Raga madhuri:సాధారణంగా సినిమాలలో నటించే నటీనటులకు కాస్ట్యూమ్స్ గురించి పెద్దగా భయం ఉండదు. ఎందుకంటే అన్నీ కూడా ఆ చిత్ర నిర్మాతలే భరిస్తారు. కానీ సీరియల్స్ విషయంలో ఇలా జరగదు. సీరియల్స్ లో నటించే నటీనటుల కాస్ట్యూమ్స్ మొత్తం అందులో నటించే వారే సొంతంగా తెచ్చుకోవాల్సి ఉంటుంది. ఇక మగవారికి అయితే పెద్దగా కష్టం ఉండదు కానీ ఆడవారికి కాస్ట్యూమ్స్ విషయంలో ఖర్చు మాత్రం భారీగా పెరిగిపోతుందని అనడంలో సందేహం లేదు. ఒక చీర తీసుకుంటే అందుకు తగ్గట్టుగా మ్యాచింగ్ గా అన్ని వస్తువులను తీసుకోవాల్సి ఉంటుంది. ఇక ఆడవారు సీరియల్స్ లో అందంగా కనిపించడానికి ఖర్చు కూడా బోలెడు అవుతుంది. దీంతో వారికొచ్చే రెమ్యునరేషన్ కాస్ట్యూమ్స్ కే సరిపోతుందని పలువురు నటీమణులు వాపోతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా మరొకటి కూడా సీరియల్స్ ద్వారా వచ్చే సంపాదన కాస్ట్యూమ్స్ కే సరిపోతుంది అంటూ ఆవేదన వ్యక్తం చేస్తోంది. మరి ఆమె ఎవరో ఇప్పుడు చూద్దాం.
వచ్చే సంపాదన కాస్ట్యూమ్స్ కే సరిపోతుంది..
ఆమె ఎవరో కాదు బుల్లితెర సీరియల్స్ లో తనకంటూ ఒక మంచి గుర్తింపు దక్కించుకున్న రాగ మాధురి (Raga Madhuri). తమకిచ్చే పేమెంట్లలోనే కాస్ట్యూమ్స్ కూడా తీసుకోవాలని తెలిపింది రాగ మాధురి. ఫంక్షన్స్ ఉన్న సమయంలో మాత్రమే ఖర్చు తగ్గుతుందని, ట్రావెలింగ్ వారు ఇచ్చే మొత్తం కంటే ఎక్కువ ఖర్చవుతుందని ఆమె తెలిపింది. ఆమె మాట్లాడుతూ.. నేను తల్లి పాత్రలు ఎక్కువగా చేస్తూ ఉంటాను. కాబట్టి ఈ చీరలు భవిష్యత్తులో ఉపయోగపడతాయేమో తెలీదు. మా దగ్గర ఉన్న చీరలు ఎవరికైనా ఇచ్చేయడమే తప్ప వాటితో మేమేం చేయలేము. ఇక షాపింగ్ కి వెళ్ళినప్పుడు ప్రతిసారి కూడా దాదాపు రూ.50 వేల వరకు ఖర్చవుతుంది. నెల లేదా రెండు నెలలకు ఒకసారి కచ్చితంగా షాపింగ్ కి వెళ్తాము. ఇక నేను నటించిన జగద్దాత్రి సీరియల్ కోసమైతే ఏకంగా 400 చీరలు ఉపయోగించాను. ఆ చీరలన్నీ కూడా వేస్ట్ అయిపోయాయి. వేరే ఆర్టిస్టులు ఆ చీరలు ఏం చేస్తారో నాకు తెలియదు. ఇక కన్నడ, బెంగాలీ, తమిళ్ వాళ్ళు ఇక్కడ ఎక్కువగా పనిచేస్తున్నారు. వాళ్ళ రెమ్యూనరేషన్ తో పోలిస్తే మాకు కొంచెం ఎక్కువగానే ఉంటుంది అంటూ రాగ మాధురి చెప్పుకొచ్చింది.
ఇతర భాషా నటులపై రాగ మాధురి కామెంట్స్..
అలాగే ఇతర భాష ఇండస్ట్రీ నటీనటులపై మాట్లాడుతూ.. వాళ్ళు ఎక్కువ సమయం షూటింగ్లోనే పాల్గొంటారని ప్రొడ్యూసర్లు చెబుతారు. మేము కొన్ని సీన్స్ విషయంలో రిస్ట్రిక్షన్స్ పెడతాము. కాబట్టి వారు అలా చేస్తున్నామని తెలిపారు. మొత్తానికైతే అలాంటి వాళ్ల వల్ల మా పొట్టకూటి పై కొడుతున్నారు. ఈ ప్రొఫెషన్ పై బ్రతకడం అనేది చాలా కష్టం గా మారింది అంటూ సీరియల్స్ లో నటించే నటీనటుల గురించి చెప్పుకొచ్చి అందరిని ఆశ్చర్యపరిచింది. ముఖ్యంగా సీరియల్స్ లో నటించే వారికి వేస్టేజ్ ఎక్కువగా కనిపిస్తుందని కూడా తెలిపింది. ఏది ఏమైనా సీరియల్స్ లో రోజుకొక కాస్ట్యూమ్ తో ప్రేక్షకులను ఆకట్టుకోవాలి కాబట్టి వాళ్లకు వచ్చే జీతం కంటే ఖర్చు ఎక్కువ అని చెప్పుకొచ్చింది రాగ మాధురి.