E-Paper
Advertisement

Nindu Noorella Saavasam Serial Today Episode October 13th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మనోహరిని వైజయంతి వదిలేసినట్టేనా..?  

Nindu Noorella Saavasam Serial Today Episode October 13th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మనోహరిని వైజయంతి వదిలేసినట్టేనా..?  
Advertisement

Nindu Noorella Saavasam Serial Today Episode:  మనోహరి మీద అనుమానంతో తనను రకరకాలుగా ఇంటరాగేషన్‌ చేస్తుంది వైజయంతి. అందులో భాగంగా పార్థు చనిపోయిన హిల్‌ స్టేషన్‌ దగ్గరకు మనోహరిని తీసుకెళ్తుంది. పార్థు చనిపోయిన రోజు చనిపోవడానికి కొన్ని క్షణాల ముందు మీరేం మాట్లాడుకున్నారు. ఏం చేశారు. ఇక్కడ పార్థు ఎలా లోయలోకి పడిపోయాడు. పార్థు పడిపోతుంటే నువ్వు పట్టుకునే ప్రయత్నం చేయలేదా..? అన్ని విషయాలు చెప్పు అంటూ మనోహరిని అడుగుతుంది. అందుకు మనోహరి ఆరోజు జరిగింది గుర్తు చేసుకుంటుంది. తాను పార్థును లోయ అంచుకు తీసుకెళ్లింది. వెనక నుంచి తాను తోసేసింది.. పార్థు చెట్టు కొమ్మ పట్టుకుని వేలాడుతుంటే.. కర్ర తీసుకుని చేతుల మీద కొట్టింది.. పార్థు కొమ్మను వదిలేసి లోయలోకి పడిపోయింది మొత్తం గుర్తు చేసుకుంటుంది.

కానీ బయటకు మాత్రం వేరేలా చెప్తుంది మనోహరి. అయితే మనోహరి చెప్పేది అర్తం కావడం లేదని ఆరోజు ఏం జరిగిందో ఇప్పుడు పార్థు ప్లేస్‌లో అమర్ ఉంటాడు అమర్‌నే పార్థు అనుకుని చూపించు అని వైజయంతి చెబితే.. సరే అంటుంది. అమర్‌ లోయ అంచున నిలబడి సీనరీ చూస్తుంటాడు. మనోహరి తాను పార్థును వెనక్కి రమ్మని పిలిచానని చేయి పట్టుకుని లాగేలోపే కాలు జారి లోయలోకి పడిపోయాడని చెప్తుంది మనోహరి. ఎలా లాగావు చూపించు అంటే అప్పుడే అమర్‌ కళ్లు తిరిగి లోయలోకి పడబోతుంటే.. దూరంగా గమనిస్తున్న మిస్సమ్మ పరుగెత్తుకుంటూ వెళ్లి మనోహరి కన్నా ముందే అమర్‌ చేయి పట్టుకుని బయటకు లాగేస్తుంది. ఏవండి అంటూ భయపడుతూ.. హగ్‌ చేసుకుని ఏడుస్తుంటే.. నాకేం అవ్వదు భాగీ నువ్వుండగా అంటూ అమర్‌ ఓదారుస్తుంటాడు. అంతా గమనిస్తున్న వైజయంతి ఆరోజు కూడా పార్థుకు ఇలాగే జరిగి ఉంటే ఎంత బాగుండు అని మనసులో అనుకుంటూ ఎమోషనల్ అవుతుంది.

Advertisement

తర్వాత అమర్‌కు సారీ చెప్పి ఇక హైదరాబాద్‌ వెళ్లిపోవచ్చని చెప్తుంది. వైజయంతి హైదరాబాద్‌ వెళ్లిపోమ్మని చెప్పగానే మనోహరి ఏడుస్తూ.. నా మీద మీ డౌటు తీరిందా మేడం.. నాకు ఇష్టం లేకపోయినా నేను బాధపడతానని తెలిసినా ఎందుకు మేడం నన్ను ఈ ప్లేస్‌కు తీసుకొచ్చారు అని ప్రశ్నిస్తుంది. నా పార్థుతో పాటు నేను చనిపోయి ఉంటే నాకు ఈ బాధే ఉండేది కాదు అంటూ మనోహరి ఏడుస్తున్నట్టు నటిస్తుంది. పాపి చిరాయువు అన్నట్టు నీకు చావు అంత తేలిగ్గా రాదు మనోహరి.. నీ చావు ఎంత భయంకరంగా ఉంటుందో నేను ఊహించలేను అని రాథోడ్‌ మనసులో అనుకుంటాడు.

మనోహరి మాటలకు వైజయంతి కౌంటర్‌ ఇస్తుంది.  నిన్ను ఇక్కడకు తీసుకురావడం కాదు ఈ కేసు నేనే టేకప్‌ చేస్తున్నాను అవసరం అనుకుంటే నేను ఎందాకైనా వెళ్తాను.. అంతెందుకు హైదరాబాద్‌ రావాల్సి వచ్చినా వస్తాను అంటుంది. అవును మేడం మీరే ఏం చేసైనా సరే పార్థు సార్‌ చావుకు కారణమైన వాళ్లను పట్టుకోండి మేడం అటాడు రాథోడ్‌. మీరు హైదరాబాద్‌ వస్తే తప్పకుండా మా ఇంట్లోనే ఉండాలి మేడం అని మిస్సమ్మ చెబితే.. మీ ఇంట్లో ఉండటమే కాదు భాగీ నేరుగా ఢిల్లీ నుంచి మీ ఇంటికే వస్తాను  సరే మీరు ఇక బయలుదేరండి అంటూ వైజయంతి చెప్పగానే.. అమర్‌ అందరినీ తీసుకుని అక్కడి నుంచి వెల్లిపోతాడు.  ఇంతటితో నేటి నిండు నూరేళ్ల సావాసం సీరియల్ ఎపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: మిథున రాశిలోకి శుక్రుడు – ఆ ఐదు రాశులకు గజలక్ష్మీ యోగం – అపర కుబేరులు అవ్వడం ఖాయం

Advertisement

 

Related News

Intinti Ramayanam Today Episode: పల్లవి ప్లాన్ సక్సెస్.. కమల్, అవని అరెస్ట్.. పల్లవికి స్ట్రాంగ్ వార్నింగ్..

Illu Illalu Pillalu Today Episodes: సాగర్ కు నర్మద వార్నింగ్.. సుక్కుకు ప్రేమ వార్నింగ్.. వల్లి నెక్స్ట్ ప్లానేంటి..?

Karthika Deepam 2 Serial Today Episode October 13th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: జ్యోత్స్న కోసం సూరజ్ కాలర్ పట్టుకున్న కార్తీక్              

Tuesday Tv Movies : మంగళవారం టీవీ సినిమాలు.. ఆ రెండు మస్ట్ వాచ్..

దూసుకెళ్తున్న బతుకమ్మ పాటలు.. మంగ్లీ నుంచి మధుప్రియ వరకు ఎవరి పాటలకు ఎంత క్రేజ్?

సుధీర్‌కు అంత క్రేజ్ ఉన్నా.. హీరోగా ఎందుకు సక్సెస్ కావట్లేదంటే ?

నన్ను బ్లాక్ చేసిన అమ్మాయినే పెళ్లి చేసుకుంటున్నా.. జబర్దస్త్ బాబు లవ్ స్టోరీ!

Big Stories

Advertisement
×