E-Paper
Advertisement

Nindu Noorella Saavasam Serial Today December 27th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మిస్సమ్మ కోసం వెతికిన అమర్

Nindu Noorella Saavasam Serial Today December 27th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మిస్సమ్మ కోసం వెతికిన అమర్
Advertisement

Nindu Noorella Saavasam Serial Today Episode:   

పిల్లల దగ్గర కూర్చుని మిస్సమ్మ ఏడుస్తుంటే.. డోర్‌ దగ్గర నిలబడి చూస్తుంటారు మనోహరి, చంభా. మిస్సమ్మను చూసి నవ్వుకున్న మనోహరి… చంభా, భాగీ బాగానే భయపడుతున్నట్టు ఉంది అనగానే.. మరి నువ్వు చెప్పింది పంతులు గారు పొల్లు పోకుండా చెప్పారు అంటుంది చంబా. లోపల అమ్ము ఏడుస్తూ మా అమ్మ పోయాక మమ్మల్ని అమ్మలా చూసుకున్నావు మిస్సమ్మ.. ఇప్పుడు అమ్మ కూడా బుజ్జమ్మలా తిరిగి వచ్చింది. మీరు ఇద్దరూ ఉంటే మాకు ఆ దేవుడు కూడా అక్కర లేదు అంటుంది అమ్ము. దీంతో డోర్‌ దగ్గర వింటున్న మనోహరి భాగీ నీతో ఉండదే.. నీ మాటలతో దాని గుండె పగిలిపోతుంది అని మనసులో అనుకుంటుంది.

లోపల అంజు కూడా అవును మిస్సమ్మ ఆ దేవుడైనా అడిగితేనే వరం ఇస్తాడు. కానీ నువ్వు మేము అడక్క ముందే మాకు ఏం కావాలో ఇస్తావు అంటుంది. ఆనంద్‌ కూడా మా కోసం అమ్మవు అయ్యావు మిస్సమ్మ.. ఆఖరికి మా అమ్మను కూడా బుజ్జమ్మ రూపంలోనే మాకు తిరిగి ఇచ్చావు అంటాడు. ఆకాష్‌ కూడా నీలా ఎవ్వరూ చేయలేరు మిస్సమ్మ నువ్వు ఎప్పుడూ మా పక్కనే ఉండాలి అంటాడు. డోర్‌ దగ్గర ఉన్న మనోహరి మాత్రం నవ్వుకుంటూ ఈ పిల్లల కోడి రేపు ఒంటరి కోడి అవ్వనుంది చంభా అంటుంది. దీంతో చంభా నవ్వుతూ లేకపోతే ఆ కోడి పిల్లలను గద్ద ఎత్తుకుపోతుంది అని నవ్వుతుంది. మరోవైపు కింద కూర్చుని పాపను ఎత్తుకున్న కూర్చున్న అమర్‌.. ఇది వరకు నీకు పిల్లలకు ఏది కావాలన్నా నన్ను భయపడుతూ అడిగేదానివి.. ఈ నాన్న నువ్వు ఏది అడిగినా కాదనడు అని మనసులో అనుకుంటాడు.

Advertisement

ఇక రూంలో ఉన్న మిస్సమ్మ రేపటి నుంచి మీరు అల్లరి చేయకూడదు. మీ నాన్న చెప్పిన మాటలు వినాలి. మీరు గొడవలు పడకూడదు.. మీరంతా కలిసి ఒకటిగా ఉండాలి. టైంకు తిని నిద్రపోవాలి. ఆరోగ్యం కాపాడుకోవాలి అంటూ మిస్సమ్మ చెబుతూ ఏడుస్తుంటే.. అమ్ము బాధగా ఎవరికి చెప్తున్నావు మిస్సమ్మ ఇదంతా అని అడుగుతుంది. దీంతో మీకే చెప్తున్నాను.. మీ అందరికీ చెప్తున్నాను అంటుంది. దీంతో అంజు అదేంటి..? అప్పగింతలులా చెప్తున్నావు.. అంటుంది. ఆనంద్‌ బాధగా నువ్వు మాతోనే ఉంటావు గా మిస్సమ్మ మళ్లీ ఇవవ్నీ చెప్పడం ఎందుకు..? అని అడగ్గానే.. మనోహరి నవ్వుతూ చంభా, భాగీ స్వరం చూస్తుంటే.. ఈ నైటే జంప్‌ అయ్యేలా ఉంది అంటుంది. దీంతో చంభా కూడా అవును పంతులు గారు వీలైనంత త్వరగా ఇంటి నుంచి దూరంగా వెళ్లిపోమ్మని చెప్పారు కదా.. అంటూ నవ్వుతుంది.

ఇక ఆకాష్‌ కూడా చెప్పు మిస్సమ్మ ఎందుకు మాకు ఇదంతా చెప్తున్నావు.. ఏదో సెండాఫ్‌ ఇస్తున్నట్టు మాట్లాడుతున్నావేంటి..? అని అడగ్గానే.. సెండాఫ్‌ కాదు నేను బుజ్జమ్మతో బిజీగా ఉంటాను కదా అందుకే మిమ్మల్ని సరిగ్గా చూసుకోలేనని చెప్తున్నాను అంతే.. అనగానే.. నువ్వు మమ్మల్ని చూసుకోవడం ఏంటి మిస్సమ్మ ఇక నుంచి మేమే నిన్ను చూసుకుంటాము అని చెప్పగానే.. అంజు కూడా నీ బాధ్యత, బుజ్జమ్మ బాధ్యత మాదే అని మేము ఎప్పుడో డిసైడ్‌ అయిపోయాము అంటుంది. అవును మిస్సమ్మ ఇన్నాళ్లు నువ్వు మమ్మల్ని ఎలా చూసుకున్నావో నిన్ను బుజ్జమ్మను మేము అలాగే చూసుకుంటాము అని ఆనంద్‌ చెప్పగానే.. ఆకాష్‌ కూడా నీ పనులు బుజ్జమ్మ పనులు అన్ని మేమే చూసుకుంటాము.. అంటాడు. అమ్ము కూడా ఏడుస్తూ.. నీ విలువ తెలియక నీకు ఇన్నాళ్లు దూరం ఉన్నాము మిస్సమ్మ. నిన్ను అనరాని మాటలు అన్నాము మమ్మల్ని క్షమించు అంటూ ఏడుస్తుంటే.. మిస్సమ్మ కూడా ఏడుస్తూ.. అక్కడి నుంచి వెల్లిపోతుంది.

Advertisement

తర్వాత రాత్రికి అమర్‌ నిద్రపోతుంటే.. మిస్సమ్మ నిద్ర లేచి పాపను తీసుకుని అమర్‌ కాళ్లు మొక్కి అక్కడి నుంచి వెళ్లిపోతుంది. ఉదయం నిద్ర లేవగానే అమర్‌, మిస్సమ్మ కోసం ఇళ్లంతా వెతుకుతాడు. ఎక్కడా మిస్సమ్మ కనిపించకపోయే సరికి అందరినీ పిలిచి మిస్సమ్మ ఎక్కడుందని అడుగుతాడు. అందరూ తాము చూడలేదని చెప్తారు. ఇంతలో రాథోడ్‌ వచ్చి సార్‌ సీసీటీవీ పుటేజీ చూస్తే సరిపోతుంది కదా అంటాడు. దీంతో అమర్‌ ఫుటేజీ చూసి షాక్‌ అవుతాడు. మిస్సమ్మ ఇల్లు వదిలేసి వెళ్లిపోవడం చూసి బాధపడతాడు. ఇంతలో నేటి నిండు నూరేళ్ల సావాసం సీరియల్ ఎపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: మిథున రాశిలోకి శుక్రుడు – ఆ ఐదు రాశులకు గజలక్ష్మీ యోగం – అపర కుబేరులు అవ్వడం ఖాయం

 

Related News

గుడ్ న్యూస్ చెప్పిన బిగ్ బాస్ జంట.. మరో బిడ్డకు ఆహ్వానం!

మాధురి రాథోడ్ తల్లిపై ఈశ్వర్ సాయి భార్య ఊహించని కామెంట్స్!

Nindu Noorella Saavasam Serial Today Episode September 5th  ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండను తిట్టిన మనోహరి  

Gundeninda Gudigantalu : సీరియల్ లవర్స్ కు షాక్.. రోహిణి ఇక కనిపించదా..?

Gundeninda GudiGantalu Today episode: రోహిణికి దిమ్మతిరిగే షాక్.. శృతి దెబ్బ అదుర్స్.. రోహిణి మాస్టర్ ప్లాన్ ..?

Illu Illalu Pillalu Today Episodes: విశ్వం ప్లాన్ సక్సెస్.. ధీరజ్ కోసం ప్రేమ కన్నీళ్లు.. అడ్డంగా బుక్కయిన ధీరజ్..

Ninnu kori Serial Today Episode September 5th ‘నిన్ను కోరి’ సీరియల్‌: డాక్టర్ ను బెదిరించి నిజం తెలుసుకున్న విరాట్  

Intinti Ramayanam Today Episode: గుండెలు పగిలేలా ఏడ్చిన అక్షయ్.. అయ్యో కన్నీళ్లు తెప్పించే సీన్.. పల్లవి ఫుల్ హ్యాపీ..

Big Stories

Advertisement
×