంగా అక్కడి నుంచి వెళ్లిపోతుంది. వెనకే సూరజ్‌ వెళ్తాడు. కార్తీక్‌, దీప దగ్గరకు వెళ్లి పార్టీ అడుగుతాడు. ఇంటికి వెళ్లాక స్వీట్‌ చేసి పెడతానని చెప్తుంది దీప.

బయటకు వెళ్లిన జ్యోత్స్న క్యాంటీన్‌లో కూర్చుని కాఫీ తాగుతుంటే.. వెనకే వెళ్లిన సూరజ్‌ జ్యోత్స్న పక్కన పెట్టిన కాఫీ కప్పు తీసుకుని తాగుతుంటాడు. ఏయ్‌ నా కప్పు ఎందుకు తీసుకున్నావు అని అడగ్గానే.. ఈ కప్పు మీద ఎవరి పేరు రాసి ఉండదు.. కాఫీ బాగుండదు అని చెప్పగానే.. నేన ఏం అడుగుతున్నాను నువ్వేం మాట్లాడుతున్నావు.. ఒక చిన్న వీడియో దగ్గర పెట్టుకుని నన్ను బ్లాక్‌ మెయిల్‌ చేస్తున్నావా..? అని జ్యోత్స్న అడగ్గానే.. కాసేపట్లో మీ తాత దగ్గర నుంచి నీకు ఫోన్‌ వస్తుంది అని సూరజ్‌ చెప్పగానే.. ఎందుకు అని జ్యో అడుగుతుంది. దీంతో సూరజ్‌ వీడియో మీ తాతకు పంపాను అని చెప్తాడు. జ్యో షాక్‌ అవుతుంది. సూరజ్‌ నవ్వుతూ కాఫీ తాగుతూ.. రౌడీలను అడ్డుపెట్టుకుని నువ్వు చేసిన అరాచకాలు అన్ని అందులో ఉన్నాయి అని చెప్పగానే.. ఎవ్వరికీ చెప్పనని మాటిచ్చావు కదరా..? అని జ్యో కోపంగా అడగ్గానే..

Advertisement

నేనేం మాటివ్వలేదు.. నువ్వు నా గురించి బయటపెడితే నేను నీ గురించి బయటపెడతాను అన్నాను.. అని సూరజ్‌  చెప్పగానే.. నేను నీ గురించి ఎవ్వరికీ చెప్పలేందు అంటుంది జ్యో.. నేను కూడా ఎవ్వరికీ చెప్పలేదు అంటాడు సూరజ్‌. దీంతో జ్యో కోపంగా మరి వీడియో తాతకు సెండ్‌ చేశానన్నావు అని అడగ్గానే.. అది బయట పడితే నువ్వు ఎంత కంగారు పడతావో చూడాలనుకున్నాను అంటూ సూరజ్‌ చెప్పగానే.. నువ్వేంటి ఇంత శాడిస్టువులా ఉన్నావురా..? అంటూ జ్యోత్స్న కోపంగా తిడుతుంది. అసలు ఎవర్రా నువ్వు మా తాతను నన్ను కాపాడినట్టు బిల్డప్‌ ఇచ్చి మా అవుట్‌ హౌస్‌లో ఉండటానికి కారణం ఏంటి..? నీలాంటి వాళ్లను బయట తిరగనివ్వకూడదు.. అంటూ తిడుతుంటే.. దానికి ఇంకా టైం ఉందిలే కానీ అంటూ సూరజ్‌ చెప్పగానే.. నీకైతే టైం దగ్గర పడిందిరా అంటూ జ్యో తిడుతుంది. ఇంతలో సూరజ్‌ అప్పుడే వచ్చిన డీల్‌ గురించి జ్యోత్స్ను అడుగుతుంటే.. మీకో డీల్‌ వచ్చిందని బిల్డప్‌ కొడుతున్నారా..? అంటూ తిడుతూ.. జ్యోత్స్న వెళ్లిపోతూ జారి కిందపడిపోతుంది. సూరజ్‌ నవ్వుతూ.. చూస్తుంటాడు. ఈ విషయం ఎవరికైనా చెప్పావంటే బాగుండదు అంటూ వెళ్లిపోతుంది.

క్యాబిన్‌లోకి వెళ్లిన జ్యోత్స్నను చూసి కార్తీక్‌ వెళ్లి క్యాంటీన్‌లో జారి కిందపడ్డావంట కదా నీకేమైనా మెమెరీ లాస్‌ అయిందా..? అంటూ ఇంట్లో అందరి పేర్లు చెప్పమని అడుగుతుంటాడు. అప్పుడే దీప వచ్చి నాకు కూడా తెలిసింది కింద పడిపోయిందని అంటుంది. జ్యోత్స్న సూరజ్‌ను తిట్టుకుంటుంది. ఇంతలో కార్తీక్‌ ఇంట్లో వాళ్ల పేర్లు చెప్పమని గట్టిగా అడగ్గానే.. తన పేరు మిగతా వాళ్ల పేర్లు చెబుతూ.. బావ నాకేం కాలేదు బాగానే ఉన్నాను అంటుంది. ఇంతలో బయటి నుంచి మేనేజర్‌ ఏడుస్తూ.. మేడం అంటూ లోపలికి వస్తాడు. కార్తీక్‌ నువ్వెందుకు ఏడుస్తున్నావు అని అడగ్గానే.. మేడం గారు కింద పడిపోయారట కదా సార్‌ అనగానే.. జ్యోత్స్న ఇరిటేట్‌ అవుతుంది.

Advertisement

వీడికి కూడా చెప్పేశాడా..? రేయ్‌ సూరజ్‌ అంటూ కోపంగా చూస్తుంది. మేనేజర్‌ను తిట్టి అక్కడి నుంచి వెళ్లగొడుతుంది. ఇంతలో ఇంటి నుంచి సుమిత్ర ఫోన్‌ చేసి కింద పడిపోయావంట కదా ఎలా ఉంది అని అడుగుతుంది. దీంతో జ్యోత్స్న ఇరిటేట్‌ అవుతూ అంతా బాగానే ఉందమ్మా..? నా మైండ్‌.. నా తల బాగానే పని చేస్తున్నాయి అమ్మా అంటూ కాల్‌ కట్‌ చేస్తుంది. ఇంతలో ఆఫీస్‌ బాయ్‌ పరుగెత్తుకుంటూ వచ్చి మేడం కింద పడిపోయారట కదా మన రెస్టారెంట్‌ స్టాప్‌ అంతా మిమ్మల్ని పలకరించడానికి వస్తున్నారు మేడం అని చెప్పగానే.. జ్యోత్స్న కోపంగా ఆఫీస్‌ బాయ్‌ని తిట్టి అక్కడి నుంచి వెళ్లిపోతుంది.

సూరజ్‌ దగ్గరకు వెళ్లిన జ్యోత్స్న కోపంగా రేయ్‌ సూరజ్‌ నేను కింద పడ్డానని అందరికీ ఎందుకు చెప్పావని అడుగుతుంది. దీంతో సూరజ్‌ నేను చెప్పానని నీకు చెప్పింది ఎవరు..? అని అడుగుతాడు. నేను కింద పడినప్పుడు అక్కడ ఉన్నది నువ్వే కదా..? ఇంకెవరు చెప్పి ఉంటారు..? అంటూ జ్యో ప్రశ్నిస్తే.. ఏమీ చెప్పకుండా సూరజ్‌ వెళ్లిపోతాడు. జ్యో కోపంగా చూస్తుంటుంది. మరోవైపు దీప స్టాప్‌ అందరినీ పిలిచి మంచి ఆర్డర్‌ వచ్చిందని ఇది సక్సెస్‌ చేయాలని అందరికీ సూచిస్తుంది. ఇంతలో ఇవాళ్టీ కార్తీకదీపం2 ఏపిసోడ్‌ అయిపోతుంది.

 ALSO READ: మిథున రాశిలోకి శుక్రుడు – ఆ ఐదు రాశులకు గజలక్ష్మీ యోగం – అపర కుబేరులు అవ్వడం ఖాయం

 

Related News

సత్తా చాటిన కామనర్.. బిగ్ బాస్ 10 తొలి కెప్టెన్ గా లేడీ కంటెస్టెంట్!

గుండెనిండా గుడిగంటలు రోహిణి షాకింగ్ నిర్ణయం..?హమ్మయ్య ఫ్యాన్స్ హ్యాపీ..

ఇండస్ట్రీకి రోహిణి గుడ్ బై.. ఎందుకో తెలుసా..?

Gundeninda GudiGantalu Today episode: మనోజ్ రోహిణిని విడగొట్టేందుకు ప్లాన్.. మీనా ఫుల్ హ్యాపీ.. మనోజ్ కు వార్నింగ్..

Podarillu Today Episode : చక్రీ పంట పండిందిరోయ్.. అస్సలు ఊహించని ట్విస్ట్.. చక్రీ మాస్టర్ ప్లాన్..

Karthika Deepam 2 Serial Today Episode September 19th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: మాలినిని ప్రశ్నించిన సూరజ్ – కార్తీక్ ఇంటికి వెళ్లిన శివనారాయణ ఫ్యామిలీ         

Intinti Ramayanam Today Episode: తాగొచ్చి రచ్చ చేసిన కమల్.. పార్వతికి అనుమానం..పల్లవి మాస్టర్ ప్లాన్..

Saturday Movies in Tv : శనివారం సినిమాల సందడి.. జాతర మాములుగా లేదు..

Big Stories

Advertisement
×