Nindu Noorella Saavasam Serial Today Episode: మనోహరి వచ్చి అంజు కట్టిన పేకమేడలను కూల్చేసి ఎవ్వరూ కూడా ఫినిష్ లైన్ దాటలేరని డిస్సపాయింట్ చేసి వెళ్లిపోతుంది. వెంటనే అమర్, మిస్సమ్మ, అమ్ము, ఆకాష్, ఆనంద్ అందరూ వచ్చి పేకమేడలు కడతారు. మనోహరి షాకింగ్‌గా చూస్తుంది. అమ్ము కోపంగా అంజుతో మేము కలిస్తే తనను మేము కాపాడుకోగలం ఆంటీ.. అని చెప్తుంది. దీంతో ఆనంద్ కూడా మేము అంజుకు తోడుగా ఉండి ఫినిష్ లైన్ దాటిస్తాం ఆంటీ అంటాడు. మనోహరిలో చిన్నగా నవ్వుకుని మీరు ప్రయత్నం చేయగలరేమో కానీ ఫలితం దక్కదు ఆనంద్ ఎందుకంటే ఎవరో ఫినిష్ లైన్ చేరతారో ముందే రాసిపెట్టి ఉంటుంది అని మనసులో అనుకుంటుంది.
ఇంతలో ఆకాష్ తన తల రాతలో ఏదైనా తప్పుగా రాస్తే దాన్ని చెరిపేసి మళ్లీ కొత్తగా రాస్తాం అంటాడు. రేయ్ నేను మాట్లాడుతుంది కార్డ్స్ గురించి కాదురా మీ చెల్లెలి జీవితం గురించి రేపటితో దాని జీవితం ఫినిష్ అయిపోతుంది. ఫినిష్ లైన్ వరకు ఎలా తీసుకెళ్తారు అని మనసులో అనుకుంటుంది. ఇంతలో శివరాం మా అంజు పాపకు ఎవరైనా హాని తలపెట్టాలనుకుంటే అదే వారికి ఆఖరి క్షణం అవుతుంది అంటాడు. మా ఆయుష్షు పోసైనా మా అంజు పాపను కాపాడుకుంటాం అంటుంది నిర్మల. ఇంతలో రాథోడ్ మరింత ఆవేవంగా ఎదుటివాడు ఎంతటి బలవంతుడైనా ఎదురెళ్లి మరీ మా అంజు పాపను కాపాడుకుంటాం అంటాడు. ఇక మిస్సమ్మ కూడా ఈ ఇంట్లో ఎవరైనా అంజు ఒంటరైతపోతుంటే చూస్తూ ఊరుకుంటారా..? అంజు ఓటమి చేరాలంటే ఇంత మందిని దాటి రావాలి అంటూ వార్నింగ్ ఇస్తుంది. ఇక ఫైనల్‌గా అమర్ అదంతా సులువు కాదు మనోహరి అంజుకు తోడుగా మేమంతా ఉన్నాము అని చెప్తాడు. అంజు హ్యాపీగా మనోహరి ఆంటీ చూశారు కదా నేను ఎంత ట్రై చేసినా ఫినిష్ లైన్ దాటలేను అన్నారు కదా..? ఇప్పుడు చూశారా నా ఫ్యామిలీ అంతా నా పక్కనే ఉండి అందరూ నన్ను ఎలా దాటించారో అని చెప్తుంది. దీంతో మనోహరి షాకింగ్ గా చూస్తుండిపోతుంది.
తర్వాత కలకత్తా ఆశ్రమం నుంచి మథర్ రణవీర్ కాల్ చేస్తుంది. అంజలి గురించి నిజం చెప్పాలనుకుంటుంది. కానీ రణవీర్ కాల్ లిఫ్ట్ చేయడడు. కంటిన్యూగా కాల్ చేస్తుంది. దీంతో రణవీర్ కాల్ లిఫ్ట్ చేసి మథర్ ను తిట్టి కాల్ కట్ చేస్తాడు. దీంతో మథర్ పాప వాళ్ల మథర్ ఉంది కదా ఆమెకు చేస్తాను అని మనోహరికి కాల్ చేస్తుంది. అప్పుడే మనోహరి, రణవీర్ దగ్గరకు వస్తుంది. మథర్ కాల్ లిఫ్ట్ చేసి నేను బిజీగా ఉన్నాను తర్వాత కాల్ చేస్తాను అని మనోహరి కూడా కాల్ కట్ చేస్తుంది. కోపంగా చెప్పు రణవీర్ ఏం చేద్దాం అనుకుంటున్నావు నువ్వు.. అసలు అమర్ ఉండగా అంజలిని టచ్ అయినా చేయగలనని ఎలా అనుకున్నావు నువ్వు అని అడుగుతుంది. దీంతో టెన్షన్‌గా రణవీర్ నాకెందుకో అమర్‌కు నిజం తెలిసిపోయిందేమో అనిపిస్తుంది అని చెప్తాడు.
మనోహరి టెన్షన్ పడుతుంది. ఏం నిజం తెలుసు.. మన గురించి ఏమైనా తెలిసింది.. నేను అరుంధతిని చంపిన విషయం తెలిసిందా..? లేదా నువ్వు అంజలిని చంపాలనుకుంటున్న విషయం తెలిసిందా..? అని అడుగుతుంది. అంజలిని కిడ్నాప్ చేసింది. నేనే అన్న విషయం. అమర్ అంజలి కోసం కోల్‌కతా వచ్చినప్పుడు అమర్ కళ్లల్లో నేను కోపం చూశాను. నేను చెప్పింది అబద్దం అని తెలిసినా సైలెంట్‌గా అంజలిని తీసుకుని వెళ్లిపోయాడు. అంటూ రణవీర్ చెప్పగానే.. లేదు అమర్‌కు నిజం తెలిసే చాన్సే లేదు. ఒకవేల నిజంగా అమర్‌కు నిజం తెలిసి ఉంటే అసలు నువ్వు ఇక్కడ నిలబడి ఉండేవాడివే కాదు. నిన్ను ఎప్పుడో చంపేసేవాడు అంటూ భయపడుతుంది.
దీంతో రణవీర్ మనోహరి ఇప్పుడు అమర్‌కు నిజం తెలిసినా తెలియకపోయినా..? నేనైతే అంజలిని చంపాలి నాకు వేరే ఆప్షన్ లేదు అంటాడు. దీంతో మనోహరి భయంగా చూడు రణవీర్ నేను నీకు ఇప్పటికే ఎంతో సాయం చేశాను. ఇక ఇది చేయలేను అంటాడు. దీంతో రణవీర్ ఈ ఒక్కసారి నాకు సాయం చేయ్ అంజలి చనిపోయి ఆస్థి నా చేతికి వస్తే నీతో నాకు అవసరం లేదు అని చెప్పగానే సరే నాకు కొంచెం టైం ఇవ్వు అంటూ మనోహరి వెళ్లిపోతుంది.
తర్వాత నిర్మల, శివరాం కలిసి పంతులును ఇంటికి పిలిపిస్తారు. పంతులు రాగానే మీరొక్కసారి వీళ్లిద్దరి జాతకాలు చూసి శోభనానికి ముహూర్తం పెట్టండి అని చెప్తుంది. దీంతో పంతులు జాతకాలు చూసి వీళ్లిద్దరి కార్యానికి నేను ముహూర్తం పెట్టలేనమ్మా అంటాడు పంతులు. దీంతో మిస్సమ్మ ఏదైనా సమస్య ఉందా పంతులు గారు అని అడుగుతుంది. పంతులు పెద్ద సమస్యే ఉందమ్మా..? పెద్ద కొడుక్కి.. పెద్ద కోడలికి శోభనం జరిగితేనే వీరిరువురికి శోభనం జరగుతుంది. అని చెప్పి పంతులు అక్కడి నుంచి వెళ్లిపోతాడు.
తర్వాత రూంలో ఉన్న మిస్సమ్మ దగ్గరకు అమర్ వస్తాడు. మిస్సమ్మను పట్టుకుని ఏమైంది అని అడుగుతాడు. దేనికి ఏమైంది అని మిస్సమ్మ అడుగుతుంది. వినోద్ చిత్ర ఒకే రూంలో ఎందుకు ఉండటం లేదని అడుగుతాడు. మిస్సమ్మ మీ వల్లే అని చెప్తుంది. దీంతో అమర్ షాకింగ్ గా అర్థం కాక నావల్లా అంటూ అడుగుతాడు. దీంతో మిస్సమ్మ సిగ్గుపడుతూ మీకు నాకు శోభనం జరిగితే తప్పా వాళ్లకు శోభనం చేయకూడదట. ఒకవేళ అలా జరిగితే చిత్ర ప్రాణానికే ప్రమాదం అంట అని చెప్తుంది. దీంతో అమర్ ఆలోచనలో పడిపోతాడు. ఇంతటితో నేటి నిండు నూరేళ్ల సావాసం సీరియల్ ఎపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: ఫస్ట్ టైం అరుణాచలం వెళ్తున్నారా..? అయితే ఈ విషయాలు తప్పక తెలుసుకోవాల్సిందే..?