Satyabhama Today Episode November 27 th : నిన్నటి ఎపిసోడ్ లో.. మహదేవయ్య ఇంటి బయట గంగ ధర్నా చేస్తుంది. క్రిష్ తన కొడుకే అని.. తనకు తన కొడుకును వెంటనే ఇవ్వాలని నిరాహార దీక్ష చేస్తుంది. ఎవరో వచ్చి ఇలా లొల్లి చేస్తుందేంటి అని అనుకుంటారు. కానీ గంగ ఎంట్రీతో మహదేవయ్యకు తన ఇంట్లోనే శత్రుత్వం పెరుగుతుంది. భైరవి కూడా గంగకి నిజంగానే తాళి కట్టాడేమో అని అనుమానిస్తుంది. ఇంట్లో వాళ్ళందరూ ఒక మాటగా గంగా నిజంగానే ఈయన భార్యనా అని చర్చలు జరుపుతారు. దానికి మహదేవయ్య నాకు గంగ తెలియదు గోదావరి తెలియదు అని అంటాడు. ఇక సత్య మహదేవయ్యను ఇంకా ఇరికించాలని నరసింహ కు ఫోన్ చేస్తుంది. గంగా అనే ఆవిడని మహదేవయ్యా రెండో పెళ్లి చేసుకున్నాడని చెబుతుంది. అతను గంగ దగ్గరకు వచ్చి ఆమెకు సపోర్ట్ చేస్తాడు. మీడియా కూడా గంగకు మద్దతుగా నిలుస్తుంది. సత్య గంగ కు ఫోన్ చేస్తుంది. స్లోగన్లు బాగా ఉన్నాయి కంటిన్యూ చెయ్ మహదేవయ్య దిగి వస్తాడు అనేసి అంటుంది. గంగ చేస్తున్న నినాదాలకు మహదేవయ్య కుటుంబం మొత్తం బయటికి వచ్చి చూస్తుంది. నరసింహ యాక్షన్ చూసి గంగా షాక్ అవుతుంది. వీడెవడు నాకన్నా ఎక్కువ ఓవరాక్షన్ చేస్తున్నాడని ఆలోచిస్తుంది. నరసింహ మహదేవయ్యకు వార్నింగ్ ఇస్తాడు. గంగా నా చెల్లెలు లాంటిది గంగకు న్యాయం జరిగేంతవరకు నేను నిరాహార దీక్ష చేస్తానని మీడియా ముఖంగా చెప్తాడు.. అటు ఎమ్మెల్యే టిక్కెట్ పోయే పరిస్థితి కూడా ఉందని భయపడతాడు. మైత్రితో మాట్లాడొద్దని హర్షకు వార్నింగ్ ఇస్తారు. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. క్రిష్ తన తండ్రికి ఇలా జరిగిందని ఆలోచిస్తూ బాధపడతాడు. అప్పుడే సత్య అక్కడికి వస్తుంది. బాధపడుతున్నావా క్రిష్ అని అడుగుతుంది. మా బాబుకి ఇలా ఎందుకు జరుగుతుంది అని భయంగా ఉంది సత్యా అని అంటాడు. అసలు నిజం ఏంటో తెలుసుకోవాలని అందరికీ ఉంటుంది కదా ఈరోజు గంగ లాంటి వాళ్ళు చాలామంది రావచ్చు. ఏంటో తెలిస్తే మీ బాపు రేంజ్ ఎక్కడికో వెళ్ళిపోతుంది అది ఆలోచించవా అనేసి అంటుంది. ఆ గంగ పీక పట్టుకుంటే అసలు నిజం బయటికి వస్తుందనేసి క్రిష్ అంటాడు. అలా చేస్తే నువ్వు అడ్డంగా ఇరుక్కుంటావనేసి సలహా ఇస్తుంది. మరి ఏం చేయమంటావ్? రోజురోజుకీ మాకు సమస్యలు ఎక్కువైపోతున్నాయి బాపుని అలానే వదిలేయమని చెప్తావా అనేసి అంటాడు. ఆ గంగ మీద పోలీస్ కంప్లైంట్ ఇస్తే అసలు నిజం బయటికి వస్తుందని క్రిష్ అంటాడు. దానికి సత్య మీకు పోలీసులకు పడదు కదా మరి పోలీస్ కంప్లైంట్ ఎలా ఇస్తున్నావు అనేసి నిలదీస్తుంది. ఆ గంగ మీద లాటి పడితే అసలు ఊరుకుంటారా ఇప్పుడు ఆమెకి మద్దతు పెరిగింది ఆమెకేం జరిగినా మీరే చేయించారని అందరూ అనుకుంటారు అనేసి క్రిష్ కంట్రోల్ చేస్తుంది సత్య.. ఆ డిఎన్ఏ టెస్ట్ ఏంటో చేస్తే అసలు నిజం బయటికి వస్తుంది కదా అప్పుడు మీ బాపు ఎక్కడికో వెళ్లిపోతాడు అనేసి అంటుంది.
ఇక భైరవి బాధపడటం చూసి రేణుక సెటైర్లు వేస్తుంది. ఈ మగాళ్లంతా మంచోళ్ళు అనుకుంటాము అత్తమ్మ మనకు తెలియకుండానే మనం వెనకాల ఇంకొకటి చేస్తారు అనేసి నాకు ఇప్పుడే బాగా అర్థమైందని చురకలాంటిస్తుంది. మీతో పోలిస్తే ఆ గంగ చాలా స్లిమ్ముగా నాజూగ్గా ఉంది అందుకే మామ అక్కడికి వెళ్ళాడు అనేసి అంటుంది. మీ కొడుకుకి ఈ బుద్ధులు ఎక్కడ నుంచి వచ్చాయా అని అనుకున్నాను వాళ్ళ నాన్న నుంచే వచ్చాను నాకు ఇప్పుడే తెలిసింది అత్తమ్మ. మీది నాది ఇంచుమించు ఒకే పరిస్థితి అనేసి సెటైర్లు వేస్తుంది రేణుక. ఆ గంగను రెండో పెళ్లి చేసుకున్నాడు మావయ్య ఇక మీరు నా గదిలోకి రావాలి ఆ గంగా మీ గదిలోకి వెళుతుంది అనేసి అనగానే బైరవి కోపంతో రగిలిపోతుంది. ఇక నుంచి వెళ్లిపోని అరుస్తుంది. ఇక పంకజం కూడా ఎంట్రీ ఇస్తుంది. పెద్ద కోడలు అన్నమాట తప్పు లేదమ్మా అదే నిజం మీరు స్లిమ్ గా లేరు ఆ గంగ చాలా స్లిమ్ గా ఉంది అందుకే అయ్యగారు అటు వెళ్ళారని అనిపిస్తుందని అంటుంది. జిమ్ కి వెళ్ళాలి అప్పుడే నాజుగ్గా తయారవుతారు అనేసి అనగానే నీకు జీతం వివరిస్తున్నారు? నేను ఆ గంగనా ఇక వచ్చే నెల నుంచి ఆ గంగను అడిగి జీతం తీసుకో అనేసి అనగానే పంకజం అక్కడి నుంచి వెళ్ళిపోతుంది.
పొద్దున్నే లేవగానే గంగకు సపోర్టు పెరుగుతుంది. వరంగల్ లోని మహిళా సంఘాలన్నీ గంగ దగ్గర ఉంటారు. మీడియా సపోర్ట్ కూడా గంగ కు ఉంటుంది. మహదేవయ్య ఫ్యామిలీ బయటకు రాగానే మీడియా చేసిన తప్పు దాచి పెట్టుకోవడానికి మీరు లోపల ఉన్నారా అనేసి అడుగుతుంది. గంగ నిజంగానే మీ భార్య కాదని మీరు నిజం ఒప్పుకున్నారా అసలు ఎలా నిరూపిస్తారు అది నిరూపించండి ఆ తర్వాత మాట్లాడదామని ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తారు. మహిళా సంఘం లీడర్లు కూడా మహాదేవయ్యను గట్టగానే అడుగుతారు.. క్రిష్ ను ఇవ్వమని పెద్ద నాటకం ఆడుతుంది. క్రిష్ నిజంగానే తన కన్న కొడుకు అని అనుకోనెలే పెర్ఫామేన్స్ చేస్తుంది. ఇక సత్య కూడా బాగా చేస్తున్నావని సపోర్ట్ ఇస్తుంది. మొత్తానికి మహదేవయ్య డిఎన్ఏ టెస్ట్ కి ఒప్పుకుంటాడు. మొదట ఆలోచించిన గంగ నాతో పాటి నువ్వు కూడా చేయించుకోవాలని మహదేవయ్యకు కండిషన్ పెడుతుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది. రేపటి ఎపిసోడ్లో సత్య మహదేవ ఇద్దరు మాట్లాడుకుంటారు. సత్యనే ఇదంతా చేయించిందని సత్య నిజం బయట పెడుతుంది. దానికి మహదేవయ్యా షాక్ అవుతాడు. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..