E-Paper
Advertisement

బిగ్ బాస్ లో తొక్కుడు బిళ్ళ ఆడాలంటే..తేజస్వి కామెంట్స్ వైరల్

బిగ్ బాస్ లో తొక్కుడు బిళ్ళ ఆడాలంటే..తేజస్వి కామెంట్స్ వైరల్
Advertisement

Tejaswi Madivada:తేజస్వి మదివాడ ..సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ RGV తీసిన ఐస్ క్రీం సినిమాతో బాగా పాపులర్ అయింది.ఇక తాజాగా కాకమ్మ కథలు టాక్ షో కి హోస్ట్ గా చేస్తున్న తేజస్వి తాజాగా ఒక యూట్యూబ్ ఇంటర్వ్యూలో ప్రముఖ రియాలిటీ షో  బిగ్ బాస్ పై చేసిన కామెంట్స్ తెగ వైరల్ అవుతున్నాయి.ఇంతకీ ఈ అమ్మడు ఆ షో పై ఎలాంటి కామెంట్స్ చేసిందో ఇప్పుడు చూద్దాం.

బిగ్ బాస్ ఎలా ఉంటుంది అంటే ..

బిగ్ బాస్ లో నీ ఎక్స్ పీరియన్స్ ఏంటి ప్రశ్నకి తేజస్వి సమాధానమిస్తూ మనల్ని ఒక డబ్బాలో పెట్టి పైకి కిందికి తిప్పి కింద పెడితే మన ఫీలింగ్ ఎలా ఉంటుందో బిగ్ బాస్ షో అలా ఉంటుందని చెప్పుకొచ్చింది. బిగ్ బాస్ షో పుటేజ్ చూసుకున్నప్పుడు ఇది మనమేనా అని మనకి మనమీదే డౌట్ వస్తుందని,బిగ్ బాస్ అనేది ఒక సోషల్ ఎక్స్పెరిమెంట్ అని అయితే గుడ్ అవుతుందని,లేదంటే డెడ్ అవుతుందంటూ సెన్సేషన్ కామెంట్స్ చేసింది.

అక్కడ చీటింగ్ ఎక్కువ 

Advertisement

బిగ్ బాస్ కి వెళ్లోచ్చిన తర్వాత మైండ్ మొత్తం బ్లాక్ అయిపోయిందని చెప్పుకొచ్చింది.షో లో పాటలు పెట్టకముందే లేచి బ్రష్ చేసుకొని రెడీగా ఉండేదానిని అని, నాకు చిన్నప్పటి నుండి రన్నింగ్ రేస్ వంటి  గేమ్స్ అంటే చాలా ఇష్టమని,ముఖ్యంగా ఎలాంటి పరిమితులు లేకుండా సరదాగా ఆటలు ఆడవచ్చనే ఉద్దేశంతోనె ఈ బిగ్ బాస్ షోకి వెళ్లానని తెలిపిస్తుంది.అయితే బిగ్ బాస్ కి వెళ్ళిన తర్వాత అసలు ఆటల్లా లేవని ,అక్కడ అంతా చీటింగ్ ఎక్కువైపోయిందని వాపోయింది.

తొక్కుడు బిళ్ళ ఆడాలంటే ప్లానింగ్

ముఖ్యంగా బిగ్ బాస్ షో లో తొక్కుడు బిళ్ళ ఆడాలంటే ప్లానింగ్ చేస్తారని,అక్కడే మనుషులు ఎంత హీనంగా బిహేవ్ చేస్తారో అర్థమయిందని చెప్పుకొచ్చింది.ఇక  బిగ్ బాస్ లో తానూ అందరితో మాట్లాడే బదులు రోటీలు చేసుకోవడం ఉత్తమం అని ఏకంగా రెండు వందల రోటీలు చేసేదాన్నని పేర్కొంది. ఇక బిగ్ బాస్ షోకి తాను 25 ఏళ్ల వయసులో ఒకసారి,ముప్పై ఏళ్ల వయసులో..ఇలా రెండు సార్లు బిగ్ బాస్ హౌస్ కి వెళ్లానని చెబుతూ కార్ కొనుక్కోవాలనే మరోసారి బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టానని సరదాగా వ్యాఖ్యానించింది.

మన క్యారెక్టర్ వాళ్ళ చేతిలో పెట్టడమే

Advertisement

25 ఏజ్ లో వెళ్ళినప్పుడు అందరిని రక్కేసి ,కొట్టేసానని ,కాని 30 ఏజ్ లో వెళ్ళినప్పుడు శాంతంగా ఉన్నానని చెప్పుకొచ్చింది.ఇక రెండు సార్లు వెళ్ళిన ఆ షో లని చూస్తె తనని తాను ఒక కేజ్ లోపెట్టుకొని చూసినట్టు ఉందని,అదొక హ్యూమన్ ఎక్స్పరిమెంట్ లా అనిపించిందని తెలిపింది.ఇక షో వల్ల పాజిటివ్ ,నెగెటివ్ రెండూ ఉంటాయని,అయియే ఈ మధ్య షో నుండి వస్తున్నవారందరికి ఎక్కువగా పాజిటివ్ జరుగుతుందని చెప్పుకొచ్చింది .

also read :యష్‌పై రష్మిక కామెంట్.. పదేళ్ల తర్వాత మళ్లీ రచ్చ

మొత్తానికి మన క్యారెక్టర్ వాళ్ళ చేతిలో పెట్టడమే అని సంచలన కామెంట్స్ చేసింది తేజస్వి.మొత్తానికి ఇప్పటికే రెండు సార్లు బిగ్ బాస్ లోకి అడుగు పెట్టిన ఈ భామ ఇలా బిగ్ బాస్ షో గురించి మాట్లాడిన మాటలు ఇపుడు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.

Tags

Related News

ఈ గుర్తింపు బిగ్ బాస్ పెట్టిన భిక్ష.. రోహిత్ తీరుపై కౌశల్ మండిపాటు!

Karthika Deepam 2 Serial Today Episode October 5th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: మాలినికి షాక్ ఇచ్చిన సూరజ్ – పీఏగా జ్యోత్స్న అపాయింట్            

Ninnu kori Serial Today Episode October 5th ‘నిన్ను కోరి’ సీరియల్‌: సామ్రాట్ ను జీవన్ చంపేస్తాడా..? చంద్ర కనిపెడుతుందా..? 

Nindu Noorella Saavasam Serial Today Episode October 5th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మనోహరి తనను చంపేస్తుందని పార్థు పసిగడతాడా..?    

Monday Tv Movies : మూవీ లవర్స్ కు పూనకాలే.. వీటిని మస్ట్ వాచ్..

సుప్రీత ఆస్తుల విలువ ఎంతో తెలుసా? చిట్టా మొత్తం బయటపెట్టిందిగా?

పవన్ కళ్యాణ్ రాజకీయాల పై సుప్రీత కామెంట్స్… పండగ చేసుకున్నాం అంటూ!

సుప్రీత నెల సంపాదన ఎంతో తెలుసా? అందం కోసం అంత ఖర్చు చేస్తుందా?

Big Stories

Advertisement
×