E-Paper
Advertisement

Kissik Talks: బిగ్ బాస్ ఎంట్రీపై రేఖ రియాక్షన్.. అలా అనేసారేంటి?

Kissik Talks: బిగ్ బాస్ ఎంట్రీపై రేఖ రియాక్షన్.. అలా అనేసారేంటి?
Advertisement

Kissik Talks:ప్రపంచవ్యాప్తంగా అతిపెద్ద రియాలిటీ షోగా గుర్తింపు దక్కించుకున్న బిగ్ బాస్.. ప్రతి భాషలో కూడా ప్రేక్షకులను విపరీతంగా అలరిస్తోంది. ముఖ్యంగా వరుస సీజన్లను పూర్తి చేసుకుంటూ ఎంతోమంది సెలబ్రిటీలకు అటు కామన్ పీపుల్స్ కి ఒక జీవితాన్ని అందిస్తోంది అనడంలో సందేహం లేదు. పైగా సెలబ్రిటీలకు ఆర్థికంగా అండగా నిలుస్తూ.. గొప్ప షో గా పేరు సొంతం చేసుకుంది. అలాంటి ఈ షోలో చిన్న అవకాశం వస్తే చాలు అని అనుకునే వాళ్ళు చాలామంది ఉంటారు .కానీ మరి కొంతమంది ఈ షో కి వెళ్లిన తర్వాత వచ్చే నెగెటివిటీ ని తట్టుకోలేక ముందే బిగ్ బాస్ షోని నిరాకరిస్తూ ఉంటారు.

బిగ్ బాస్ ఎంట్రీ పై రేఖ కామెంట్..

అయితే ఇప్పుడు తెలుగులో బిగ్ బాస్ సీజన్ 10 ప్రారంభం కాబోతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే నటీనటుల ఎంపిక విషయంపై సోషల్ మీడియాలో చర్చ జరుగుతుండగా.. మరొకవైపు బిగ్ టీవీ ఎక్స్ క్లూజివ్గా నిర్వహిస్తున్న కిస్సిక్ టాక్స్ కార్యక్రమానికి గెస్ట్ గా వచ్చిన ప్రముఖ హీరోయిన్ రేఖ బిగ్ బాస్ ఎంట్రీపై చేసిన కామెంట్లు అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాయి. బిగ్ బాస్ హౌస్ లోకి అవకాశం వస్తే మీరు వెళ్తారా? అని ప్రశ్నించగా..” బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళాలి అంటే చాలా గట్స్ ఉండాలి. అన్ని కెమెరాల ముందు.. అన్ని రోజులు.. గొడవలు పడుతూ.. టాస్కులు చేసుకుంటూ ఉండాలి అంటే వేరే రకమైన గట్స్ ఉండాలి. ఎవరెవరైతే అక్కడికి వెళ్లారో వారందరికీ హాట్సాఫ్.. ఆ ధైర్యం నాకు లేదు. గెస్ట్ గా వెళ్లాలంటే వెళ్తాను.. మరేదైనా క్రియేటివ్ ఐడియాస్ ఉంటే వెళ్తాను. కంటెస్టెంట్ గా అంటే నా వల్ల కాదు అంటూ బిగ్ బాస్ కి వెళ్లడంపై తన అభిప్రాయాన్ని చెప్పుకొచ్చింది.

Advertisement

also read:Nag Ashwin: శుభవార్త చెప్పిన డైరెక్టర్ నాగ్ అశ్విన్.. జీవితంలో మరో కొత్త అధ్యాయం!

చిరంజీవి సినిమాలో హీరోయిన్..

ఇకపోతే ఎలాంటి ప్రాజెక్టు కావాలి అని ప్రశ్నించగా.. ప్రేక్షకులతో నన్ను కలిపే ప్రాజెక్టు ఏది వచ్చినా సంతోషమే అంటూ తెలిపింది. సడన్ గా కోటి రూపాయలు ఇస్తే ఏం చేస్తారు? అని ప్రశ్నించగా ..సగం నా దగ్గర ఉంచుకొని, సగం ఎవరికైతే నిజంగా అవసరం అవుతుందో వారికి ఆ డబ్బు ఇచ్చేస్తాను అంటూ తెలిపింది. ఇక ఎవరైనా నా గురించి గాసిప్ స్ప్రెడ్ చేయాలి అనుకుంటే చిరంజీవి సినిమాలో హీరోయిన్ అనే గాసిప్ స్ప్రెడ్ చేయండి అంటూ గాసిప్ చేసేవారికి హింట్ ఇచ్చింది ఈ ముద్దుగుమ్మ. మొత్తానికి అయితే రేఖ వేదవ్యాస్ చేసిన ఈ కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

Advertisement

Related News

బిగ్ బాస్ 10లో లేడీ కంటెస్టెంట్స్ సింపథీ ప్లే చేస్తున్నారా?

ఎక్స్‌ప్రెస్ హరిపై మనసు పారేసుకున్న బుల్లితెర నటి.. ఎవరంటే?

హీటెక్కిన బిగ్ బాస్ 10 నామినేషన్.. మళ్లీ అతడే టార్గెట్!

మిథిలేష్ పరువు తీయాలనుకున్న బిగ్ బాస్.. కట్ చేస్తే?

ఓటీటీ లవర్స్ కు పండగే.. ఆ రెండు మస్ట్ వాచ్..

వర్షిణితో ముఖేష్ పులిహోర.. బిగ్ బాస్ హౌస్‌లో ఏంటా పనులు? పబ్లిక్ చూస్తోంది!

Podarillu Gopika : చక్రీ ప్యాన్స్ కు గుడ్ న్యూస్.. గోపిక అవుట్..

Intinti Ramayanam TRP Rating : ‘గుండెనిండా గుడిగంటలు’ టీఆర్పీ రేటింగ్..సెప్టెంబర్ హైలెట్ ఎపిసోడ్స్..

Big Stories

Advertisement
×