E-Paper
Advertisement

Nindu Noorella Saavasam Serial Today February 13th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: అమ్మవారిలా మారిపోయిన మిస్సమ్మ 

Nindu Noorella Saavasam Serial Today February 13th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: అమ్మవారిలా మారిపోయిన మిస్సమ్మ 
Advertisement

Nindu Noorella Saavasam Serial Today Episode:

మనోహరి, చంభా ఇద్దరూ కలిసి హోమం దగ్గర నుంచి బిల్డింగ్‌ పైకి వెళ్తారు. షూటర్‌ ఇంకా షూట్‌ చేయలేదన్న ఇరిటేషన్‌తో మనోహరి వెళ్తుంది. అక్కడ షూటర్‌ దెబ్బలతో పడిపోయి ఉంటాడు. ఆయన్ని చూసిన మనోహరి షాక్‌ అవుతుంది. రేయ్‌ ఏమైందిరా అని అడుగుతుంది. దీంతో షూటర్‌ మేడం నేను మిమ్మల్ని షూట్‌ చేద్దామనే అంతా రెడీ చేసుకున్నాను.. ఈవిడ ఫోన్‌ చేసి షూట్‌ చేయ్‌ అని చెప్పింది. అప్పుడే ట్రిగర్‌ మీద నొక్కబోతుంటే సరిగ్గా అప్పుడే అప్పుడే అంటుంటే.. అప్పుడే ఏం జరిగిందో చెప్పు.. అనగానే.. అప్పుడు ఒకరు వచ్చారు మేడం.. అంటాడు ఎవరు అని అడగ్గానే.. అమ్మవారు అని చెప్పగానే.. అమ్మవారు రావడం ఏంటి..? అని మనోహరి అంటుంది.

చంభా మాత్రం ఏ అమ్మవారు అయ్యా..? అని అడగ్గానే.. గుడిలో అమ్మవారు అని షూటర్‌ చెప్పగానే.. చంభా షాక్‌ అవుతుంది. అప్పుడే షూటర్‌ తనను అమ్మవారు వచ్చి అడ్డుకున్నది కొట్టింది చెప్తాడు. నా గన్‌ ను ముక్కలు ముక్కలు చేసింది మేడం.. నన్ను కూడా రక్తం వచ్చేలా కొట్టింది మేడం నాకే కాదు మేడం మీకు కూడా వార్నింగ్‌ ఇచ్చింది ఇంకోసారి ఇలా జరిగితే అందరిని చంపేస్తానంది మేడం కళ్లు మూసి తెరిచేసరికి అమ్మవారు వెళ్లిపోయారు అమ్మ. నేను ప్రాణాలతో బయటపడ్డాను అంటాడు. చంభా భయంతో మనోహరి నేను చెప్పాను కదా..? ఏదో దైవ శక్తి ఆ పిల్లకు తోడుగా ఉందని .. అది సాక్ష్యాత్తు ఆ అమ్మవారే అని ఇప్పుడు నీకు అర్థం అయిందా..? అనగానే

Advertisement

మనోహరి కోపంగా ఇంక ఆపుతావా..? వచ్చింది అమ్మవారు కాదు.. ఆ దేవత కాదు.. ఆ వేషంలో ఏవరో మనిషి వచ్చారు అని చెప్పగానే.. షూటర్‌ ఆమె మనిషి కాదు మేడం.. ఆమె అమ్మవారే.. అని చెప్తాడు. చంభా కూడా అవును మనోహరి హోమం జరిగింది. అమ్మవారి గుడిలోనే కదా..? అంటుంది. దీంతో మనోహరి కోపంగా ఆగు.. భయంతో వాడి కళ్లు బైర్లు కమ్మాయి.. మూఢనమ్మకంతో నీ కళ్లు మూసుకుపోయాయి. మన ప్లాన్‌ తెలుసుకుని ఎవరో కావాలనే రివర్స్‌ ప్లాన్‌ చేశారు. ఎవరో ఏంటి..? ఆ భాగీయే చేసి ఉంటుంది. అదే అమ్మవారిలా వచ్చి ఉంటుంది. వీణ్ని భయపెట్టి మన ప్లాన్‌ పాడు చేసి వెళ్లిపోయింది. ఒసేయ్‌ భాగీ.. అంటూ అరుస్తుంది. కట్‌ చేస్తే.. ప్లాష్‌ బ్యాక్‌ రివీల్‌ అవుతుంది.  గుడిలో ఉన్న మిస్సమ్మ, కరుణ, రాథోడ్‌ ఆలోచిస్తుంటారు. మిస్సమ్మ ఏదో మాట్లాడుతూ సడెన్‌గా ఆగిపోతుంది. అటూ ఇటూ చూస్తుంది. ఎదురుగా బిల్డింగ్‌ లోంచి అమర్‌ను ఎయిమ్‌ చేసిన షూటర్‌ మిస్సమ్మకు కనబడతాడు. షూటర్‌ను చూసిన మిస్సమ్మ షాక్‌ అవుతుంది. అంటే అర్జెంట్‌గా నేను అమ్మవారి రూపం వేసుకోవాలి అంటుంది. అనుకున్న వెంటనే వెళ్లి అమ్మవారి వేషం వేసుకుని వస్తుంది.

అమ్మవారి వేషంలో మిస్సమ్మను చూసిన కరుణ, రాథోడ్‌ అద్బుతంగా ఉందని చెప్తారు.. రాథోడ్‌ నవ్వుతూ… మిస్సమ్మ నువ్వు సూపర్‌.. అసలు మీరు అమ్మవారిలా కాకుండా.. భాగుమతిలా వెళ్లి ఉంటే.. ఇంకా బాగుండేది మిస్సమ్మ అంటాడు. దీంతో మిస్సమ్మ త్వరలో అది కూడా జరుగుతుంది రాథోడ్‌.. నేను భాగీలా మనోహరికి ఎదురుపడే రోజు దగ్గర పడింది అని చెప్పగానే.. కరుణ ఏం మాట్లాడుతున్నావే పోయి పోయి ఆ సైతాన్‌కు ఎదురుపడతావా..? అని అడగ్గానే.. మరి ఇంకెన్నాళ్లు దాక్కోమంటావు.. నేను బయటపడి దాని మోసాన్ని బయటపెట్టాలి అనగానే.. రాథోడ్‌ కూడా అవును మిస్సమ్మ ఆ మనోహరి విష సర్పం లాంటిది. తోకతొక్కితేనే పాము బుస్సు మంటుంది. అలాంటిది మీరు ఈ రోజు తన పడగ మీదనే కొట్టారు.. పగ బడుతుంది మిస్సమ్మ అని చెప్పగానే.. ఆ మనోహరిది పగ అయితే నాది ప్రతికారం రాథోడ్‌.. ఐదేళ్లు ఇంటికి దూరంగా  బుజ్జమ్మతో వెళ్లిపోయి భయపడుతూ బతికాను.. నాకంత నకరం చూపించిన మనోహరిని  అంత తేలిగ్గా వదులుతానా..? దానికి అంతకు మించిన నరకం చూపిస్తాను అంటుంది. రాథోడ్‌, కరుణ ఫ్రౌడ్‌గా చూస్తుంటారు.  ఇంతలో నేటి నిండు నూరేళ్ల సావాసం సీరియల్ ఎపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: మిథున రాశిలోకి శుక్రుడు – ఆ ఐదు రాశులకు గజలక్ష్మీ యోగం – అపర కుబేరులు అవ్వడం ఖాయం

Advertisement

 

Related News

సీరియల్స్‌లో మాత్రమే జరిగే వింతలు ఇవి .. నిజ జీవితంలో ఇలా జరిగితే?

బిగ్ బాస్ 10 కంటెస్టెంట్ గా సుధీర్ రెడ్డి కన్ఫర్మ్…పోస్ట్ వైరల్!

బిగ్ బాస్ 10 ఫైనల్ కంటెస్టెంట్స్ వీరే.. దశావతారం వర్కౌట్ అవుతుందా?

కృష్ణాష్టమి స్పెషల్.. ‘రాధా’గా మారిన అనసూయ.. వీడియో వైరల్!

అవినాష్, అరియానా మధ్య గొడవలు నిజమేనా? బయటపెట్టిన శ్రీముఖి!

Nindu Noorella Saavasam Serial Today Episode September 4th  ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ఆత్మ కోసం ప్రచండ ప్రత్యేక పూజ  

Gundeninda GudiGantalu Today episode: మీనాను దెబ్బ అదుర్స్.. సంజుకు దిమ్మతిరిగే షాక్.. బాలుకు రాఖీ కట్టిన మౌనిక..

Ninnu kori Serial Today Episode September 4th ‘నిన్ను కోరి’ సీరియల్‌: చంద్రకు నిజం తెలిసిందన్న మందర – షాక్‌ అయిన మాయ      

Big Stories

Advertisement
×