trinayani serial today Episode: నయని ఆత్మను అయితే చూశాం ఇక ఏం చేయాలో ఆలోచిద్దాం అని చెప్పి అఖండ స్వామి వెళ్లిపోతాడు. ఇంతకీ మా అక్కేనా తను అని సుమన అడగ్గానే నువ్వు ఎలా అనుకుంటే ఆలా అంటూ నయని వెళ్లిపోతుంది. ఏమైనా ఉంటే ఉదయం మాట్లాడుకుందాం అని దురందర చెప్పగానే అందరూవెళ్లిపోతారు.
తిలొత్తమ్మ బాధపడుతుంటే.. ఏంటి మమ్మీ పెద్ద మరదలు ఆత్మను చూశావా..? అని వల్లభ అడగ్గానే.. నువ్వంటే భయపడుతున్నావు కానీ నాకు బాధగానే ఉంటుంది వల్లభ. నడిపి కోడలు బతికే ఉంది ఎప్పటికైనా ఇంటికి తీసుకురావొచ్చు అనుకుంటే ఇప్పుడు చనిపోయిందని చెప్తున్నారు అంటుంది. ఇంతలో సమన వస్తుంది. ఓహో చిన్న కోడలు రావడం చూసే మమ్మీ ఇంత డ్రామా ఆడుతుందా అనుకుంటాడు వల్లభ. ఇలా వచ్చావేంటి సుమన అని తిలొత్తమ్మ అడగ్గానే.. మా అక్క గురించి తెలుసుకుందామని వచ్చాను అత్తయ్యా అంటుంది.
మీ అక్క ఇంకెక్కడ ఉంది సుమన మీ అక్క ఎప్పుడో చనిపోయింది అని చెప్తుంది. అయితే ప్రాణం లేకపోతే డెడ్ బాడీ ఎక్కడో ఉండాలి కదా..? అంటాడు. దీంతో అయితే మా అక్క పార్థివ శరీరం ఎక్కడో ఉండాలి కదా నిజమే అంటుంది. కానీ మా అక్క చనిపోయి ఉంటే.. నేను ఇంకా నమ్మలేకపోతున్నాను. ఎందుకంటే మాది రక్త సంబంధం కదా..? అనగానే.. అయితే ఓకే రేపటి వరకు నీకు ఫ్రూవ్ చేస్తాను అంటూ తిలొత్తమ్మ వెళ్లిపోతుంది. సుమన మమ్మీ ఎక్కడికి వెళ్తుంది అని వల్లభ అడగ్గానే.. ఆత్మల దగ్గరకు వెళ్తుందేమో అంటుంది సుమన. వల్లభ భయంతో అక్కడి నుంచి పారిపోతాడు. ఇలాంటి వాణ్ని హాసిని అక్కా ఎలా కట్టుకుందో ఏమో.. అనుకుంటుంది సుమన.
నయని దగ్గరకు వెళ్లి రోజు రోజుకు తిలొత్తమ్మ వాళ్ల పిచ్చి ఎక్కువవుతుందని దురందర చెప్పగానే.. వాళ్లు చెప్తుంది నిజమే పిన్ని అంటుంది. నిజంగానే నా ఆత్మ వచ్చింది అని చెప్పగానే దురందర, విక్రాంత్ షాక్ అవుతారు. నీ ఆత్మ రావడం ఎందుకు అని అడుగుతారు. దీంతో తాను స్పృహ కోల్పోయేలా తిలొత్తమ్మ వాళ్లు చేసిన ప్లాన్ గురించి త్రినేత్రి దేహం సోపాలో పడిపోయింది నేను ఆత్మగా రావడానికి వీలు కల్పించింది ఇక నేను ఆత్మగా వచ్చానంటే ప్రాణాలతో లేననే నిర్ణయానికి వచ్చి ఉంటారు అని నయని చెప్పగానే… అయితే ఇప్పుడు మరో సమస్య వచ్చింది వదిన.. తొందరపడకుండా ఉండాలి. లేదంటే మనమే వాళ్లకు క్లూ ఇచ్చినట్టు ఉంటుంది. అయితే తెల్లారనివ్వండి ఏం జరుగుతుందో చూద్దాం అంటుంది దురందర.
ఉదయం గురువు గారు వస్తారు. అనుకోకుండా సడెన్ గా వచ్చారేంటి గురువు గారు అని హాసిని అడుగుతుంది. సంక్రాంతి పండగ ఉందని ముందే వచ్చారన్న మాట అంటుంది సుమన. ఆయన మన ఇంట్లో మంచినీళ్లే తాగరు.. అలాంటిది ఇక్కడే ఎలా ఉంటారు అని విక్రాంత్ చెప్పగానే.. నా ఆద్యాత్మిక తపస్సుకు భంగం కలుగుతుందని గురువు చెప్పగానే.. మీరు ఉంటానంటే మీకు విడిగా ఒక గది నిర్మిస్తామని చెప్తాడు. అచేతనంగా శరీరం పడి ఉన్న చోట నేను ఉండకూడదు నాయన అంటాడు గురువు. దీంతో అందరూ షాక్ అవుతారు.
చూశారా ఇంట్లో శవం ఉందని ఆయన ఇన్ డైరెక్టుగా చెప్పాడు అంటుంది. దీంతో నిత్యం శివం అనే మేము శవం ఎందుకు పెట్టుకుంటాము అని హాసిని అడుగుతుంది. తొందరపడకండి జీవం లేని శరీరం అని చెప్పాను కానీ పార్థివ శరీరం అని చెప్పలేదు కదా అంటాడు గురువు. ఇంతలో తిలొత్తమ్మ… నయని ఆత్మను నేను చూశాను. నా కొడుకు మీద ఒట్టేయమన్నా వేస్తాను అని చెప్తుంది. ముందు మా ఆయన తల మీద చేయి పెట్టండి భస్మాసురిడిలా భస్మం అయిపోతాడు అని హాసిని అంటుంది.
ఏయ్ నీ పసుపుకుంకుమలు పోతాయి కదే అని దురందర చెప్తుంది. ఇలాంటి వాళ్లు నాకే కాదు ఈ భూమికి కూడా భారమే అంటుంది హాసిని. ఇంతలో ఇంట్లో ఉన్న శవాన్ని చూపించమని వల్లభ, తిలొత్తమ్మలకు చెప్తుంది నయని. ఇంట్లో శవం ఉండటమేంటి వదిన అంటాడు విక్రాంత్. స్వామి మీరేం చేయాలనుకుంటున్నారో అదే చేయండి అంతా మంచే జరుగుతుంది అంటుంది నయని. నీ నమ్మకమే నిజం అవుతుంది నయని అంటాడు గురువు.
ఇంతలో ఆ దేహాన్ని చూపించేది నేను కాదు.. గాయత్రి పాప అని గురువు చెప్పగానే.. అందరూ షాక్ అవుతారు. స్వామి గాయత్రి పాప చూపిస్తుందా..? అని నయని అడగ్గానే.. అవును నయని తనకైతే ఎప్పుడు ఏం చేయాలో బాగా తెలుసు అంటాడు గురువు. నయని.. గాయత్రి పాపను కిందకు దించగానే.. గాయత్రి మెల్లగా నడుచుకుంటూ వెళ్తుంది. గాయత్రి వెనకాలే అందరూ ఫాలో అవుతుంటారు. ఇంతటితో త్రినయని సీరియల్ ఈరోజు ఏపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: సకల బాధలను దూరం చేసే షణ్ముఖి రుద్రాక్ష ధారణ ఎవరు చేయాలి..?